Brahmana Sankshema Vedika: బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఆధ్వర్యం లో "అఖిలభారత..

బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఆధ్వర్యం లో "అఖిలభారత సకల నదీ జలాల మహారుద్రాభిషేఖం"

బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఆధ్వర్యం లో  "అఖిలభారత సకల నదీ జలాల మహారుద్రాభిషేఖం"
బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఆధ్వర్యం లో ఈ ఏప్రిల్ 16 ఆదివారం నాడు హైదరాబాద్, ఉప్పల్ దగ్గరున్న మేడిపల్లి లోని M కన్వెన్షన్ లో అత్యద్భుతమైన `` అఖిలభారత సకల నదీ జలాల మహారుద్రాభిషేఖం``అనే కార్యక్రమానికి నిర్వహిస్తున్నారు. దేశం లో ఉన్న సర్వనదుల నుంచి జలాలను సేకరించి మహారుద్రాభిషేకాన్ని నిర్వహిస్తున్నారు. దాదాపు 146 పవిత్ర నదీ జలాలను సేకరించి వేదపండితుల మంత్రోత్సహాల నడుమ మహా రుద్రాభిషేఖం ఉంటుంది. ఏప్రిల్ 16 నాడు అభిషేఖం ముందుగా నదీజలాల ఊరేగింపు భారీఎత్తున జరుగుతుంది. 

ఈ కార్యక్రమానికి ద్వాదశ జ్యోతిర్లింగాల ప్రధాన అర్చకులు పాల్గొంటున్నారు.ఉదయం జరిగే నదీజలాల ఊరేగింపు లో వీరు పాల్గొంటున్నారు. ఆతరువాత జరిగే రుద్రాభిషేఖం వారందరి సమక్షం లో ప్రారంభమౌతుంది . మధ్యాహ్నం భోజన ఏర్పాట్లు పూర్తి అయినా వెంటనే 12 మంది జ్యోతిర్లింగాల ప్రధాన అర్చకులకు ఘనంగా సన్మాన సత్కార్యాలు ఉంటాయి. 

ఈ వేడుక కు ముఖ్య అతిధులు గా ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ బంగారయ్య శర్మ గారు, సినీ నటులు శ్రీ సాయికుమార్, రాజకీయ నాయకులూ శ్రీమతి వాణీదేవి, మంథాని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు,శ్రీ వేణుగోపాల చారి, శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం, మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు , world బ్రాహ్మణ ఫెడరేషన్ అద్యక్షులు శ్రీ పాండే గారు తదితరులు పాల్గొంటున్నారు. ఇతర వివరాలకు 9059550280 కు కాల్ చేయగలరు
Brahmana Sankshema Vedika

Watch Today's Deals on Amazon

More Press News