Srinivas Goud: ఉస్మానియా యూనివర్సిటీ స్కాలర్ కుటుంబానికి చేయూతనిచ్చిన మంత్రి..
Add ap7am to your home Screen

ఉస్మానియా యూనివర్సిటీ స్కాలర్ కుటుంబానికి చేయూతనిచ్చిన మంత్రి శ్రీనివాస్ గౌడ్!

ఉస్మానియా యూనివర్సిటీ స్కాలర్ కుటుంబానికి చేయూతనిచ్చిన మంత్రి శ్రీనివాస్ గౌడ్!

ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన రీసెర్చ్ స్కాలర్ శ్రీనాధ్ సోదరుడు యరకల వేణుగోపాల్ ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి గత మూడు నెలలుగా ఆసుపత్రిలో కోమాలో ఉండి చికిత్స పొందుతూ ఆర్థికంగా చితికిపోయిన కుటుంబానికి రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కి ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన రీసెర్చ్ స్కాలర్స్ ల విజ్ఞప్తి మేరకు వెంటనే స్పందించి యరకల శ్రీనాధ్ కుటుంబానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ అండగా నిలిచి ముఖ్యమంత్రి కేసీఆర్ సహాయ నిధి నుండి రూ. 4,00000/- చెక్కును మంత్రి అందించారు.

గ్రామీణ ప్రాంతాల ప్రజలకు,ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఆసరాగా నిలుస్తోందని ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్ లు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి, మంత్రి శ్రీనివాస్ గౌడ్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర tటీజీవో నాయకులు రవీందర్ గౌడ్, ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్స్ కేశబోయిన రవికుమార్, సురేష్, గిరి, శ్యామ్, యాకుబ్, మహేష్, నవీన్ , శ్రీరామ్, లవన్ లు పాల్గొన్నారు.

Srinivas Goud
Hyderabad
Telangana

Watch Today's Deals on Amazon

More Press News