osmania university: ఉస్మానియా విశ్వవిద్యాలయం సమగ్ర అభివృద్ధికి అన్ని చర్యలు..
Add ap7am to your home Screen

ఉస్మానియా విశ్వవిద్యాలయం సమగ్ర అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం: ఇన్చార్జీ వీసీ

ఉస్మానియా విశ్వవిద్యాలయం సమగ్ర అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం: ఇన్చార్జీ వీసీ

బుధవారం నాడు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇన్చార్జీ వీసీ అర్వింద్ కుమార్ లేడిస్ హస్టల్ వద్ద లెడ్ లాంప్ లను స్విచ్ ఆన్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సబులిటి కింద పదిలక్షల వ్యయంతో లేడీస్ హస్టల్ క్లష్టర్ మొత్తం సరిపోయే విధంగా దాదాపు1.75కిలోమీటర్లు పరిధిలో ఈ బల్బులును ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా యంబి ఇల్యుమినేషన్ ఇంజనీరింగ్ ప్రతినిధులను అభినందించారు. లేడీస్ హస్టల్ లో రక్షణ కొరకు సీసీ కెమెరాలు,కంచె లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఇంతేకాకుడా ప్రఖ్యాతి గాంచిన ఆర్ట్స్ కాలేజ్, యునివర్సిటీ లైబ్రరీలు సర్వాంగ సుందరంగా కనిపించే విధంగా ప్రత్యేక లైటింగ్ సిస్టమ్ ను ఏర్పాట్లు చేయడానికి తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. విశ్వవిద్యాలయంలో పచ్చదనం పెంచే లక్ష్యంగా యునివర్సిటీ, ఉద్యానవన శాఖల అధికారులు సంయుక్తంగా పనిచేస్తున్నారని అన్నారు. యునివర్సిటీలో మౌలిక సదుపాయాల కల్పనకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రెడ్డి, ప్రొఫెసర్ కృష్ణా రెడ్డి ఆర్ట్స్, సైన్స్ కాలేజీల ప్రిన్సిపాల్లు రవిందర్, ప్రతాప్ రెడ్డి,యునివర్సిటీ ఉన్నాధికారులు హరిసింగ్ నాయక్, నిర్మల, భిక్ష్మా, రాజేందర్ నాయక్, యంబి ఇల్యుమినేషన్ ఇంజనీరింగ్ ప్రతినిధులు కునాల్, గణేష్, నితిన్ తదితరులు పాల్గొన్నారు.

osmania university
Hyderabad
Telangana

Watch Today's Deals on Amazon

More Press News