Vijayawada: విజ‌య‌వాడ నగరాభివృద్ధికి నిధులు కేటాయించండి: సీఎం జ‌గ‌న్..
Add ap7am to your home Screen

విజ‌య‌వాడ నగరాభివృద్ధికి నిధులు కేటాయించండి: సీఎం జ‌గ‌న్ ని కోరిన మేయ‌ర్ భాగ్య‌ల‌క్ష్మి

విజ‌య‌వాడ నగరాభివృద్ధికి నిధులు కేటాయించండి: సీఎం జ‌గ‌న్ ని కోరిన మేయ‌ర్ భాగ్య‌ల‌క్ష్మి
విజ‌య‌వాడ న‌గ‌రాభివృద్దికి నిధులు కేటాయించాల‌ని ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని తాడేప‌ల్లి క్యాంపు కార్యాయ‌లయంలో మేయ‌ర్ రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి, వైసీపీ నాయ‌కులు రాయ‌న న‌రేంద్ర‌తో క‌లిసి కోర‌డం జ‌రిగింది. ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌తో ప్ర‌జ‌లు సంతోషంగా ఉన్నార‌ని, కోన్ని సాంకేతిక కార‌ణాల కార‌ణంగా విజ‌య‌వాడలో కొంత మందికి అంద‌ని అమ్మవోడి, పింఛ‌న్‌ల‌ను మంజూరు చేయవ‌ల‌సింగా సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్ల‌డంతో వారు సానుకూలంగా స్పందిచార‌ని, త‌ర్వ‌లో అర్హులైన వారికి అమ్మబ‌డి, ఫించ‌న్ అంద‌జేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు.

మహిళా సాధికారత చరిత్రలో దేశంలోనే కనీవినీ ఎరుగని రీతిలో అమ్మ ఒడి, వైయస్ఆర్ ఆసరా, వైయస్ఆర్ చేయూత వంటి పథకాలతో మహిళల ఆర్థిక, సామాజిక, రాజకీయ విప్లవాలకు ఏకకాలంలో శ్రీకారం చుట్టింది జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అని అన్నారు. ఈ తరం పిల్లలు ఎదిగిన తరవాత, రాబోయేకాలంలో అప్పటి ప్రపంచంలో ఎదుర్కోబోయే సవాళ్లను దృష్టిలో ఉంచుకుని విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారన్నారు.

గ్రామ స్వరాజ్యానికి అర్థం చెపుతూ వార్డు/గ్రామ సెక్రెటేరియట్‌లను, వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేశాం. దాంతో గ్రామం మారింది. గ్రామ పరిపాలన మారింది. అవినీతి లేకుండా ప్రభుత్వం డబ్బు నేరుగా ప్రజలకు చేరుతోంద‌న్నారు. కోవిడ్‌ మహమ్మారి ఏడాదికి పైగా మనకు సవాలు విసిరినా.. మన పేదలు బతకటానికి మన జగనన్న సంక్షేమ పథకాలే శ్రీరామరక్ష అయ్యాయి. ఒక్కపైసా అవినీతి లేకుండా 100 శాతం పూర్తిగా లబ్ధిదారునికి చేరే విధంగా, దళారీ వ్యవస్థ లేకుండా ప్రతి పైసా ప్రజల అకౌంట్లలో జమ అవుతుంద‌న్నారు.
Vijayawada
Jagan
Andhra Pradesh

Watch Today's Deals on Amazon

More Press News