Vijayawada: విజయవాడలో అక్రమ నిర్మాణాలను తొలగించిన పట్టణ ప్రణాళికా..
Add ap7am to your home Screen

విజయవాడలో అక్రమ నిర్మాణాలను తొలగించిన పట్టణ ప్రణాళికా విభాగము అధికారులు

విజయవాడలో అక్రమ నిర్మాణాలను తొలగించిన పట్టణ ప్రణాళికా విభాగము అధికారులు
విజయవాడ: న‌గ‌రంలో జ‌రుగుతున్న అక్ర‌మ నిర్మాణాల‌పై న‌గ‌ర పాల‌క సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు డ్రైవ్ నిర్వ‌హించి, క‌ఠిన చ‌ర్య‌లు చేప‌ట్టారు. అందులో భాగంగా శ‌నివారం వన్ టౌన్, సితార సెంటర్, సింగ్ నగర్, సూర్యారావు పేట మ‌రియు గుణ‌ద‌ల ఎన్టీఆర్ కాల‌నీ త‌దిత‌ర‌ ప్రాంతాలలో గల అక్రమ నిర్మాణాలను తొలగించారు.

భవిష్యత్తులో ప్రజలు అక్రమ నిర్మాణాలను చేపట్టిన ఎడల సదరు అక్రమ నిర్మాణాలను తొలగించటమే కాకుండా అట్లు అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై చట్ట రీత్యా కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్య‌క్ర‌మంలో అసిస్టేంట్ సిటీ ప్లాన‌ర్‌, ఇన్‌చార్జి డిప్యూటి సిటీ ప్లాన‌ర్ జె.సూరజ్ కుమార్, ఎం.రవి రాం కుమార్, టి.పి.ఎస్, వశీం బేగ్, టి.పి.ఎస్, ఎన్.గిరి, టి.పి.ఎస్ మరియు మతీన్, టి.పి.బి.ఓ త‌దిత‌రులు ఉన్నారు.
Vijayawada

Watch Today's Deals on Amazon

More Press News