Hyderabad: జూబ్లీహిల్స్ చెస్ట్ హాస్పిటల్ స్థలంలో మల్టీ సూపర్..
Add ap7am to your home Screen

జూబ్లీహిల్స్ చెస్ట్ హాస్పిటల్ స్థలంలో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం.. సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన స్థానిక కార్పొరేటర్లు

జూబ్లీహిల్స్ చెస్ట్ హాస్పిటల్ స్థలంలో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం.. సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన స్థానిక కార్పొరేటర్లు
హైదరాబాద్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని చెస్ట్ హాస్పిటల్ స్థలంలో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని కార్పొరేటర్లు ఇవాళ సీఎం కేసీఆర్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియొద్దీన్, వెంగళరావు నగర్ కార్పొరేటర్ దేదీప్య, యూసుఫ్ గూడ కార్పొరేటర్ రాజ్ కుమార్ పటేల్, రహ్మత్ నగర్ కార్పొరేటర్ సీఎన్. రెడ్డి, సోమాజీగూడ కార్పొరేటర్ సంగీతా యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Hyderabad
KCR

Watch Today's Deals on Amazon

More Press News