Hyderabad: గ్రేటర్ హైదరాబాద్ లో రెండో రోజు 22,399..
Add ap7am to your home Screen

గ్రేటర్ హైదరాబాద్ లో రెండో రోజు 22,399 మందికి వ్యాక్సిన్

గ్రేటర్ హైదరాబాద్ లో రెండో రోజు 22,399 మందికి వ్యాక్సిన్
హైదరాబాద్, మే 29: తెలంగాణ రాష్ట్రంలో కరోనా నియంత్రణలో భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రత్యేక వాక్సినేషన్ కార్యక్రమంలో రెండోరోజైన శనివారం నాడు 22,399 మందికి వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగింది. జీహెచ్ఎంసీ పరిధిలో శుక్రవారం ప్రారంభమైన మొదటి రోజు 21,666 మందికి వాక్సినేషన్ అందించగా నేడు అంతకుమించి 22,399 మందికి వ్యాక్సిన్ అందించారు.

నిత్య సేవకులుగా గుర్తించిన వివిధ రంగాలకు చెందిన వారికి పది రోజుల పాటు వాక్సిన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ ముప్పై సర్కిళ్లలో విస్తృత ఏర్పాట్లను చేపట్టింది. ముందుగానే గుర్తించిన వారికి ప్రత్యేక టోకెన్లను అందచేసి వారికి ఇచ్చే వాక్సినేషన్ సమయాన్ని కూడా ప్రత్యేకంగా పేర్కొనడంతో ఏ విధమైన ఇబ్బందులు లేకుండా కోవిడ్ నిబంధనలతో సజావుగా సాగింది. కాగా నగరంలో ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియను పలువురు ప్రజాప్రతినిధులు, జిహెచ్ఎంసీ కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్ పలు కేంద్రాలను సందర్శించి పరిశీలించారు.
Hyderabad
GHMC
Telangana

Watch Today's Deals on Amazon

More Press News