Etela Rajender: ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పౌరసరఫరాల ఉద్యోగులకు..
Add ap7am to your home Screen

ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పౌరసరఫరాల ఉద్యోగులకు వాక్సిన్: మంత్రి ఈటలకు మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి విజ్ఞప్తి

ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పౌరసరఫరాల ఉద్యోగులకు వాక్సిన్: మంత్రి ఈటలకు మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి విజ్ఞప్తి
హైదరాబాద్: పౌరసరఫరాల శాఖ, పౌరసరఫరాల సంస్థ ఉద్యోగులను మరియు రేషన్ డీలర్లను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించి వాక్సిన్ ఇప్పించాలని పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం నాడు బిఆర్కే భవన్లో మంత్రికి వినతిపత్రం అందజేశారు.

రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది కరోనా, లాక్ డౌన్ సమయంలో పౌరసరఫరాల ఉద్యోగులను అత్యవసర సర్వీసుల క్రింద గుర్తించడం జరిగింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉద్యోగులు లాక్ డౌన్ సమయంలో పూర్తిస్థాయిలో పని చేశారు. అత్యవసర సర్వీసులో ఉండటంతో ఎలాంటి మినహాయింపులు తీసుకోకుండా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు యాసంగిలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రైతుల నుండి ధాన్యం కొనుగోళ్లు జరిపారు.

అలాగే రేషన్ లబ్దిదారులకు రెండు నెలల పాటు రూ.1500 నగదు, ఐదు నెలల పాటు రేషన్ షాపుల ద్వారా అదనపు బియ్యాన్ని పంపిణీ చేయడం జరిగింది. బియ్యం పంపిణీలో కూడా రేషన్ డీలర్లు కీలకపాత్ర నిర్వహించారు. ఇప్పుడే యాసంగిలో ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. వచ్చే నెల నుండి అదనపు బియ్యాన్ని పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే చాలా చోట్ల అధికారులు, సిబ్బంది, రేషన్ డీలర్లు కరోనా భారినపడ్డారు.

అత్యవసర సేవల క్రింద పని చేసిన పౌరసరఫరాల సంస్థ ఉద్యోగులకు, రేషన్ డీలర్లకు మానవతా దృక్పథంతో డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, పోలీస్ డిపార్ట్మెంట్, జిహెచ్యంసి సిబ్బంది మాదిరిగానే ప్రంట్‌లైన్ వారియర్స్ క్రింద వాక్సిన్ ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు.

మిల్లింగ్ ఛార్జీలు చెల్లిస్తున్నాం: మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి

రైసు మిల్లర్లకు మిల్లింగ్ ఛార్జీలను నిలిపివేయలేదని ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. జిల్లాలో గన్నీ రికన్సిలేషన్, సీఎంఆర్ రికన్సిలేషన్ పూర్తి చేసుకున్న మిల్లర్ల వివరాలను కేంద్ర కార్యాలయానికి పంపించిన వెంటనే ఛార్జీలను చెల్లిస్తున్నామని తెలిపారు. గడిచిన వారంలో 7 కోట్ల రూపాయలను చెల్లించడం జరిగింది. రికన్సిలేషన్ పూర్తిచేసుకోవాల్సిన బాధ్యత మిల్లర్ల పైనే ఉందన్నారు.

కొనుగోలు కేంద్రాల నుండి వచ్చిన ధాన్యాన్ని ఎలాంటి తరుగు లేకుండా దించుకొని ట్రాక్ షీట్ లో తక్షణం నమోదు చేయాలని మిల్లర్లకు విజ్ఞప్తి చేశారు. ఏదైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకు వస్తే పరిష్కరించే ప్రయత్నం చేస్తామన్నారు.
Etela Rajender
Telangana

Watch Today's Deals on Amazon

More Press News