Md Mahamood Ali: రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ది, ప్రజా సంక్షేమమే లక్ష్యాలుగా..
Add ap7am to your home Screen

రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ది, ప్రజా సంక్షేమమే లక్ష్యాలుగా బడ్జెట్: హోం మంత్రి మహమూద్ అలీ

రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ది, ప్రజా సంక్షేమమే లక్ష్యాలుగా బడ్జెట్: హోం మంత్రి మహమూద్ అలీ
హైదరాబాద్: ప్రజా సంక్షేమం, అన్ని రంగాలలో రాష్ట్ర అభివృద్ధి లక్ష్యాలుగా 2021–22 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ ఉందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ పేర్కొన్నారు. కరోనా, లాక్‌డౌన్‌ ల కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం పడినప్పటికీ, ప్రజా సంక్షేమం, వ్యవసాయం, సాగునీరు, విద్య, వైద్యం, మౌలిక వసతుల రంగాలకు, హోం శాఖకు ఈ బడ్జెట్ లో పెద్ద పీట వేశారని హోం మంత్రి అన్నారు.

వెయ్యి కోట్ల బడ్జెట్ తో ద‌ళిత్ ఎంప‌వ‌ర్‌మెంట్ ప్రోగ్రామ్, వ్యవసాయ యాంత్రీకరణ కొరకు 1500 కోట్లు, భూ సమగ్ర సర్వే కోసం 400 కోట్లు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మికి 2750 కోట్లు, మెట్రో రైల్ ప్రాజెక్టుకు 1000 కోట్లు, రీజనల్ రింగ్ రోడ్ కొరకు 750 కోట్లు ఇలా అన్ని రంగాలకు, పథకాలకు భారీగా నిధులు కేటాయించ‌డం ప‌ట్ల మంత్రి సంతోషం వ్య‌క్తం చేశారు.

తన హోం శాఖకు 6,465 కోట్ల బ‌డ్జెట్ కేటాయింపులు చేసినందుకు ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్ రావుకు, ఆర్థిక మంత్రి హరీష్ రావుకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. దీనివల్ల, ప్రజలకు పోలీస్ సేవలు ఇంకా మెరుగ్గా అందించే వీలు కలుగుతుందని తెలిపారు.
Md Mahamood Ali
Telangana

Watch Today's Deals on Amazon

More Press News