Bird Flu: బర్డ్ ఫ్లూ నేపథ్యంలో అప్రమత్తమైన తెలంగాణ అటవీ..
Add ap7am to your home Screen

బర్డ్ ఫ్లూ నేపథ్యంలో అప్రమత్తమైన తెలంగాణ అటవీ శాఖ

బర్డ్ ఫ్లూ నేపథ్యంలో అప్రమత్తమైన తెలంగాణ అటవీ శాఖ
  • బర్డ్ ఫ్లూ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ వన్యప్రాణి విభాగం
  • అన్ని రాష్ట్రాల సీఎస్ లకు వన్యప్రాణి విభాగం ఐజీ రోహిత్ తివారీ లేఖ
  • కేంద్రం ఆదేశాల మేరకు చీఫ్ కన్సర్వేటర్లను, అన్ని జిల్లాల అటవీ అధికారులను అప్రమత్తం చేసిన పీసీసీఏఫ్ ఆర్.శోభ
హైదరాబాద్: హిమాచల్ ప్రదేశ్ తో పాటు ఇతర రాష్ట్రాల్లో చాలా పక్షలు చనిపోతున్నాయి. ఇందులో వలస పక్షులు కూడా ఉన్నాయి. వాటి నమూనాలను ఐసీఏఆర్-నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ ఎనిమల్ డిసీసెస్, భోపాల్ లో పరీక్షిస్తే హెచ్5ఎన్1 ఏవియన్ ఇన్‌ ఫ్లూయెంజా వైరస్ పాజిటివ్ గా ఉన్నట్లు నిర్ధరణ అయినట్లు కేంద్రం నిర్ధారించింది.

తాజా పరిస్థితుల్లో ఈ వైరస్ పెంపుడు జంతువులు, పక్షులకు విస్తరించే అవకాశం ఉంది. వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని రాష్ట్రాలు తక్షణమే అన్ని రకాల చర్యలు తీసుకోవాలి. పక్షులను పూర్తి స్థాయిలో పెంచడంతో పాటు నిఘా ఉంచాలి. ఏవైనా లక్షణాలు కనిపిస్తే అరికట్టేందుకు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచనలు జారీ చేసింది.

అన్ని రాష్ట్రాలు తక్షణమే తగిన చర్యలు తీసుకొని వ్యాధి వ్యాప్తి చెందకుండా చూడాలని కోరింది. ఈ నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల్లో పక్షులు కూడా ఈ వ్యాధి బారిన పడినట్లు సమాచారం. దీంతో తెలంగాణ అటవీ శాఖ కూడా అప్రమత్తం అయ్యింది. కేంద్రం ఆదేశాల మేరకు చీఫ్ కన్సర్వేటర్లను, అన్ని జిల్లాల అటవీ అధికారులకు పీసీసీఏఫ్ ఆర్.శోభ సమాచారం ఇచ్చారు.

జూ పార్క్ లతో పాటు, అటవీ ప్రాంతంలో ఏవైనా అసహజ మరణాలు ఉంటే నమోదు చేయాలని, తగిన పరీక్షల ద్వారా వ్యాధి నిర్ధారణ చేయాలని ఆదేశించారు. ఈ సీజన్ లో వలస పక్షుల సంచారం వుంటుందని వాటిని కూడా పర్యవేక్షించాలని తెలిపారు. ఎవరికైనా సంబంధించిన సమాచారం ఉంటే అటవీ శాఖ టోల్ ఫ్రీ నెంబర్ కు 18004255364 ఫోన్ చేయాలని కోరారు.
Bird Flu
Telangana

Watch Today's Deals on Amazon

More Press News