Md Mahamood Ali: తెలంగాణ హోంమంత్రిని కలిసిన పంజాబ్ జైళ్ల శాఖ..
Add ap7am to your home Screen

తెలంగాణ హోంమంత్రిని కలిసిన పంజాబ్ జైళ్ల శాఖ మంత్రి

తెలంగాణ హోంమంత్రిని కలిసిన పంజాబ్ జైళ్ల శాఖ మంత్రి
హైదరాబాద్: పంజాబ్ జైళ్ల శాఖ మంత్రి Sukhjinder S.Randhawa రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీని హైదరాబాద్ లోని హోంమంత్రి కార్యాలయంలో గురువారం నాడు కలిశారు. ఆయన జైళ్ల శాఖ అధికారులతో కలిసి తెలంగాణ రాష్ట్రంలోని జైళ్ల శాఖ స్థితిగతులను అధ్యయనం చేసేందుకు హైదరాబాద్ లోని వివిధ జైళ్లను సందర్శించారు.

రాష్ట్ర జైళ్ల శాఖలో ఖైదీలలో మార్పు తెచ్చేందుకు అమలు చేస్తున్న వివిధ పథకాల గురించి అధ్యయనం చేసేందుకు పంజాబ్ జైళ్ల శాఖ మంత్రి ఆధ్వర్యంలో అధికారుల బృందం తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్నది. ఈ సందర్భంగా రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ మాట్లాడుతూ ఖైదీలు చదువుకునేందుకు అన్ని సౌకర్యాలను కల్పించామని తెలిపారు.

వారు పని చేసేందుకు పరిశ్రమల యూనిట్ ను ఏర్పాటు చేశామని తెలియజేశారు. శిక్షాకాలం పూర్తి చేసుకున్న ఖైదీలకు జైలు శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పెట్రోల్ బంకుల్లో ఉపాధి కల్పిస్తున్నామని పేర్కొన్నారు. పంజాబ్ జైళ్ల శాఖ మంత్రి Sukhjinder S.Randhwa మాట్లాడుతూ గురువారం నాడు చర్లపల్లిలోని కారాగారాన్ని, ఓపెన్ ఎయిర్ జైలును సందర్శించామని తెలిపారు.

శుక్రవారం నాడు మరికొన్ని జైళ్లను పరిశీలిస్తామని తెలియజేశారు. ఈ సందర్భంగా చార్మినార్ మెమెంటోను పంజాబ్ మంత్రికి హోంమంత్రి బహుకరించారు. తెలంగాణ జైళ్ల శాఖ డిజి రాజీవ్ త్రివేది, ఐజి సైదయ్య, పంజాబ్ ప్రిజన్స్ ఏడిజిపి ప్రవీణ్ కె సింహా, SPS ఒబెరాయ్, తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
Md Mahamood Ali
Telangana
punjab

Watch Today's Deals on Amazon

More Press News