KCR: రామ్ రావ్ మహారాజ్ శివైక్యం.. సీఎం కేసీఆర్..
Add ap7am to your home Screen

రామ్ రావ్ మహారాజ్ శివైక్యం.. సీఎం కేసీఆర్ తీవ్ర సంతాపం

రామ్ రావ్ మహారాజ్ శివైక్యం.. సీఎం కేసీఆర్ తీవ్ర సంతాపం
బంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ తపస్వి పౌరా దేవి పీఠాధిపతి రామ్ రావ్ మహారాజ్ శివైక్యం చెందడం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. రామ్ రావ్ మహారాజ్ బంజారాల జీవితాల్లో మార్పు కోసం ఎన్నో సేవా కార్యక్రమాలను చేపట్టారని కొనియాడారు.

యావత్ భారతదేశంలోని బంజారాలను చైతన్య పరిచి చరిత్రలో చిరస్థాయిగా రామ్ రావ్ మహారాజ్ నిలిచిపోయారని సీఎం ప్రశంసించారు. రామ్ రావ్ మహారాజ్ స్ఫూర్తిని తెలంగాణ ప్రభుత్వం కొనసాగిస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలోని బంజారాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
KCR
Telangana

Watch Today's Deals on Amazon

More Press News