Etela Rajender: సీజనల్ వ్యాధులపై మంత్రి ఈటల సమీక్ష
Add ap7am to your home Screen

సీజనల్ వ్యాధులపై మంత్రి ఈటల సమీక్ష

సీజనల్ వ్యాధులపై మంత్రి ఈటల సమీక్ష
  • సీజనల్ వ్యాధులపై సమీక్ష నిర్వహించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్
  • హాజరైన డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డా.రమేష్ రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డా.శ్రీనివాస్
హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో సీజనల్ వ్యాధులు ప్రభలే అవకాశం ఉంది. జలుబు జ్వరాలతో బాధ పడే వారి సంఖ్య పెరిగింది. వీటి లక్షణాలు కరోనా లక్షణాలు ఒకే విధంగా ఉంటున్నాయి. అందుకే లక్షణాలు ఉన్న ప్రతిఒక్కరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

గ్రామాల నుండి పట్టణాల వరకు అన్నింటిలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది.. పంచాయతీ రాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వారితో కలిసి పని చేయాలని సూచించారు. ప్రజలకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించి వ్యాధులు ప్రబలకుండా చూడాలని కోరారు.

GHMC లో వర్షాలు మొదలైనప్పటి నుండి ఇప్పటివరకు 585 మెడికల్ క్యాంపులు నిర్వహించామని, 104 వాహనాల ద్వారా 50 మొబైల్ క్యాంప్స్ నిర్వహిస్తున్నామని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డా శ్రీనివాస్ వివరించారు. ఈ క్యాంపులు ద్వారా ఇప్పటివరకు 38516 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశామని తెలిపారు.

30,367 మందికి మాస్కులు, 2795 మందికి శానిటైసర్లు అందించామని తెలిపారు. రిలీఫ్ క్యాంపులలో కరోనా వ్యాప్తి జరగకుండా ఉండేందుకు లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఇప్పటివరకు లక్షణాలు ఉన్న 3406 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని ఇందులో 90 మందికి పాజిటివ్ అని నిర్ధారణ జరిగిందని తెలిపారు. వీరందరినీ నిర్దేశిత ఆసుపత్రిలో ఉంచి చికిత్స చేస్తున్నట్లు తెలియజేశారు.

హైదరాబాదులో ఉన్న ప్రతి హాస్పిటల్లో పైన 24 గంటలు డాక్టర్ ను అందుబాటులో ఉంచుతున్నామని, ఏ ప్రమాదం జరిగినా  వెంటనే చికిత్స అందించే విధంగా వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచామని డాక్టర్ రమేష్ రెడ్డి వివరించారు. సీజనల్ వ్యాధులు వచ్చిన తర్వాత బాధపడే కంటే ముందుగానే వాటిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆరోగ్య కార్యకర్తలు ఆశావర్కర్లు గ్రామగ్రామాన ముఖ్యంగా హైదరాబాద్ పట్టణంలో మైక్ ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నామని, సీజనల్ వ్యాధులు వచ్చిన వారు ఇతరులకు వాటిని వ్యాప్తి చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి తెలియజేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో కలుషిత నీటి ద్వారా ఎక్కువ వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉంది కాబట్టి ఆయా ప్రాంతాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, క్లోరినేషన్ టాబ్లెట్లు ఇంటింటికి అందిస్తున్నామని వివరించారు.

ఈ సమయంలో ప్రజలు కూడా పూర్తిస్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాలని కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని, వేడి వేడి ఆహార పదార్థాలు మాత్రమే తినాలని కోరారు. జ్వరం జలుబు వచ్చిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ దగ్గరికి వెళ్లి వారి సలహాలతో అవసరమైతే కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా పరీక్షలు అందుబాటులో ఉన్నందువల్ల ప్రజలు వాటిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని కోరారు.

రేపు అన్నీ జిల్లాల వైద్య అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.
Etela Rajender
TRS
Telangana
Seasonal Diseases

Watch Today's Deals on Amazon

More Press News