Niranjanreddy: రైతులకు ఎక్కడా ఇబ్బంది కలగొద్దు: తెలంగాణ మంత్రి..
Add ap7am to your home Screen

రైతులకు ఎక్కడా ఇబ్బంది కలగొద్దు: తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి

రైతులకు ఎక్కడా ఇబ్బంది కలగొద్దు: తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి
  • ఎరువులు, విత్తనాలపై ఖచ్చితమైనా లెక్కలు తీసుకోండి
  • ఇతర రాష్ట్రాల నుండి నకిలీ ఎరువుల రాకపై చర్యలు చేపట్టండి
  • ఏ ప్రాజెక్టు కింద ఎంత నీరు అందుబాటులోకి వస్తుంది
  • ఏ జిల్లాలో ఎన్ని చెరువులు నింపబోతున్నారు 
  • నీటిపారుదల శాఖ ఇంజనీర్లను అడిగి తెలుసుకోండి
  • పీఎసీఎస్, మార్క్ ఫెడ్ ద్వారా విత్తన, ఎరువుల పంపిణీలో ఆలస్యం జరగకూడదు
  • జిల్లాల వారీగా వర్షాపాతం వివరాలపై ఆరా 
  • భూసార పరీక్షల కార్డులు వెంటనే రైతులకు అందజేయాలి
  • రబీకి వేరుశనగ విత్తనాల సరఫరా కోసం నివేదిక తయారు చేసి ఇవ్వండి
  • వ్యవసాయ, మార్క్ ఫెడ్, విత్తనశాఖ సమీక్షలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
  • హాజరయిన కమీషనర్ రాహుల్ బొజ్జా, మార్క్ ఫెడ్ ఎండీ భాస్కరాచారి, సీడ్ డైరెక్టర్ కేశవులు, ఇతర అధికారులు

రాష్ట్రంలో వర్షాలు విరివిగా కురుస్తున్న నేపథ్యంలో రైతులు పూర్తిగా వ్యవసాయ పనులలో నిమగ్నమయ్యారని, ఈ నేపథ్యంలో రైతులకు ఎరువులు, విత్తనాల విషయంలో ఎలాంటి కొరత రాకుండా చూడాలని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. వ్యవసాయ, మార్క్ ఫెడ్ మరియు విత్తనశాఖలపై ఉన్నతాధికారులతో సచివాలయంలోని తన ఛాంబర్ లో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని కొమరంభీం, నారాయణపేటలలో సాధారణం కన్నా అత్యధిక వర్షాపాతం, యాదాద్రి భువనగిరి, నల్లగొండ, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలలో సాధారణకన్నా తక్కువ, మిగతా అన్ని జిల్లాలలో సాధారణ వర్షాపాతం నమోదయిందని అధికారులు మంత్రి గారికి వివరించారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో విత్తనాలు, ఎరువులు జిల్లాల వారీగా డిమాండ్ ఎంత ఉంది ? ప్రస్తుతం ఎక్కడ ఎంత నిల్వ ఉంది ? ఎంత అవసరం ఉంటుంది ? జిల్లాల వారీగా పరిశీలించి ఎక్కడా ఎరువులు, విత్తనాలు తక్కువ కాకుండా సిద్దంచేయాలని అధికారులను అదేశించారు.

ఎరువులు, విత్తనాల సరఫరా విషయంలో ప్రాథమిక సహకార సంఘం, మార్క్ ఫెడ్ శాఖల వద్ద ఎలాంటి జాప్యం జరగకూడదని మంత్రి నిరంజన్ రెడ్డి గారు అన్నారు. నీటిపారుదల శాఖ ఇంజనీర్లతో మాట్లాడి ఎంత ఆయకట్టుకు సాగునీరు రాబోతున్నది క్షేత్రస్థాయిలో ఖచ్చితమయిన అంచనాలు తీసుకోవాలని అన్నారు. ఇతర రాష్ట్రాల నుండి అక్రమంగా వస్తున్న నకిలీ ఎరువుల నివారణకు కలెక్టర్ల సహకారంతో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మొక్కజొన్నలో కత్తెర పురుగు (ఫాల్ ఆర్మీ వార్మ్), గులాబీ రంగు కాయతొలుచు పురుగు (పింక్ బౌల్ వార్మ్) పత్తి పంటలో రాకుండా ప్రతి మొక్కనూ కాపాడుకునేందుకు క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని, ప్రతి రోజూ వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించాలని అన్నారు.

భూసార పరీక్షలకు సంబంధించిన పరీక్ష కార్డులను సంబంధిత రైతులకు 15 రోజులలో అందజేయాలని, రైతుకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల ప్రకారం వెంటనే అప్ లోడ్ చేయాలని అదేశించారు. ఎరువులు, పురుగుమందుల నిల్వకోసం గోదాంలను జిల్లాల వారీగా అందుబాటులో ఉండేలా చూసుకోవాలని, రబీలో వేరుశనగ విత్తనాల కొరత రాకుండా ఇప్పటి నుండే ఏర్పాట్లు చేసుకోవాలని, ఒక్క ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే లక్షా 50 వేల క్వింటాళ్లు అవసరం ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఒక నివేదికను తయారు చేసి సమర్పించాలని అధికారులను ఆదేశించారు. కేంద్రప్రభుత్వ పథకాలకు సంబంధించి పథకాల వారీగా నివేదిక అందజేస్తే ఆ పథకాల నుండి రాష్ట్రాలకు నిధులు ఎలా రాబట్టగలమో సమీక్ష చేద్దామని నిరంజన్ రెడ్డి గారు అన్నారు. ఉద్యోగుల పదోన్నతుల విషయంలో ఎవరికీ నష్టంలేకుండా అందరికీ ఆమోదయోగ్యమయిన నివేదిక తయారుచేయాలని ఆదేశించారు. అవసరం అయితే ఒక కమిటీ ఏర్పాటుచేసుకోవాలని సూచించారు.
Niranjanreddy
Hyderabad
Telangana
Minister for Agriculture

Watch Today's Deals on Amazon

More Press News