srinivas goud: 11వ జాతీయ థాయ్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్..
Add ap7am to your home Screen

11వ జాతీయ థాయ్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీలను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

11వ జాతీయ థాయ్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీలను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
11వ జాతీయ థాయ్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీలను కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో ఆబ్కారి, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. 25 రాష్ట్రాల నుండి సుమారు 1000 మంది క్రీడాకారులు పాల్గొన్న ఈ ఛాంపియన్ షిప్ పోటీలకు హైదరాబాద్ నగరం ఆతిధ్యం ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ క్రీడల అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారన్నారు.

దేశంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణలో నెంబర్ వన్ గా నిలిచామన్నారు. అలాగే, క్రీడా రంగంలో కూడా నెంబర్ వన్ గా నిలిచేలా క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్పోర్ట్స్ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి, సెట్విన్ ఛైర్మన్ ఇనాయత్ అలీ భాక్రి, థాయ్ బాక్సింగ్ ఛాంపియన్ నిర్వాహకులు ఇప్తాకర్ హుస్సేన్, సౌరభ్ సుమన్ ఝా లు పాల్గొన్నారు.

srinivas goud
Hyderabad
Telangana

Watch Today's Deals on Amazon

More Press News