V Srinivas Goud: హోటల్ అసోసియేషన్ ప్రతినిధులతో తెలంగాణ మంత్రి శ్రీనివాస్..
Add ap7am to your home Screen

హోటల్ అసోసియేషన్ ప్రతినిధులతో తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ భేటీ

హోటల్ అసోసియేషన్ ప్రతినిధులతో తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ భేటీ
రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ని హైదరాబాద్ లో రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు భేటీ అయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ -19 నేపథ్యంలో హోటల్ పరిశ్రమ పడుతున్న ఇబ్బందులను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు హోటల్ అసోసియేషన్ ప్రతినిధులు. హోటల్ అసోసియేషన్ ప్రతినిధులు ఇచ్చిన వినతిపత్రంపై మంత్రి సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు అశోక్ హేమారాజని, రెజినాల్డ్  కార్బెట్, థామస్ అబ్రాహాములు పాల్గొన్నారు.
V Srinivas Goud

Watch Today's Deals on Amazon

More Press News