Corona Virus: కరోనా వచ్చిన జర్నలిస్టులకు ఆర్థిక సహాయం ప్రకటించిన..
Add ap7am to your home Screen

కరోనా వచ్చిన జర్నలిస్టులకు ఆర్థిక సహాయం ప్రకటించిన అల్లం నారాయణ

కరోనా వచ్చిన జర్నలిస్టులకు ఆర్థిక సహాయం ప్రకటించిన అల్లం నారాయణ
హైదరాబాద్ లో కొత్తగా మరో 13 మంది జర్నలిస్టులకు కరోనా పాజిటివ్ వచ్చినందున ఆ 13 మంది జర్నలిస్టులకు ఒక్కొక్కరికి 20 వేల రూపాయల చొప్పున, హోంక్వారైంటైన్ లో ఉన్న 11 మంది జర్నలిస్టులకు 10 వేల చొప్పున, మొత్తం 3 లక్షల 70 వేల రూపాయలు ఆర్థిక సహాయం తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ ప్రకటించారు.  

ఇప్పటి వరకు కరోనా వైరస్ పాజిటీవ్ లు వచ్చిన 81 మంది జర్నలిస్టులకు 20 వేల రూపాయల చొప్పున 16 లక్షల 20 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశామని తెలిపారు. అదే విధంగా హోంక్వారైంటైన్ లో ఉన్న 31 మంది జర్నలిస్టులకు 10 వేల రూపాయల చొప్పున 3 లక్షల 10 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించామని తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 19 లక్షల 30 వేల రూపాయలను అకాడమీ నిధుల నుండి అందించామని తెలిపారు. కరోనా బారిన పడిన పాజిటివ్, క్వారంటైన్ జర్నలిస్టులు ప్రభుత్వ డాక్టర్లు దృవికరించిన మెడికల్ రిపోర్టు లు అకాడమీ కార్యాలయానికి తప్పనిసరిగా పంపించాలని సూచించారు.

జర్నలిస్ట్ మిత్రులు తమ వివరాలను తెలంగాణ రాష్ట్ర మీడియా చైర్మన్ వాట్సప్ (8096677444) నెంబర్ కి పంపాలని తెలిపారు.  మరిన్ని వివరాలకు  మీడియా అకాడమీ మేనేజర్  సెల్ నెంబర్  9676647807 ని సంప్రదించవచ్చని ఆయన తెలిపారు.
Corona Virus
Telangana

Watch Today's Deals on Amazon

More Press News