Vellampalli Srinivasa Rao: మధ్యప్రదేశ్ కు వెళ్లే శ్రామిక రైలును ప్రారంభించిన..
Add ap7am to your home Screen

మధ్యప్రదేశ్ కు వెళ్లే శ్రామిక రైలును ప్రారంభించిన ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు

మధ్యప్రదేశ్ కు వెళ్లే శ్రామిక రైలును ప్రారంభించిన ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు
విజయవాడ: మధ్యప్రదేశ్ కు వెళ్లే శ్రామిక రైలును ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రారంభించారు. విజయవాడ రూరల్ మండలం రాయనపాడు రైల్వె స్టేషన్ నుండి మధ్యప్రదేశ్ వరకు ఈ శ్రామిక రైలు వెళ్లనుంది.
మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కామెంట్స్:
  • లాక్ డౌన్ నేపథ్యంలో ఆంద్రప్రదేశ్ లో చిక్కుకున్న ఇతర రాష్ట్రాల వలస కూలీలు
  • శ్రామిక రైలు ద్వారా వలస కార్మికులను వారి  స్వస్థలాలకు తరలింపు
  • లాక్ డౌన్ కారణంగా యాభై రోజులుగా పనులు లేక పస్తులు ఉంటున్న కార్మికులు
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వగ్రామాలకు పంపే ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేసిన కార్మికులు
  • లాక్ డౌఙ్ వలస కూలీలు దేశ వ్యాప్తంగా ఇబ్బందులు పడ్డారు
  • సిఎం జగన్మోహన్ రెడ్డి స్పందించి వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు‌ చేయాలని ఆదేశించారు
  • నడిచి వెళుతున్న కార్మికులకు ఆహారం, మంచినీరు సదుపాయం కల్పించాం
  • అందరూ బస్సు, రైళ్లల్లో‌ వెళ్లేలా చూడాలని సిఎం ఆదేశించారు
  • నేడు ఎంతో మంది తమ‌ స్వస్థలాలకు ఆనందంగా వెళుతున్నారు
  • సిఎం‌ చేసిన సాయం చూసి.. అభినందనలు తెలుపుతున్నారు
  • ప్రజల కష్టాలు తెలిసిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి
  • ఇప్పటి వరకు 12 రైళ్లు, 143 బస్సులు లను జిల్లా నుంచి వివిధ రాష్ట్రాలకు పంపాం
  • ఇంత చేస్తున్నా ప్రతితిపక్షాలు రాజకీయం‌ చేస్తున్నాయి
  • ప్రభుత్వం చేస్తున్న పనులకు అభినందనలు తెలపకపోయినా పరవాలేదు.. అడ్డంకులు కల్పించవద్దు
  • చంద్రబాబునాయుడు జూమ్ వీడియోల ద్వారా ప్రభుత్వంపై బురద జల్లుతున్నారు
  • రాయనపాడు వచ్చి చూస్తే.. వారికి వాస్తవ పరిస్థితి తెలుస్తుంది
  • పవన్ కళ్యాణ్ వీడియో కాన్ఫరెన్స్ లు కాదు.. వీడియో గేమ్ లు ఆడుకుంటున్నారు
  • వామపక్ష పార్టీలు కూడా టిడిపి తోక పార్టీ లుగా మారిపోయారు
  • పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే.. ఇక్కడ రాజకీయం చేస్తున్నారు
  • ప్రతి కార్మికుడు కష్టపడకుండా సొంత ప్రాంతాలకు చేరేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది
  • ఎవరూ నడిచి వెళ్లకుండా అధికారులను సంప్రదించి రైళ్లల్లో‌ వెళ్లేలా పేర్లు నమోదు చేసుకోవాలి
Vellampalli Srinivasa Rao

Watch Today's Deals on Amazon

More Press News