Telangana: జిల్లాల్లో వెళ్లివిరిసిన హరిత శుక్రవారం
Add ap7am to your home Screen

జిల్లాల్లో వెళ్లివిరిసిన హరిత శుక్రవారం

జిల్లాల్లో వెళ్లివిరిసిన హరిత శుక్రవారం
  • అన్ని జిల్లాల్లో హరిత శుక్రవారం
  • హరితహారం మొక్కల కోసం నీటి సౌకర్యం
కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టిన జిల్లాల్లో హరిత శుక్రవారం స్ఫూర్తి వెళ్లివిరిసింది. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో హరిత శుక్రవారం నిర్వహించాలని, తెలంగాణకు హరితహారంలో భాగంగా నాటిన మొక్కలకు నీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల్లో గ్రామీణాభివృద్ది, అటవీ శాఖలతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రజలు రంగంలోకి దిగారు. పల్లె ప్రగతిలో భాగంగా ప్రభుత్వం ప్రతీ పంచాయితీకి ఇచ్చిన కొత్త ట్రాక్టర్లతో నీటిని తరలించి మొక్కలకు సరఫరా చేశారు. వేసవి తీవ్రత బాగా ఉన్నప్పటికీ పండగ వాతావరణంలో ఈ కార్యక్రమం కొనసాగింది.

తెలంగాణకు హరితహారంలో భాగంగా నాటిన మొక్కలకు నీటి సౌకర్యం ఏర్పాటుపై జిల్లాల వారీగా కొనసాగిన తీరును ముఖ్యమంత్రి కార్యాలయం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ పర్యవేక్షించారు. అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని స్వయంగా కలెక్టర్లు పర్యవేక్షించాలని కోరారు. భౌతిక దూరం పాటిస్తూనే వీలైనంత మంది పాల్గొనేలా, ఎక్కువ మొక్కలను నీరు అందేలా ప్రతీ శుక్రవారం ఈ కార్యక్రమం కొనసాగాలన్నారు. నీటి సరఫరా జరిగేలా గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖలు సమన్వయం చేసుకోవాలని తెలిపారు. పెరిగిన ఎండల నేపథ్యంలో గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసిన నర్సరీల్లో మొక్కల సంరక్షణపై కూడా దృష్టి పెట్టాలని కోకారు. షేడ్ నెట్ లను ఏర్పాటు చేసి మొక్కలను సంరక్షించడంలో పాటు తగిన విధంగా నీటి సౌకర్యం ఉండేలా చూసి, వచ్చే హరితహారం సీజన్ కోసం వీలైనంత పెద్ద మొక్కలను పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు.
Telangana

Watch Today's Deals on Amazon

More Press News