Allam Narayana: కరోనా బారిన పడిన జర్నలిస్టులకు మీడియా అకాడమీ..
Add ap7am to your home Screen

కరోనా బారిన పడిన జర్నలిస్టులకు మీడియా అకాడమీ చేయుత: అల్లం నారాయణ

కరోనా బారిన పడిన జర్నలిస్టులకు మీడియా అకాడమీ చేయుత: అల్లం నారాయణ
కరోనా బారిన పడిన జర్నలిస్టుల ను అన్ని రకాలుగా ఆదుకుంటామని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. కరొనా వైరస్ మీడియా కవరేజ్ లో కొంతమంది తెలంగాణ జర్నలిస్టులకు ఈ వైరస్ సోకిందనీ,ఈ వైరస్ బారిన పడిన జర్నలిస్ట్ కు మీడియా అకాడమీ తరఫున ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు. న్యూ ఢిల్లీలో ముగ్గురు జర్నలిస్టులకు‌, గద్వాల జిల్లాలోని ఒక జర్నలిస్టుకు కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపారు.

ఈ నలుగురికి ఇరవై వేల చొప్పున 80 వేల రూపాయలు ఆర్థిక సాయం అందించినట్లు తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లాలోని ఐదు మంది జర్నలిస్టులకు గద్వాలలోని నలుగురు జర్నలిస్టులు మొత్తం తొమ్మిది మంది జర్నలిస్టులు హోం క్వారంటైన్ లో ఉన్నారని వీరందరికీ పదివేల రూపాయల చొప్పున 90 వేల రూపాయల ఆర్థిక సాయం అందించినట్లు ఆయన తెలిపారు.ఈ మొత్తాన్ని వారి బాంక్ అకౌంట్ లలో జమ చేశామని తెలిపారు.

జర్నలిస్టులు సమాజహితం కోసం పని చేయాలంటే ముందుగా ప్రాణాలతో ఉండాలన్నారు. ప్రాణం కన్నా విలువైంది ఏది లేదన్నారు. కరోనా వైరస్ విజృంభింస్తున్న నేపథ్యంలో జర్నలిస్టుల ఆరోగ్యపరమైన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలని కోరారు.

జర్నలిస్టులు భౌతిక దూరం పాటించాలని, వీలైనన్నిసార్లు చేతులను శుభ్ర పరుచుకోవాలని అన్నారు. శానిటైజర్లు ఉపయేగించాలని సూచించారు. మాస్కులను ప్రతి ఒక్కరూ ధరించాలని అన్నారు. సమాజం కన్నా ముందు మనపై ఆధారపడిన కుటుంబ సభ్యులు ఉన్నారని, ఈ విషయాన్ని జర్నలిస్టులు గమనించాలని ఆయన సూచించారు.
Allam Narayana
Hyderabad

Watch Today's Deals on Amazon

More Press News