Talasani: రక్తదానం చేసిన ఉద్యోగులు, సిబ్బందిని అభినందించిన మంత్రి..
Add ap7am to your home Screen

రక్తదానం చేసిన ఉద్యోగులు, సిబ్బందిని అభినందించిన మంత్రి తలసాని

రక్తదానం చేసిన ఉద్యోగులు, సిబ్బందిని అభినందించిన మంత్రి తలసాని
రాష్ట్రంలో జీవాలకు వైద్యసేవలు అందించడంలో, పశుగ్రాసం కొరత నివారణలో పశుసంవర్ధక శాఖ ఎంతో సమర్ధవంతంగా పని చేస్తుందని తెలంగాణ పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. శనివారం ప్రపంచ పశువైద్య దినోత్సవం సందర్బంగా పశు సంవర్ధక శాఖ ఉద్యోగులు, పశు వైద్యుల ఆధ్వర్యంలో ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని విద్యానగర్ లో గల రెడ్ క్రాస్ సంస్థ భవనంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని mla ముఠా గోపాల్, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ లక్ష్మారెడ్డి లతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ లాక్ డౌన్ కారణంగా రాష్ట్రంలోని బ్లడ్ బ్యాంక్ లలో రక్త నిల్వలు తగ్గిపోయాయని అన్నారు. తలసేమియా రోగులు, డయాలసిస్ రోగులకు ఈ రక్తం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. రక్తదానం చేసిన ఉద్యోగులు, సిబ్బందిని ఈ సందర్భంగా మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా dvaho విజయ్ కుమార్ రెడ్డి, పశువైద్యాదికారుల సంఘం అద్యక్షుడు బాబు బెర్రి, పశువైద్య సంఘం అధ్యక్షుడు దేవేందర్, జోనల్ సెక్రెటరీ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Talasani
Telangana

Watch Today's Deals on Amazon

More Press News