Corona Virus: మంత్రి జగదీష్ రెడ్డి చొరవతో సొంత గూటికి..
Add ap7am to your home Screen

మంత్రి జగదీష్ రెడ్డి చొరవతో సొంత గూటికి చేరుకున్న తండా వసూలు!

మంత్రి జగదీష్ రెడ్డి చొరవతో సొంత గూటికి చేరుకున్న తండా వసూలు!
  • సరిహద్దుల్లో చిక్కుకున్న పాచ్యతండా వాసులు

  • మంత్రి జగదీష్ రెడ్డి చొరవతో స్వరాష్ట్రంలో ప్రవేశం

  • ప్రాథమిక చికిత్సల అనంతరం ప్రవేశానికి అనుమతి

  • జిల్లా కలెక్టర్ తో సంప్రదింపులు

  • స్థానిక ఆర్డీఓకు ఆదేశాలు

  • సొంత గూటికి చేరుకున్న తండా వసూలు

  • ఊపిరి పీల్చుకున్న కుటుంబ సభ్యులు 

  • ఎట్టకేలకు కథ సుఖాంతం

లాక్ డౌన్ నేపథ్యంలో సరిహద్దుల్లో చిక్కుకున్న వలస కూలీలు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి చూపిన చొరవతో ఎట్టకేలకు సొంత గూటికి చేరుకున్నారు. సూర్యపేట జిల్లా సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని పాచ్యతండాకు చెందిన 26 మంది కూలి పనులకు గాను పొరుగున ఉన్న ఆంద్రప్రదేశ్ లోని పులిచింతల ఆయకట్టు పనులకు వెళ్లారు.

అంతవరకు బాగానే ఉందనుకుంటున్న వారికి కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభుత్వాలు ప్రకటించిన లాక్ డౌన్ వారి పనులకు ప్రతిబందకమై పనులకు అంతరాయం ఏర్పడింది. అక్కడే పని లేక సొంత గూటికి చేరుకోలేక పులిచింతల ప్రాజెక్ట్ అవల చిక్కుకున్నారు. ఎంత బ్రతిమలాడిన నిబంధనలు ఒప్పుకోవు అంటూ సరిహద్దుల్లో వారి రాకను పోలీసులు అడ్డుకున్నారు. ఇక తప్పని పరిస్థితుల్లో మంత్రి జగదీష్ రెడ్డి సెల్ నెంబర్ తెలుసుకుని ఫోన్ లో నేరుగా మంత్రి జగదీష్ రెడ్డిని సంప్రదించారు. విషయం తెలుసుకున్న మంత్రి జగదీష్ రెడ్డి సరిహద్దుల్లో చిక్కుకున్న పాచ్యతండా వాసులను వారి సొంతూరికి చేర్చాలంటూ ఆదేశించారు. ఆదేశించడంతో పాటు పలుమార్లు వాకబు చేస్తూ వారు సొంతూరికి చేరేదాకా ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తూ వచ్చారు. దీనితో రంగంలోకి దిగిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి కోదాడ ఆర్డిఓకు వారిని నిబంధనల ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహించి తీసుకురావాలి అంటూ పురమాయించారు.

దానితో రంగంలోకి దిగిన ఆర్డిఓ పోలీస్ అధికారులను సమన్వయం చేసుకుని ఆదివారం పొద్దు పోయేంత వరకు వైద్యపరీక్షలు నిర్వహించి వారి వారి సొంత గ్రామాలకు చేరేలా ఏర్పాట్లు పూర్తిచేశారు. ఎట్టకేలకు సోమవారం సాయంత్రానికి ఇంటికి చేరుకున్న తండా వాసులు ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఫోన్ ఎత్తడంతో పాటు సురక్షితంగా తమను గమ్యానికి చేర్చిన రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.

మంత్రి జగదీష్ రెడ్డికి ధన్యవాదాలు: చివ్వేంల జడ్పీటీసీ సంజీవ్ నాయక్

ఇదిలా ఉండగా తమ మండల వాసులు పైగా గిరిజన బిడ్డలను సకాలంలో ఆదుకుని సొంతూర్లకు చేర్చిన మంత్రి జగదీష్ రెడ్డికి చివ్వేంల జడ్పీటీసీ సంజీవ్ నాయక్ కృతజ్ఞతలు తెలిపారు. సరిహద్దుల్లో చిక్కుకుని ఆందోళనకు గురౌతున్న పాచ్యతండా వాసుల ఒక్క ఫోన్ కాల్ కు స్పందించిన మంత్రి జగదీష్ రెడ్డి అభినందనీయుడని ఆయన కొనియాడారు. ఎన్నో అవాంతరాలను అధిగమించి సురక్షితంగా ఇండ్లకు చేరుకున్న పాచ్యతండా వాసులను కలుసుకొని ఆయన పరామర్శించారు.
Corona Virus
Telangana

Watch Today's Deals on Amazon

More Press News