సైకలాజికల్‌ థ్రిల్లర్‌ "ది మేజ్" ట్రైలర్ విడుదల

Entertainment
Advertisement
తమిళ, తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరో శ్రీరామ్ (శ్రీకాంత్) నటిస్తున్న కొత్త సినిమా "ది మేజ్". ఈ మూవీలో ప్రియాంక, హ్రితిక శ్రీనివాస్, కమల్ కామరాజు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని డాక్టర్ నైమిష రెడ్డి కసిరెడ్డి సమర్పణలో శ్రౌష కమల ఆర్ట్స్, యూఆర్ క్రియేషన్స్ బ్యానర్స్ పై డాక్టర్ ఉదయ్ కె. రెడ్డి పాల్వాయి, డాక్టర్ కేఎస్ఆర్ (కరెడ్డి శ్రీధర్ రెడ్డి), డాక్టర్ భరత్ రెడ్డి గోపు, డాక్టర్ అనిరుధ్ రెడ్డి సోమ నిర్మిస్తున్నారు. "ది మేజ్" చిత్రాన్ని సరికొత్త సైకలాజికల్ థ్రిల్లర్ కథతో దర్శకుడు డాక్టర్ రవికిరణ్ గడలాయ్ రూపొందిస్తున్నారు. త్వరలో ఈ సినిమా గ్రాండ్ పాన్ ఇండియా థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు డైరెక్టర్, ప్రొడ్యూసర్ మధుర శ్రీధర్ రెడ్డి, డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ అతిథులుగా "ది మేజ్" సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

నిర్మాత డాక్టర్ ఉదయ్ కె. రెడ్డి పాల్వాయి మాట్లాడుతూ - ఈ సినిమా కథ చెప్పినప్పటి కంటే స్క్రీన్ మీద చూసినప్పుడు ఎక్కువ థ్రిల్ అయ్యాను. ఈ సినిమా ప్రివ్యూ చూస్తున్నప్పుడు సెకండాఫ్ చూపు తిప్పుకోలేకపోయాను. అంత గ్రిప్పింగ్ గా రూపొందించారు మా డైరెక్టర్. ఈ సినిమాలో శ్రీరామ్ గారు జాయిన్ అవడంతో మరింత స్ట్రాంగ్ ప్రాజెక్ట్ అయ్యింది. మా చిత్రంలో హీరో శ్రీరామ్, ఇద్దరు హీరోయిన్స్ బాగా పర్ ఫార్మ్ చేశారు. నాకు సినిమాలంటే పెద్ద ఆసక్తి ఉండదు. కానీ ఇలాంటి ప్రాజెక్ట్ లలో భాగమవడం సంతోషంగా ఉంది. అన్నారు.

హీరోయిన్ హ్రితిక శ్రీనివాస్ మాట్లాడుతూ - ఈ చిత్రంలో ఈషా అనే క్యారెక్టర్ లో నటిస్తున్నాను. నా కెరీర్ లో చేసిన గొప్ప క్యారెక్టర్ ఇదేనని నమ్ముతాను. డైరెక్టర్ రవి కిరణ్ గారు కథ చెప్పినప్పుడు రెండు రోల్స్ లో ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నారు. నేను హీరోయిన్ గానే కాదు నటిగా పర్ ఫార్మర్ గా పేరు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నాను. ఈషా రోల్ లో ఆ స్కోప్ ఉందనిపించింది. ఈ సినిమా రిలీజ్ అయ్యాక తప్పకుండా వైరల్ అవుతుంది. శ్రీరామ్, కమల్ కామరాజుతో నా కాంబినేషన్ సీన్స్ ఉంటాయి. ఒక ఆడియెన్ గా చెబుతున్నాను. ఇదొక బ్యూటిఫుల్ ఫిలిం. ఈ సినిమాను థియేటర్స్ లో మిస్ కాకండి. అన్నారు.

హీరోయిన్ ప్రియాంక మాట్లాడుతూ - ది మేజ్ చిత్రంలో నటించే అవకాశం రావడం హ్యాపీగా ఉంది. శ్రీరామ్ గారితో నటించడం గొప్ప అవకాశం భావిస్తున్నా. ఈ సినిమా ఒక సరికొత్త థ్రిల్లర్ ఎక్సిపీరియన్స్ ను మీకు థియేటర్స్ లో అందిస్తుంది. కథలో జరిగేవి మీరు ఊహించలేరు. సినిమాలో వచ్చే ప్రతి ట్విస్ట్ ను మీరు థ్రిల్ గా ఫీలవుతారు. మా టీమ్ అందరికీ మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నా. అన్నారు.

దర్శక నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ - ది మేజ్ సినిమా నేను చూశాను. వెల్ మేడ్ ఫిలిం. ఎడ్జ్ ఆఫ్ ది సీట్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రమిది. తెలుగులో వచ్చిన మంచి థ్రిల్లర్ అవుతుంది. రవికిరణ్ గారితో టాలీవుడ్ కు మరో మంచి డైరెక్టర్ వచ్చాడని చెప్పుకోవచ్చు. తనకున్న బడ్జెట్ పరిమితుల్లో టెక్నికల్ గా ఈ సినిమా సూపర్బ్ గా చేశాడు. హార్డ్ హిట్టింగ్ గా మూవీ ఉంటుంది. ప్రతి ఆర్టిస్ట్ తో మంచి పర్ ఫార్మెన్స్ తీసుకున్నాడు డైరెక్టర్. ఇలాంటి మూవీస్ కు మంచి డేట్ ప్లాన్ చేసుకుని థియేట్రికల్ గా వస్తే రిజల్ట్ బాగుంటుంది. అన్నారు.

డైరెక్టర్ డా. రవికిరణ్ గడలాయ్ మాట్లాడుతూ - ది మేజ్ అంటే మొక్కజొన్న అనుకుంటున్నారు. కానీ మేజ్ అంటే పద్మవ్యూహం అని అర్థం. దారితెలియని అనూహ్యమైన పరిస్థితుల నుంచి బయటపడే ఓ వ్యక్తి కథ ఇది. ఆ పరిస్థితుల్లో చిక్కుకుని ఆ తర్వాత ఎలా బయటపడతాడు అనేదే ఈ సినిమా నేపథ్యం. ఈ చిత్రంలో మీరు ఊహించని ట్విస్టులు ఉంటాయి. నేను నాతో పాటు నా కో రైటర్ రెడ్డి ఈ స్క్రిప్ట్ రెడీ చేశాం. కథలో ఎక్కడ ఏ ట్విస్ట్ రావాలో పర్పెక్ట్ గా లాక్ చేశాం. డీవోపీ, మ్యూజిక్..ఇలా ప్రతి క్రాఫ్ట్ నా విజన్ ను మరింత అందంగా చేశాయి. ఆర్టిస్టుల నుంచి పూర్తి సహకారం లభించింది. శ్రీరామ్ గారి దగ్గర నుంచి ఎంత పర్ ఫార్మ్ చేయించాలో అంత చేయించుకున్నాం. ది మేజ్ సినిమా చూస్తున్నంత సేపు మీరు మిమ్మల్ని శ్రీరామ్ గారి క్యారెక్టర్ లో ఊహించుకుంటారు. అంతగా కనెక్ట్ అవుతారు. అన్నారు.

హీరో శ్రీరామ్ (శ్రీకాంత్) మాట్లాడుతూ - ఈ సినిమాలో ప్రతి సీన్ లో నన్ను కొత్తగా చూపించాలని డైరెక్టర్ రవికిరణ్ తపించారు. ఆయన అందుకోసం చాలా ఎఫర్ట్స్ పెట్టారు. పాతికేళ్లుగా పరిశ్రమలో ఉన్నాను. ఇన్నేళ్లకు నాకోసం టైటిల్ కార్డ్ లో ఒక థీమ్ మ్యూజిక్ క్రియేట్ చేశారు. ఇప్పటిదాకా ఏ ఫిలింమేకర్ అలా చేయలేదు. ఆర్టిస్ట్ కు తనకు దక్కే గుర్తింపులో ఎంతో సంతృప్తి లభిస్తుంది. ఈ సినిమా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ ఫిలింమేకింగ్ మీద చూపించే జెన్యూన్ ప్యాషన్ నాకు బాగా నచ్చింది. సినిమా అనేది పవర్ ఫుల్ మీడియం. తమ కెరీర్ లో ఎంతో బిజీగా ఉండే ఈ డాక్టర్స్ ఇలాంటి మంచి సినిమా చేశారు. 

ఇటీవల కాలంలో నేను చేసిన క్వాలిటీ ఫిలిం ది మేజ్. ఈ మేజ్ మూవీ మిమ్మల్ని అమేజ్ చేస్తుంది. కథ చెప్పినప్పుడు ఎలా చేస్తారు టెక్నికల్ గా అని అడిగితే వెంటనే ఒక డెమో షూట్ చేసుకుని వచ్చారు. ఆయన ఏదో దర్శకత్వం చేద్దామని రాలేదు. ఇండస్ట్రీలో ఉండేందుకే వచ్చారు అనిపించింది. నేను నటుడిగా జర్నీ చేస్తూ వస్తున్నా, ఎప్పుడు సక్సెస్ వస్తుందో తెలియదు. అందుకే ప్రతి ప్రాజెక్ట్ ను జాగ్రత్తగా చేసుకుంటుననా. ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందని నమ్ముతున్నా. అన్నారు.


Advertisement
The MazeThe Maze trailersrikanth

More Press News

ఇంట్రెస్టింగ్‌గా "రాజిగాడు రాజయ్యాడు" ఫస్ట్‌లుక్‌ !

16 Nov, 22:55

‘ఐ హేట్ మ్యారేజ్ ’ ట్రైలర్‌ విడుదల!

16 Nov, 22:41

‘ఛప్రి’ టీజర్‌ ఆవిష్కరణ.. సమ్మర్‌లో సినిమా రిలీజ్‌

15 Nov, 15:09

యుద్దం రాముడితో కాదు.. రాజ్యంతో అంటోన్న కొణిదెల పవన్‌తేజ్‌

15 Nov, 15:02

చంద్రయాన్" సినిమా మీ అందరినీ ఆకట్టుకుంటుంది: శ్రీ విష్ణు

11 Nov, 23:22

మెగాస్టార్‌ చిరంజీవికి 'ఖైదీ'లా సుడిగాలి సుధీర్‌ కెరీర్‌కు 'గోట్‌' కెరీర్‌లో నిలిచిపోతుంది!

11 Nov, 23:15

ఇంకా ఏం అనుకోలేదు!’ చిత్రం అందరికీ కనెక్ట్‌ అవుతుంది!

11 Nov, 23:12

Unveiling First Look of Arjun Sarja as VIRAAVI from Polimera 3

09 Nov, 22:38

సరోజ్ కుమార్ ‘ఛప్రి’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

06 Nov, 23:25

జీ తెలుగు దీపావళి ప్రత్యేక కార్యక్రమాలు.. ‘కుటుంబం అవార్డ్స్ 2026 పార్ట్-2’, ‘జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2’లో మంత్రి నారా లోకేశ్!

05 Nov, 12:23

"మాయలేడి"తో కమర్షియల్‌ హిట్‌ వస్తుంది: రాకేష్‌ వర్రే

04 Nov, 23:18

NATS Touches Many Hearts In The USA And India

04 Nov, 23:06

వీవీ వినాయక్‌ అతిథిగా కిషోర్ మూవీ మేకర్స్ తొలి సినిమా ప్రారంభం

04 Nov, 16:46

కస్టమర్ల అభిమానమే మా లక్ష్యం: ఎస్ఎన్ఎస్ సీఎండీ శ్రీకాంత్ రెడ్డి

04 Nov, 12:52

నవంబరు 20న 'డానీ' విడుదల

03 Nov, 11:25
..More Press News