‘ఐ హేట్ మ్యారేజ్ ’ ట్రైలర్ విడుదల!
Advertisement
సుగి విజయ్, జుప్సీ భద్ర (తొలి పరిచయం) హీరో హీరోయిన్లుగా నటిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ చిత్రం 'ఐ హేట్ మ్యారేజ్'. పరమేష్ రేణు కుంట్ల దర్శకుడు. ఆర్య సినిమా పతాకంపై మాదం దయానంద్, కార్తీక్ వెంపటి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి ప్రముఖ ఛాయాగ్రాహకుడు Vijay C Kumar డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీని అందించారు. ఈ నెల 27న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి వచ్చిన ప్రతి కంటెంట్ మంచి ఆదరణ అందుకుంది. కాగా ఈ చిత్రం ట్రైలర్‌ను మేకర్స్ సోమవారం విడుదల చేశారు.
ట్రైలర్‌ను చూస్తుంటే నేటి తరం యువతకు నచ్చే అంశాలతో పాటు ప్రతి యువత ఈ సినిమాకు కనెక్ట్ అయ్యే విధంగా కనిపిస్తుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ '' ప్రేమ, పెళ్లి, కెరీర్‌తో పాటు స్వతంత్రంగా జీవించాలనే నేటి Gen Z తరం ఆలోచనలు, భావజాలాన్ని వాస్తవానికి దగ్గరగా చూపించే ప్రయత్నం ఈ చిత్రంలో చేశాను. ప్రతి సన్నివేశం ఎంతో సహజంగా ఉంటుంది. ఇందులోని భావోద్వేగాలు ఆడియన్స్‌ను కట్టిపడేస్తాయి. ఎలాంటి సినిమాటిక్ అతిశయోక్తులు లేకుండా, నిజ జీవితంలో యువత ఎదుర్కొనే భావోద్వేగాలు, నిర్ణయాలను సహజంగా ఆవిష్కరించే ప్రయత్నం ఈ చిత్రంలో కనిపించనుంది. కొత్త తరహా సినిమాలను ఆదరించే తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రం తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం ఉంది' అన్నారు.
Advertisement