"మాయలేడి"తో కమర్షియల్‌ హిట్‌ వస్తుంది: రాకేష్‌ వర్రే

Entertainment
Advertisement
ప్రొడ్యూసర్ రాకేష్ వర్రే చేస్తున్న కొత్త సినిమా "మాయలేడి". ఈ సినిమాలో రాకేష్ వర్రే హీరోగా నటిస్తూ క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై  నిర్మిస్తున్నారు. రాకేష్ వర్రే గతంలో క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎవరికీ చెప్పొద్దు, పేకమేడలు వంటి కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ నిర్మించి అందరి ప్రశంసలు పొందారు. ఇప్పుడు "మాయలేడి"తో మరో ఇంట్రెస్టింగ్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమాను దర్శకుడు ప్రశంకర్ రూపొందిస్తున్నారు. మధుమిత సర్కార్ హీరోయిన్ గా నటిస్తోంది. "మాయలేడి" సినిమా ఈ నెల 13న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ రోజు ఈ చిత్ర ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

హీరోయిన్ మధుమిత సర్కార్ మాట్లాడుతూ - ఇది తెలుగులో నాకు మొదటి సినిమా. మా మూవీ ట్రైలర్ మీకు నచ్చిందని నమ్ముతున్నాం. నా పర్ ఫార్మెన్స్ ను మీరు ఖచ్చితంగా ఇష్టపడతారు. మాయలేడి ఒక బ్యూటిఫుల్ మూవీ. ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం రావడం హ్యాపీగా ఉంది. నా క్యారెక్టర్ లో పర్ ఫార్మ్ చేసేందుకు చాలా స్కోప్ ఉంది. ఎన్నో లొకేషన్స్ లో మా మూవీ చేశాం. మా మూవీ కంటెంట్ పట్ల మీలో కనిపిస్తున్న ఎగ్జైట్ మెంట్ చూస్తున్నాం. మా సినిమా మీ అందరి ఆదరణ పొందుతుందని ప్రేమను గెలుచుకుంటుందని ఆశిస్తున్నాం. అన్నారు.

డైరెక్టర్ ప్రశంకర్ మాట్లాడుతూ - రిలేషన్ షిప్ లో ఎన్నో ఎమోషన్స్ చూస్తాం. తన గర్ల్ ఫ్రెండ్ లోని డిఫరెంట్ ఎమోషన్స్ ను క్రిష్ అనే అబ్బాయి ఎలా ఫేస్ చేశాడు అనేది మా మూవీలో ఆద్యంతం ఆసక్తికరంగా తెరకెక్కించాం. ఒక బంధాన్ని కొనసాగిస్తున్న క్రమంలో భాగస్వామికి ఉన్న సంతోషం, కోపం వంటి ఎన్నో రకాల భావోద్వేగాలను ఎక్సిపీరియన్స్ చేయించేలా కథ ఉంటుంది. ఇది ప్రతి ఒక్క ఆడియెన్స్ కు కనెక్ట్ అయ్యే ఎలిమెంట్ అని భావిస్తున్నాం. మంచి మ్యూజిక్ , ఎంటర్ టైన్ మెంట్ తో పాటు చిన్న మెసేజ్ కూడా మా మూవీలో ఉంటుంది. అన్నారు.

హీరో, ప్రొడ్యూసర్ రాకేష్ వర్రె మాట్లాడుతూ - పేకమేడలు, ఎవరికీ చెప్పొద్దు సినిమాల తర్వాత ఎలాంటి కథలు ఎంచుకోవాలని ఆలోచించాను. ఈ సారి పక్కా కమర్షియల్ మూవీ చేద్దాం, అయితే అందులోనూ మన తరహా వైవిధ్యమైన కథ చూపించాలని అనుకున్నాం. ఫ్యామిలీ ఎలిమెంట్స్, మ్యూజిక్ కు ప్రాధాన్యత ఉండేలా ఒక మన్మథుడు, నువ్వునాకు నచ్చావ్, నిన్నే పెళ్లాడతా..ఇలాంటి తరహాలో సినిమా ఉండాలని ప్లాన్ చేశాం. ఖుషి సినిమాలా ఒక వైబ్ ఉన్న లవ్ స్టోరీ తెరపై చూసి చాలా కాలమవుతోంది. అలాంటి జానర్ మూవీని నేనే పర్సనల్ గా మిస్ అవుతున్నా అనిపించింది. అలాంటి ప్రయత్నమే మనం ఎందుకు చేయకూడదు అనుకున్నా. మనకు యాక్షన్ సినిమాలు చాలా వస్తున్నాయి. ఇలాంటి ట్రెండ్ లో మనం అనుకున్న జానర్ ట్రై చేద్దామని ముందుకొచ్చాం. నేను ప్రొడ్యూసర్ అయితే ఈ కథను కాంప్రమైజ్ కాకుండా చేయగలను అనుకున్నాను. నా మార్కెట్ కంటే ఎక్కువే ఖర్చు చేసి సినిమా చేశాం. ఇది బ్లాక్ బస్టర్ అందించే స్క్రిప్ట్ అని నమ్మాను. నన్ను నిలబెట్టే సినిమా అని అనిపించింది. అన్నారు.  
Advertisement
Maya Ladymaya lady trailerRakesh Varre

More Press News

NATS Touches Many Hearts In The USA And India

04 Nov, 23:06

వీవీ వినాయక్‌ అతిథిగా కిషోర్ మూవీ మేకర్స్ తొలి సినిమా ప్రారంభం

04 Nov, 16:46

కస్టమర్ల అభిమానమే మా లక్ష్యం: ఎస్ఎన్ఎస్ సీఎండీ శ్రీకాంత్ రెడ్డి

04 Nov, 12:52

నవంబరు 20న 'డానీ' విడుదల

03 Nov, 11:25

'అ' చిత్రంలో రాహుల్‌ 'ఈశ్వర్‌'లో ప్రభాస్‌లా కనిపిస్తున్నాడు: వంశీ నందిపాటి

03 Nov, 11:17

"మయూఖ" 25 రోజుల విజయ వేడుక!

03 Nov, 11:12

"కొరివి" గ్లింప్స్‌ రెస్పాన్స్‌ అన్యూహ్యం!

02 Nov, 10:04

అనిల్ రావిపూడి ‘జనవరి 12 విడుదల’లో పాడే అవకాశం దక్కించుకోనున్న ముగ్గురు 'సరిగమప' కంటెస్టెంట్స్

31 Oct, 19:33

‘ఓ నా సిద్ధయ్య’ పాటను ఆవిష్కరించిన సోనూసూద్

31 Oct, 16:28

Sai Rajesh’s Mynaa Movie Launched

30 Oct, 23:31

‘మైలురాయి’ టైటిల్ ఆసక్తికరంగా ఉంది: నాగబాబు

30 Oct, 23:25

FIEO, Central Bank of India Educate Entrepreneurs on Export Opportunities

30 Oct, 17:28

పూజా హెగ్డే, హరీశ్ శంకర్, అనిల్ రావిపూడి, వి.వి. వినాయక్‌లతో జీ తెలుగు వీకెండ్ సందడి!

30 Oct, 14:34

డియర్ ఆస్ట్రోనాట్’ గొప్ప సినిమాగా నిలుస్తుంది : శేఖర్ కమ్ముల

29 Oct, 20:15

‘డ్యాడ్స్ లిటిల్ ఫ్రెండ్’ టీజర్‌ విడుదల

29 Oct, 20:10
..More Press News