Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన టీం ఇండియా..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన టీం ఇండియా క్రికెటర్ మహ్మద్ సిరాజ్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన టీం ఇండియా క్రికెటర్ మహ్మద్ సిరాజ్
అంతర్జాతీయ క్రికెట్ లో భారత దేశానికి, మన తెలంగాణ రాష్ట్రానికి గొప్ప పేరు, గౌరవాన్ని తెచ్చిన అల్ రౌండ్ క్రికెటర్ మొహమ్మద్ సిరాజ్ ను ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అభినందించారు. టీ-20 వరల్డ్ కప్ ను గెలుచుకున్న అనంతరం హైదరాబాద్ కు చేరుకున్న సిరాజ్ మంగళవారం ఉదయం ముఖ్యమంత్రిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి సిరాజ్ ను ఘనంగా సన్మానించారు. 


మహ్మద్ సిరాజ్ అంతర్జాతీయ క్రికెట్‌లో తన అద్భుతమైన ప్రతిభను ప్రదర్శిస్తున్నాడని, అందుకే ఈ రోజు అత్యున్నత స్థాయి క్రికెటర్లలో ఒకడుగా పేరు సంపాదించుకున్నారని ముఖ్యమంత్రి ప్రశంసించారు. సిరాజ్ కు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉద్యోగం, ఇంటి స్థలం కేటాయించాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లో లేదా చుట్టుపక్కల ప్రాంతాల్లో అందుకు అనువైన స్థలాన్ని వెంటనే గుర్తించాలని, అలాగే ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలసిందిగా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

   
     
     

     

     
Revanth Reddy
Mohammad Siraj

Watch Today's Deals on Amazon

More Press News