మన ఊరు/బస్తీ - మన బడి ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు ఆధునిక వసతులు కల్పిస్తున్న ప్రభుత్వం

Related image

  • రూ.7,289 కోట్లతో 3 ఏండ్లలో 26,065 పాఠశాలల్లో మౌళిక వసతులు
  • 20 లక్షల మంది విద్యార్థులకు లబ్ది
  • పైలట్ ప్రాజెక్టు కింద రూ.3.57 కోట్లతో చేసిన పనులతో కార్పొరేట్ పాఠశాలల కంటే దీటుగా మారిన 4 ప్రభుత్వ పాఠశాలలు
హైదరాబాద్ :3 ఆగస్టు, 22: తెలంగాణ రాష్ట్రము ఏర్పడిన తరువాత విద్యారంగం బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రములోని అన్ని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం ప్రభుత్వం మన ఊరు - మన బడి /మన బస్తి -మన బడి అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రము లోని అన్ని ప్రభుత్వ, స్థానిక సంస్థల  పాఠశాలలలో మౌలిక వసతులు కల్పించడం కోసం రూ.7,289 కోట్ల 54 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. ఈ పనులతో రాష్ట్రములోని 26,065 ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలలో చదువుతున్న19,84,167 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ కార్యక్రమం ద్వారా నీటి సౌకర్యం తో కూడిన టాయిలెట్స్, విద్యుదీకరణ, తాగునీటి సరఫరా, విద్యార్థులు ఉపాధ్యాయులు, సిబ్బందికి సరిపడా ఫర్నిచర్, పాఠశాల మొత్తం పెయింటింగ్ వేయడం, పెద్ద చిన్న మరమత్తులు, గ్రీన్ చాక్ బోర్డ్స్, ప్రహరీ గోడలు, కిచెన్ షేడ్స్, శిథిలమైన గదుల స్థానంలో కొత్త క్లాస్ రూమ్స్, ఉన్నత పాఠశాలలో  డైనింగ్ హాల్స్, డిజిటల్ విద్య ఏర్పాటుచేయడం జరుగుతుంది. మూడు సంవత్సరాలలో ప్రభుత్వ, స్థానిక సంస్థల  పాఠశాలలలో మౌలిక వసతులు కల్పించడం జరుగుతుంది.

మార్చి 8, 2022 న వనపర్తి జిల్లా కేంద్రం లోని  జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల లో రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారి చేతుల మీదుగా మన ఊరు -మన బడి కార్యక్రమమునకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ ఫ్లాగ్ షిప్ ప్రోగ్రాం గా చేపట్టి మూడు దశలలో మూడు సంవత్సరాల వ్యవధిలో పూర్తి చేయడం జరుగుతుంది.

మొదటి దశలో 13 లక్షల మంది విద్యార్థులను కవర్ చేసేలా మొత్తం పాఠశాలలో ప్రస్తుతం విద్యా సంవత్సరం లో విద్యార్థుల నమోదు ఎక్కువగా ఉన్న 9,123  పాఠశాలలోపనులు ప్రారంభించడం జరిగింది .ఇందు కోసం మొదటి దశలో దాదాపు రూ.3,497 .62 కోట్లు రూపాయలు ఖర్చుచేయడం జరుగుతుంది.ఈ పనులన్నీ పాఠశాల నిర్వహణ కమిటీల ద్వారా అమలుచేయడం జరుగుతుంది. ఎంపిక చేసిన పాఠశాలలో పనుల మంజూరు బాధ్యత ను జిల్లా కలెక్టర్లకు అప్పగించడం జరిగింది. MLA, MLC  ల నియోజక వర్గ అభివృద్ధి నిధులోనుంచి 40% నిధులను పంచాయత్ రాజ్, ఎస్సి, ఎస్టీ సబ్- ప్లాన్ లలో కొంత శాతం నిధులను ఈ పథకం కోసం కేటాయించనున్నారు. అలాగే  కార్పొరేట్ కంపెనీల నుండి విరాళాలు, కార్పొరేటు సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రోగ్రాంల ద్వారా నిధులను సమకూర్చడం జరుగుతుంది. మొదటి దశలో భాగంగా మండలాన్ని యూనిట్ గా తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా 9,123 పాఠశాలల రూపురేఖలు మార్చే యజ్ఞానికి శ్రీకారం చుట్టింది. దీని ద్వారా పాఠశాల్లో విద్యార్త్యుల నమోదుకూడా పెరిగింది.

ఈ పథకాన్ని ప్రారంభించేనాటికి నాలుగు పాఠశాలలను ఆదర్శంగా తీసుకొని అభివృద్ధి చేసి సిద్ధంగా ఉంచారు. రూ 3.57 కోట్ల నిధులతో రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం ZPHS జిల్లెలగూడ, రాజేంద్రనగర్ మండలం ZPHS శివరాంపల్లి,హైదరాబాద్ జిల్లా గన్ ఫౌండ్రిలోని ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాల మోడల్ ఆలియా,  ప్రాథమిక, ఉన్నత పాఠశాల మహబూబియా (బాలికలు ) లను మన ఊరు /బస్తీ -మన బడి పైలెట్ ప్రాజెక్టు కింద ప్రారంభించడం జరిగింది.ఈ పాఠశాలలను ఆధునిక వసతులు, ఆకర్షనీయమైన గోడ చిత్రాలతో విద్యార్థులలో సృజనాత్మకంగా తీర్చిదిద్దటం జరిగింది.

తోలి విడతగా రాష్ట్ర వ్యాప్తంగా 9,123 పాఠశాలలు అనగా 5,399 ప్రాథమిక, 1,009 ప్రాథమికోన్నత 2,715 ఉన్నత పాఠశాలలను ఎంపికచేశారు. ఇంజనీరింగ్ విభాగం అధికారులు 12 అంశాలకు సంభందించిన అంచనాలతో ప్రతిపాదనలు రూపొందించి కలెక్టర్ల నుండి పరిపాలనాపరమైన ఆమోదంతో  కొన్ని జిల్లాలో పనులు కూడా మొదలు పెట్టడం జరిగింది.  

More Press Releases