26న ఉపాధ్యక్షుడు జగదీప్ ధంకర్ పర్యటనకు సిద్ధమవుతున్న ప్రధాన కార్యదర్శి శాంతికుమారి

Related image

హైదరాబాద్, ఏప్రిల్ 23: ఉపరాష్ట్రపతి జగదీప్‌ థన్కర్ ఈ నెల 26న రాష్ట్రానికి వస్తున్నందున తగిన విధంగా అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. మంగళవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఉపరాష్ట్రపతి పర్యటనకు సంబంధించి సీఎస్ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి ఏర్పాట్లను సమీక్షించారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి బ్లూ బుక్ ప్రకారం తగిన ఏర్పాట్లు చేయాలని ఆమె సూచించారు. పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్, బందోబస్త్ చేయాలని పోలీసు శాఖను ఆదేశించారు. ఈ పర్యటనలో సరిపడా వైద్య సిబ్బందితో వైద్య సౌకర్యాలు కల్పించాలని ఆరోగ్య శాఖను కోరారు. భారత ఉపరాష్ట్రపతి ప్రయాణించే దారిలో రోడ్ల మరమ్మతులు చేపట్టాలని R&B శాఖకు సూచించారు. అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని విధ్యుత్ శాఖను ఆదేశించారు. అదే విధంగా అగ్నిమాపక శాఖ తగిన అగ్నిమాపక ఏర్పాట్లు చేయాలని చెప్పారు. 


డీజీపీ రవిగుప్తా, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, గవర్నర్ కార్యదర్శి బీ వెంకటేశం, ఫైర్ సర్వీసెస్ డీజీ నాగిరెడ్డి, ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా చొంగ్తు, జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ ఎండీ ముషారఫ్ అలీ ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

     

More Press Releases