Dokka Manikya Varaprasad: టీడీపీలో చేరిన డొక్కా మాణిక్య వరప్రసాద్

Dokka Manikya Varaprasad joins TDP
  • ఇవాళ వైసీపీకి రాజీనామా చేసిన డొక్కా మాణిక్య వరప్రసాద్
  • చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిక
  • నాలుగేళ్ల తర్వాత టీడీపీలోకి తిరిగొచ్చిన మాజీ మంత్రి
ఈ ఉదయం వైసీపీకి గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ సాయంత్రానికి టీడీపీలో చేరారు. తన మద్దతుదారులతో కలిసి చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీ కండువా కప్పుకున్నారు. 

గతంలో తెలుగుదేశం పార్టీలో కొనసాగిన మాణిక్య వరప్రసాద్ 2020 మార్చిలో వైసీపీలో చేరారు. ఆయన తాడికొండ అసెంబ్లీ టికెట్ ఆశించారు. అయితే, వైసీపీ హైకమాండ్ తాడికొండ టికెట్ ను మేకతోటి సుచరితకు కేటాయించింది. ఈ నేపథ్యంలో, కొంతకాలంగా మాణిక్య వరప్రసాద్ వైసీపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. 

ఇవాళ గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్ష పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ క్రమంలో ఆయన నాలుగేళ్ల తర్వాత తిరిగి టీడీపీ గూటికి చేరినట్టయింది.
Dokka Manikya Varaprasad
TDP
Chandrababu
YSRCP
Andhra Pradesh

More Telugu News