సనత్ నగర్ నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి ఎన్ని కోట్ల నిదులైనా ఖర్చు చేస్తాం: మంత్రి తలసాని

21-01-2022 Fri 18:23

హైదరాబాద్: సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని ప్రజల సమస్యల పరిష్కారానికి ఎన్ని కోట్ల నిదులైనా ఖర్చు చేసేందుకు వెనుకాడబోమని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. శుక్రవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, వాటర్ వర్క్స్ MD దాన కిషోర్ లతో కలిసి నియోజకవర్గ పరిధిలో జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, ఎలెక్ట్రికల్, హార్టికల్చర్ తదితర శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులపై సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 9.60 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులు నిర్మాణం పూర్తయి ప్రారంభానికి సిద్దంగా ఉన్నాయని తెలిపారు. ఈ నెల 25 వ తేదీ నుండి డివిజన్ ల వారిగా ఆయా అభివృద్ధి పనులను ప్రారంభించనున్నట్లు వివరించారు. అంతేకాకుండా సుమారు 35 కోట్ల రూపాయలతో నూతన పనుల కోసం ప్రతిపాదనలను రూపొందించి నిధుల మంజూరు కోసం పంపించినట్లు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుండి 70 లక్షల రూపాయలు జీహెచ్ఎంసీ, 70 లక్షల రూపాయలు వాటర్ వర్క్స్ శాఖల పనులకు కేటాయించినట్లు తెలిపారు.

ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు చేపట్టిన అభివృద్ధి పనులు సకాలంలో పూర్తయ్యే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అధికారుల పర్యవేక్షణ సక్రమంగా లేని కారణంగానే పనులలో జాప్యం జరుగుతుందని పేర్కొన్నారు. నియోజకవర్గ పరిధిలో ప్రధాన రహదారుల అభివృద్ధి జరుగుతుందని, అంతర్గత రహదారుల అభివృద్ధిపై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపాలని మంత్రి శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాలలో ఎన్నో సంవత్సరాల క్రితం వేసిన సీవరేజ్, మంచినీటి పైప్ ల వలన ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు పిర్యాదులు చేస్తున్నారని చెప్పారు.

వాటి పరిష్కారానికి గాను నూతన పైప్ లైన్ ల ఏర్పాటు కు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇప్పటికే కొన్ని చోట్ల నూతన పైప్ లైన్ ల ఏర్పాటు తో సమస్యలను పరిష్కరించడం జరిగిందని, మిగిలిన ప్రాంతాలలో కూడా సమస్యల పరిష్కారానికి ప్రతిపాదనలను సిద్దం చేసినట్లు చెప్పారు. సనత్ నగర్ డివిజన్ లోని శ్యామల కుంటలో గల కంజర్ల లక్ష్మీనారాయణ పార్క్ కు వచ్చే వారి కోసం అన్ని వసతులను కల్పిస్తూ ఎంతో అభివృద్ధి చేయడం జరిగిందని చెప్పారు. పార్క్ లోని నీటి కొలనులో ఫెడల్ బోట్ లను ఏర్పాటు చేయాలని డీసీ వంశీని ఆదేశించారు.

సనత్ నగర్ డివిజన్ లో అత్యధికంగా 55 పార్క్ లు ఉన్నాయని, ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా మోడల్ ప్రాజెక్ట్ గా చేపట్టి పార్క్ లను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలను రూపొందించాలని మంత్రి హార్టికల్చర్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఎస్ఎన్డీపీ సీఈ వసంత, వాటర్ వర్క్స్ ఈఎన్సీ కృష్ణ, నార్త్ జోన్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఈఈ సుదర్శన్, హార్టికల్చర్ డీడీ శ్రీనివాస్, ట్రాన్స్ కో ఎస్ఈ చంద్రశేఖర్, డీఈ శ్రీధర్, టౌన్ ప్లానింగ్ ఏసీపీ క్రిస్టోఫర్, ఏఎంఓహెచ్ భార్గవ్ తదితరులు పాల్గొన్నారు.


More Press Releases
Safety Audit on Monsoon preparedness for safety of citizens – Certain instructions
48 minutes ago
Infinity Learn by Sri Chaitanya (Asia’s largest Education group) acquires Wizklub for $10 million
3 hours ago
కర్ణాటక కమిషన్ తో భేటీ అయిన తెలంగాణ బీసీ కమిషన్
4 hours ago
పారిశుధ్య నిర్వహణ విధానంలో సమయపాలన పాటించాలి: వీఎంసీ కమిషనర్
4 hours ago
అన్వితా రెడ్డికి నిరంతర ప్రోత్సాహం: బొప్పన అచ్యుత రావు
5 hours ago
KFC got people screaming with new smart feature in app 'Howzzat'
8 hours ago
Adivi Sesh, Shobitha Dhulipala to grace as special guests in Sarkaar 2 and Telugu Indian Idol
9 hours ago
మహిళా చట్టాలు కేవలం మహిళలే కాదు పురుషులు కూడా తెలుసుకోవాలి: సునీతా లక్ష్మారెడ్డి
11 hours ago
సెంట్రల్ లో రూ. 3 కోట్లతో పార్కుల అభివృద్ధి: ఎమ్మెల్యే మల్లాది విష్ణు
11 hours ago
Infinix augments its HOT portfolio; Launches HOT 12 Play for a fully-loaded entertainment experience
1 day ago
Now fulfil your travel dreams with a flat 50% off on all domestic flights & hotels with Cleartrip Tatkaal!
1 day ago
USATA launches ARIA LifeWater - the world's first atmospheric mineral water
1 day ago
Indian terrain strengthens its footprint in TS-AP with the launch of two new flagship stores in Hyderabad
1 day ago
I look forward to further strengthening the Olympic Movement in our country: Nita Ambani
1 day ago
జగనన్న ఇళ్ళ లే అవుట్లను పరిశీలించిన వీఎంసీ కమిషనర్.. అధికారులకు పలు ఆదేశాలు
1 day ago
PM to visit Hyderabad and Chennai on 26 May
1 day ago
BOB Financial and HPCL launch co-branded contactless RuPay Credit Card
1 day ago
Rare surgeries for a woman who is at risk of recurrence of cancer
1 day ago
Prime Minister's meeting with President of the United States of America
1 day ago
నేడు కర్ణాటకలో తెలంగాణ బీసీ కమిషన్ పర్యటన
1 day ago
అమీర్ పేట, సనత్ నగర్ లలో స్విమ్మింగ్ పూల్ లను ప్రారంభించిన మంత్రి తలసాని
1 day ago
Medica, the first hospital in Kolkata to use Rotapro Atherectomy Device for treating Triple Vessel Disease
1 day ago
డాక్టర్ ఎంసీఆర్ హెచ్ ఆర్ డీ ఇనిస్టిట్యూట్ లో అధికారులతో మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్షా సమావేశం
2 days ago
Bye Election to the Council of States (Rajya Sabha), 2022 from TS has been elected uncontested
2 days ago
సాహిత్య అకాడమిని సందర్శించిన సుల్తానియా
2 days ago
Advertisement
Video News
భార్యతో కలిసి మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న రోహిత్ శర్మ
భార్యతో కలిసి మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న రోహిత్ శర్మ
17 minutes ago
Advertisement 36
దావోస్‌లో గ‌ల్లా జ‌య‌దేవ్‌!... కేటీఆర్‌తో క‌లిసి చ‌ర్చ‌కు హాజ‌రు!
దావోస్‌లో గ‌ల్లా జ‌య‌దేవ్‌!... కేటీఆర్‌తో క‌లిసి చ‌ర్చ‌కు హాజ‌రు!
36 minutes ago
బావను చంపేందుకు కత్తితో కోర్టుకు వచ్చిన బావమరిది!
బావను చంపేందుకు కత్తితో కోర్టుకు వచ్చిన బావమరిది!
44 minutes ago
ఏపీలో మ‌రో ఉప ఎన్నిక‌!... ఆత్మ‌కూరు అసెంబ్లీ బైపోల్‌ షెడ్యూల్ విడుద‌ల‌!
ఏపీలో మ‌రో ఉప ఎన్నిక‌!... ఆత్మ‌కూరు అసెంబ్లీ బైపోల్‌ షెడ్యూల్ విడుద‌ల‌!
1 hour ago
పాకిస్థాన్ లో నెలకొన్న దారుణ పరిస్థితులపై ఆ దేశ మాజీ క్రికెట్ కెప్టెన్ మొహమ్మద్ హఫీజ్ ఆవేదన!
పాకిస్థాన్ లో నెలకొన్న దారుణ పరిస్థితులపై ఆ దేశ మాజీ క్రికెట్ కెప్టెన్ మొహమ్మద్ హఫీజ్ ఆవేదన!
1 hour ago
వ‌ర్షం వ‌ల్ల ఆల‌స్యంగా ఎలిమినేట‌ర్ మ్యాచ్‌... టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ల‌క్నో
వ‌ర్షం వ‌ల్ల ఆల‌స్యంగా ఎలిమినేట‌ర్ మ్యాచ్‌... టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ల‌క్నో
1 hour ago
జీహెచ్ఎంసీ ప‌రిధిలో వాహ‌నాల వేగ ప‌రిమితి పెంపు!
జీహెచ్ఎంసీ ప‌రిధిలో వాహ‌నాల వేగ ప‌రిమితి పెంపు!
1 hour ago
కోన‌సీమ అల్ల‌ర్ల‌పై బీఎస్పీ తెలంగాణ క‌న్వీన‌ర్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ స్పంద‌న ఇదే!
కోన‌సీమ అల్ల‌ర్ల‌పై బీఎస్పీ తెలంగాణ క‌న్వీన‌ర్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ స్పంద‌న ఇదే!
1 hour ago
చిరంజీవి ఆ ప్రాజెక్టుపై అంతగా ఇంట్రెస్ట్ చూపడం లేదట!
చిరంజీవి ఆ ప్రాజెక్టుపై అంతగా ఇంట్రెస్ట్ చూపడం లేదట!
1 hour ago
జగన్ రాష్ట్రంలో లేరని కుట్రలు చేస్తే కుదరదు.. తప్పు చేసిన వారిని విడిచిపెట్టం: మంత్రి రోజా
జగన్ రాష్ట్రంలో లేరని కుట్రలు చేస్తే కుదరదు.. తప్పు చేసిన వారిని విడిచిపెట్టం: మంత్రి రోజా
1 hour ago
రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో నామినేష‌న్లు వేసిన వైసీపీ అభ్య‌ర్థులు
రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో నామినేష‌న్లు వేసిన వైసీపీ అభ్య‌ర్థులు
2 hours ago
రాష్ట్రాన్ని వదిలేసి.. దేశాన్ని ఉద్ధరిస్తానని తిరుగుతున్నాడు: విజయశాంతి
రాష్ట్రాన్ని వదిలేసి.. దేశాన్ని ఉద్ధరిస్తానని తిరుగుతున్నాడు: విజయశాంతి
2 hours ago
మలేసియాకు 'వాల్తేరు వీరయ్య'
మలేసియాకు 'వాల్తేరు వీరయ్య'
2 hours ago
వైసీపీ నుంచి ఎమ్మెల్సీ అనంత‌బాబు సస్పెన్ష‌న్‌
2 hours ago
డ్ర‌గ్స్ కేసులో మాజీ ఎంపీ ఆదికేశ‌వులు నాయుడు కుమారుడు అరెస్ట్‌
2 hours ago
కశ్మీర్ వేర్పాటువాది యాసిన్ మాలిక్ కు జీవిత ఖైదు శిక్ష!
కశ్మీర్ వేర్పాటువాది యాసిన్ మాలిక్ కు జీవిత ఖైదు శిక్ష!
2 hours ago
లైఫ్ లో కాంప్రమైజ్ అయ్యేదే లేదు .. 'థ్యాంక్యూ' టీజర్ రిలీజ్!
లైఫ్ లో కాంప్రమైజ్ అయ్యేదే లేదు .. 'థ్యాంక్యూ' టీజర్ రిలీజ్!
3 hours ago
రావుల‌పాలెంలో హైటెన్ష‌న్‌... తూర్పు గోదావ‌రి జిల్లా ఎస్పీ కారుపై రాళ్ల దాడి
3 hours ago
నెల వ్య‌వ‌ధిలోనే తెలంగాణ‌లో ఫెర్రింగ్ రెండో యూనిట్‌!... రూ.500 కోట్లు పెట్ట‌నున్న ఫార్మా కంపెనీ!
నెల వ్య‌వ‌ధిలోనే తెలంగాణ‌లో ఫెర్రింగ్ రెండో యూనిట్‌!... రూ.500 కోట్లు పెట్ట‌నున్న ఫార్మా కంపెనీ!
3 hours ago
ఈ తరహా శక్తుల్ని ఎలా హ్యాండిల్‌ చేయాలో ప్రభుత్వానికి తెలుసు: స‌జ్జ‌ల
ఈ తరహా శక్తుల్ని ఎలా హ్యాండిల్‌ చేయాలో ప్రభుత్వానికి తెలుసు: స‌జ్జ‌ల
3 hours ago