VV Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ పోలీసులను ఆశ్రయించిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ!

VV Lakshminarayana complains police on life threatening issues

  • గతంలో ఓబుళాపురం మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డికి జైలుశిక్ష
  • నాడు విచారణ అధికారిగా ఉన్న వీవీ లక్ష్మీనారాయణ
  • తనను చంపేందుకు విశాఖపట్నంలో కుట్ర జరుగుతోందన్న లక్ష్మీనారాయణ
  • విశాఖ సీపీకి లిఖితపూర్వక ఫిర్యాదు

సీబీఐ మాజీ జేడీ, జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వీవీ లక్ష్మీనారాయణ విశాఖ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అయితే, అనూహ్య రీతిలో ఆయన పోలీసులను ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది.

తనకు ప్రాణహాని ఉందంటూ లక్ష్మీనారాయణ విశాఖ పోలీస్ కమిషనర్ కు ఇవాళ ఫిర్యాదు చేశారు. తనను అంతమొందించేందుకు గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు ప్రణాళిక రచించారని ఆరోపించినట్టు తెలుస్తోంది.

గతంలో ఓబుళాపురం మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డి తదితరులు జైలుకు వెళ్లడం తెలిసిందే. అప్పుడు విచారణ అధికారిగా ఉన్నది లక్ష్మీనారాయణే. 

ఈ నేపథ్యంలో, ఇవాళ విశాఖ సీపీని కలిసిన లక్ష్మీనారాయణ... విశాఖలో తనను చంపేందుకు కుట్ర జరుగుతోందని లిఖితపూర్వక ఫిర్యాదు అందించారు. తనకు రక్షణ కల్పించాలని కోరారు.  

VV Lakshminarayana
Gali Janardhana Reddy
Obulapuram Mining Case
Vizag CP
Police
Jai Bharat National Party
  • Loading...

More Telugu News