కేంద్ర నిబంధనల వల్లే కొనుగోలు కొంత జాప్యం: తెలంగాణ పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్

Related image

  • తెలంగాణ ఆవిర్భావం నుండి రూ. 88వేల కోట్లతో 5.6 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
  • దేశ చరిత్రలోనే ఇది సరికొత్త రికార్డ్
  • ఈ అఖండ విజయం సీఎం కేసీఆర్ గారిదే
  • ఇప్పటికైనా కేంద్రం పునరాలోచన చేయాలి
హైదరాబాద్: కొత్త రాష్ట్రమైన తెలంగాణ అనతికాలంలోనే రైతుల నుంచి ధాన్యం కొనుగోలులో అద్భుతమైన ప్రగతిని సాధించిందని కేవలం ఏడు సంవత్సరాల్లో 88 వేల కోట్ల రూపాయలు విలువ చేసే 5కోట్ల 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి సరికొత్త రికార్డు సృష్టించిందని పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ అఖండ విజయం ముమ్మాటికి ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు వల్లే సాధ్యమైందన్నారు. దేశంలో ఈ విధంగా ధాన్యం కొనుగోలు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని స్పష్టం చేశారు. ఈ ఘనత.. గొప్పతనం సీఎం కేసిఆర్ కే చెందుతుందన్నారు.

ధాన్యం కొనుగోళ్లు ఆర్థికంగా భారం కావడంతో దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఆయా రాష్ట్రాల్లో పండిన ధాన్యాన్ని పూర్తిస్థాయి కొనుగోలుకు ముందుకు రాని నేపథ్యంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంత ఆర్థికభారమైన కూడా భరించి రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లు జరుపుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఏడాది 2014 - 15 లో 24,29 లక్షల మెట్రిక్ టన్నులు, 2015 - 16లో 23.56 లక్షల మెట్రిక్ టన్నులు, 2016 - 17లో 35.70 లక్షల మెట్రిక్ టన్నులు, 2017 - 18లో 53.99 లక్షల మెట్రిక్ టన్నులు, 2018 - 19 లో 77.46 లక్షల మెట్రిక్ టన్నులు, 2019 - 20లో కోటి 11 లక్షలు, 2020 -21 లో కోటి 41 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ కొనుగోలు చేసింది.

ఈ ఏడాది వానాకాలంలో ఇప్పటి వరకు 5,703 కొనుగోలు కేంద్రాల ద్వారా 19 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యాన్ని కొనుగోలు చేశాం. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 5.20 లక్షల మెట్రిక్ టన్నులు, కామారెడ్డి జిల్లాలో 2.86 లక్షల మెట్రిక్ టన్నులు, కరీంనగర్ జిల్లాలో 2.10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశాం. ఈ మూడు జిల్లాల్లో దాదాపు 70 నుంచి 90 శాతం వరకు కొనుగోళ్లు పూర్తయ్యాయి. మొత్తంగా ఇప్పటి వరకు రైతుల నుంచి కనీస మద్దతు ధరకు 5.06 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. ఇది తెలంగాణ రైతాంగం విజయం.

ఇలాంటి సమయంలో ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడం భాధాకరం. ఇంతటి విజయాలను సాధించిన తెలంగాణ రైతుల సంక్షేమం, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైన కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని పున:సంమీక్షించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ధాన్యం కొనుగోళ్లకు గతంలో లేని నిబంధనలు పెట్టి గడిచిన ఏడాదికాలంగా అనేక ఇబ్బందులకు గురిచేస్తోంది. ఒకవైపు ధాన్యం కొనుగోళ్లు పెరుగుతుంటే మరోవైపు కొత్త కొత్త నిబంధనలతో ఆంక్షలను విధించడం వల్ల రైతాంగానికి భవిష్యత్తులో పెనుసవాళ్లు ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ఉమ్మడి రాష్ట్రంలో ప్రజాపంపిణీ అవసరాల కోసం పంజాబ్ నుంచి బియ్యాన్ని దిగుమతి చేసుకునే పరిస్థితి ఉండేది. నేడు మన అవసరాలకుపోను దేశానికి అన్నం పెట్టేస్థాయికి తెలంగాణ రైతులు ఎదిగారు. గత ఏడాది వరకు కర్నాటక, తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్, ఒరిసా రాష్ట్రాలకు ఎఫ్ సిఐ ద్వారా బాయిల్డ్ రైస్ ను అందించడం జరిగింది.

తెలంగాణ రాక ముందు సాగునీటికి, త్రాగునీటికి, విత్తనాలకు, కరెంటుకు, ఎరువులకు పెట్టుబడికి రైతులు ఎదురుచూసేవారు. ధర్నాలు చేశారు. లాఠీదెబ్బలు తిన్నారు. వ్యవసాయమంటేనే భయపడే రోజుల నుంచి స్వరాష్ట్రంలో దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ రైతులు ఎదిగారు. చిరకాల స్వప్నాన్ని, పోరాడి తెచ్చుకున్న మన తెలంగాణ రాష్ట్రంలో, రైతు సోదరులు ఎలాంటి కష్టాలు పడొద్దని, రైతు సోదరుల జీవితాల్లో వెలుగులు నింపాలని, ఆ దిశగా రైతు సోదరుల మేలు కోసం రైతన్నలు కలలుగన్న స్వరాష్ట్రంలో.. ఈ ప్రభుత్వం ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేపట్టిన రైతు సంక్షేమ చర్యలతో రాష్ట్రంలో ఏటేటా సాగువిస్తీర్ణం పెరిగి ధాన్యం కొనుగోళ్లు పెరిగాయి. రైతుకు వరి నాటే దగ్గర్నుండీ అమ్ముకునే వరుకు కేసీఆర్ గారు వారికి ఎంతో చేయూతనిస్తూ అండగా నిలిచారు. దీంతో కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో కూడా వారు పంటపొలాల్లో శ్రమించడం మానలేదు. రికార్డుస్థాయిలో ధాన్యం పండించారు.

కోటి ఎకరాలను సాగులోకి తేవాలని కొత్తగా సాగునీటి ప్రాజెక్టులు చేపట్టి ప్రపంచం యావత్తు ఆశ్చర్యపోయేలా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. నాణ్యమైన విద్యుతను నిరంతంర సరఫరా చేస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతాంగం సంక్షేమం కోసం రైతు బంధు, రైతు భీమా వంటి పధకాలను అమలు పరుస్తున్నారు. రైతు సోదరుల సౌలభ్యం కోసం, వ్యవసాయంపై మరింత అవగాహన పెంచుకునేందుకు గాను, సమస్యలపై అధికారులతో చర్చించుకునేందుకు రైతు వేదికలు ఏర్పాటు చేశారు, పండించిన పంటలను అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు.

అకాల వర్షాలు, కేంద్ర నిబంధనల వల్లే ధాన్యం కొనుగోలు కొంత జాప్యం: మారెడ్డి

అకాల వర్షాల వల్ల ధాన్యం కొనుగోలులో అక్కడక్కడ కొంత ఇబ్బందులు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం తేమశాతం గరిష్టంగా తేమ 17 శాతం, చెత్త, తాలు, 1శాతం, మట్టి పెద్దలు, రాళ్లు, 1 శాతం ఇలా అనేక నిబంధనలు ఉన్నాయి. ఈ నిబంధనలకు లోబడి కొనుగోళ్లు జరపవాల్సి ఉంటుంది. వర్షాలతో తేమ శాతం రావడంలేదు. తేమ శాతంతో సంబంధం లేకుండా ధాన్యం కొనుగోలు చేయడానికి కేంద్ర నిబంధనలు అడ్డుగా ఉన్నాయి. కేంద్ర నిబంధనలను దృష్టిలో పెట్టుకుని రైతులు రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. తేమ శాతం విషయంలో కేంద్రం తన నిబంధనలను సడలిస్తే కొనుగోలు చేయడానికి తమకు ఎలాంటి ఇబ్బంది లేదని ఆయన స్పష్టం చేశారు.

ఈ అకాల వర్షాల వల్ల రైతులకు కొంత ఇబ్బందులు కలుగుతున్న మాట వాస్తవం. ప్రకృతి వైపరిత్యాలను ఎవరు ఎమీ చేయలేం. అయితే వాటిని ఎదుర్కొని రైతాంగానికి ఇబ్బందులు కలగకుండా కొనుగోళ్లు జరపడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. గత ఏడాది వానాకాలంలో ఇదే సమయానికి 17 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తే ఈ ఏడాది దాదాపు రెండు లక్షల మెట్రిక్ టన్నులు అధికంగా కొనుగోలు చేశాం. రైతాంగానికి ఇబ్బంది కలుగుతుంటే ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేశాం. ప్రతి రోజు లక్షకు పైగా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నాం. రైతాంగం కూడా పరిస్థితులను అర్థం చేసుకుని ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

వానాకాలంలో రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తాం. ఈ విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరంలేదు.

More Press Releases