'తెలంగాణ స్టేట్ స్కిల్ కాంపిటీషన్ - 2021' పోస్టర్ ను విడుదల చేసిన మంత్రి మల్లారెడ్డి

Related image

హైదరాబాద్: 2022 షాంఘాయిలో జరిగే అంతర్జాతీయ నైపుణ్య పోటీలకు తెలంగాణ రాష్ట్రం నుండి ఎంపిక చేయడానికి వర్చువల్ పద్దతిలో చామకూర మల్లారెడ్డి, కార్మిక మరియు ఉపాది, ఫాక్టరీస్ మరియ నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి ఈరోజున ప్రారంభించారు.
 
ప్రతి రెండు సంవత్సరములకు ఒకసారి జరిగే ఈ పోటీలకు 1045 మంది నమోదు చేసుకున్నారు. వారిలో 760 మంది యువత అర్హత సాధించారు. వీరందరూ 40 నైపుణ్యాలలో పోటీలకు వర్చువల్ పద్దతిలో 24.08.2021 మరియు 25.08.2021 తేదీలలో  హాజరుకానున్నారు. ప్రతి నైపుణ్యములో ప్రథమ ద్వితీయ స్థానములలో గెలుపొందిన అభ్యర్ధులను కేరళ లోని కొచ్చి పట్టణములో  తేదీ 20.09.2021 నుండి  25.09.2021 వరకు జరిగే దక్షిణ ప్రాంతీయ పోటీలలో పాల్గొనుటకు అనుమతించబడుదురు.

దక్షిణ ప్రాంతీయ పోటీలలో గెలుపొందిన వారిని దేశీయ నైపుణ్య పోటీలలో పాల్గొనుటకు అర్హత పొందుతారు. దేశీయ నైపుణ్య పోటీలు 22.12.2021 నుండి 29.12.2021 వరకు బెంగుళూరు నగరములో నిర్వహించబడును.
 
దేశీయ పోటీలలో ప్రథమ ద్వితీయ స్థానములలో గెలుపొందిన అభ్యర్ధులను ప్రపంచస్థాయి నైపుణ్య పోటీలలో పాల్గొనుటకు అర్హత సాధిస్తారు. ఈ పోటీలు చైనాలోని షాoగాయి నగరములో ఆగస్టు, 2022 లో నిర్వహించబడును. 2019 సంవత్సరములో జరిగిన ప్రపంచ నైపుణ్య పోటీలలో తెలంగాణ రాష్టము తరపున, గొల్లపల్లి కోటేశ్వర రెడ్డి, రాజీ రెడ్డి మెతుకు మరియు ధారావత నరేష్ లు పాల్గొనడం జరిగింది. ఈ పోటీలలో గొల్లపల్లి కోటేశ్వర రెడ్డికి medallion for excellence అవార్డు దక్కింది.

ఈ తెలంగాణ రాష్ట్రములో మొట్టమొదటిసారిగా నైపుణ్య పోటీలను నిర్వహించడము జరుగుచున్నది. ఈ సందర్భంగా మంత్రి అభ్యర్ధులను ఉద్దేశించి మాట్లాడుతూ తమ శక్తి యుక్తులను ప్రదర్శించి అద్భుత నైపుణ్యాన్ని కనబరచి మెడల్స్ అందుకోవాలని కోరుకుంటూ శుభాభినందనములను తెలుపుతూ అభ్యర్ధుల ప్రతిభ వల్ల తెలంగాణ రాష్ట్ర మరియు దేశ ప్రయోజనం జరుగుతుందని అన్నారు.

అదే విధంగా, తెలంగాణ రాష్ట్రములో గెలుపొందిన వారికి నగదు ప్రోత్సాహాలను అందించే విషయాన్ని పరిశీలిస్తానన్నారు. NSDC ఆడవార్యములో ఉపాధి మరియు శిక్షణ శాఖ నిర్వహిస్తున్న Telangana State Skill Competitions, 2021 పోస్టర్ ను మంత్రి ఈ సందర్భంగా విడుదల చేశారు.

ఈ  కార్యక్రమానికి కార్మిక మరియు ఉపాది, ఫాక్టరీస్ మరియు నైపుణ్యాభివృద్ధి శాఖామంత్రితోపాటు ఐ.రాణి కుముదిని, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, కార్మిక, ఉపాది, శిక్షణ మరియు కర్మాగారాల శాఖ, కె.వై నాయక్, సంచాలకులు, ఉపాది మరియు శిక్షణ శాఖ మరియు ఇందిర ఠాకూర్, మేనేజర్, జాతీయ నైపుణ్య అభివృద్ధి సంస్థ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

More Press Releases