RS Praveen Kumar: దాడులకు ఎవరూ భయపడవద్దు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పిలుపు

RS Praveen Kumar on attacks on BRS government
  • జూపల్లి కృష్ణారావు పెంచి పోషిస్తున్న కాంగ్రెస్ గూండాలు బీఆర్ఎస్ నాయకులపై దాడులు చేస్తున్నారని ఆరోపణ
  • కాంగ్రెస్ పాలనలో సామాన్యులకు రక్షణ లేదని విమర్శ
  • నిందితులను పోలీసులు తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్
దాడులకు ఎవరూ భయపడవద్దని నాగర్ కర్నూల్ లోక్ సభ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధైర్యం చెప్పారు. పెద్ద కొత్తపల్లి మండలం చిన్నకారుపాములకు చెందిన బీఆర్ఎస్ నాయకుడు వేమిరెడ్డి జగదీశ్ రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు దాడి చేశారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాధితుడితో కలిసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ... కొల్లాపూర్ ప్రాంతంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పెంచి పోషిస్తున్న కాంగ్రెస్ గూండాలు బీఆర్ఎస్ నాయకులపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ఈ దాడులను తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్ పాలనలో సామాన్యులకు రక్షణ లేదని విమర్శించారు. కొల్లాపూర్ ప్రాంతంలో మంత్రి జూపల్లి కృష్ణారావు అరాచకాలకు అడ్డు, అదుపు లేకుండా పోతున్నాయని మండిపడ్డారు. నిందితులను పోలీసులు తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దాడులకు ఎవరు భయపడవద్దని... అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
RS Praveen Kumar
BRS
Lok Sabha Polls

More Telugu News