సీఎం కేసీఆర్ కరోనా నుండి త్వరగా కోలుకోవాలి.. దర్గాలో ప్రార్ధనలు చేసిన హోం మంత్రి

Related image

హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కరోనా నుండి త్వరగా కోలుకోవాలని రాష్ట్ర హోం మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ హైదరాబాద్ నాంపల్లిలోని యూసూఫియన్ దర్గాలో ప్రార్ధనలు చేశారు. మంగళవారం నాంపల్లిలోని యూసూఫియన్ దర్గాకు హోం మంత్రి చాదర్ స్వయంగా తీసుకువెళ్లి కప్పి ప్రార్ధనలు చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక పోరాట యోధుడు అని, మొక్కవోని అకుంఠీత దీక్షతో తెలంగాణ సాధించిన గొప్ప నాయకుడని, తెలంగాణ రాష్ట్రం సాధించి, ఇప్పుడు రాష్ట్రాన్ని పురోభివృద్ధి, సంక్షేమ పథంలో నడిపిస్తున్నారని, వారికి తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా యావత్ దేశంలో కుల, మత, వర్గాలకు అతీతంగా అందరి ప్రజల ఆశీసులు మెండుగా ఉన్నాయని, అనేక మంది నాయకులు, ప్రజలు వారు త్వరగా కోలుకోవాలని ప్రార్ధనలు చేస్తున్నారని, ముఖ్యమంత్రి చేసిన గొప్ప కార్యక్రమాలు వారిని కాపాడుతాయని పేర్కొన్నారు.

దర్గాలో సీఎం పూర్తిగా, త్వరగా కోలుకోవాలని ప్రత్యెక ప్రార్ధనలు చేశానని హోం మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ.. ముస్లీంలు, హిందువులు, క్రైస్తవులతో సహా అన్ని వర్గాల వారు తమ తమ ప్రార్థనా మందిరాలలో ముఖ్యమంత్రి త్వరితగతిన కోలుకోవాలని ప్రార్థనలు చేయాలనీ సూచించారు. అదే విధంగా, కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని హోం మంత్రి ప్రజలను కోరారు.

శ్రీరామనవమి శుభాకాంక్షలు: హోం మంత్రి

ఆదర్శవంతమైన శ్రీ సీతారాముల కళ్యాణం జరిగే శ్రీరామనవమి పండగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు హోం శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ శుభాకాంక్షలు తెలియజేశారు. సమాజ శ్రేయస్సు కోసం శ్రీ సీతారాములు ఎన్నో త్యాగాలు చేశారని వారి ఆశీస్సులు ప్రజలకు ఉండాలని కోరుతూ హోం మంత్రి ప్రార్థించానన్నారు. కరోన నిబంధనలు పాటించి పండగ జరుపుకోవాలని ఆయన ప్రజలను కోరారు.
శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి శ్రీనివాస్ గౌడ్:
 
శ్రీరామ నవమి సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్.

సద్గుణ సంపన్నుడు శ్రీరాముని పాలన నేటికి అందరికీ ఆదర్శం. ఎన్ని కష్టాలు ఎదురైనా భర్త శ్రీరాముని అడుగుజాడల్లో నడిచిన సీతమ్మ తల్లి సమస్త మానవ జాతికి ఆదర్శమైన దంపతులన్నారు.

కరోనా మహమ్మారి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రజలు, భక్తులు తగు జాగ్రత్తలు పాటిస్తూ, శ్రీరామ నవమిని భక్తి, శ్రద్ధలతో జరుపుకోవాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు.

More Press Releases