2022 శ్రీ రామ నవమికి రామతీర్థం ఆలయం సిద్ధం: ఏపీ మంత్రి వెల్లంపల్లి

Related image

  • ప్ర‌ధాన ఆల‌యాల ర‌క్ష‌ణ ప‌టిష్టం
  • దేవ‌దాయ శాఖ‌ అధికారుల స‌మీక్ష స‌మావేశంలో మంత్రి వెల్లంపల్లి
విజయవాడ: విజయనగరం జిల్లా రామతీర్థం ఆలయం నిర్మాణ ప‌నుల‌ను 3కోట్లు రూపాయ‌ల‌తో 10నెలల్లో పూర్తి చేయాల‌ని దేవ‌దాయ శాఖ అధికారుల‌ను ‌మంత్రి వెల్లంపల్లి శ్రీ‌నివాస‌రావు ఆదేశించారు. మంత్రి వెల్లంపల్లి అధ్య‌క్ష‌త‌న‌ మంగ‌ళ‌వారం బ్ర‌హ్మ‌ణ వీధిలోని దేవ‌దాయ శాఖ క్యాంపు కార్యాల‌యంలో దేవ‌దాయ శాఖ‌ అధికారుల స‌మీక్ష స‌మావేశం జ‌రిగింది. దేవ‌దాయ శాఖ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వాణిమెహ‌న్‌, దేవ‌దాయ శాఖ అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్-1 చంద్ర‌కుమార్, దేవ‌దాయ శాఖ అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్-2 రామ‌చంద్ర‌మెహ‌న్‌, జాయింట్ క‌మిష‌న‌ర్ ఆజాద్‌, రీజ‌న‌ల్ జాయింట్ క‌మిష‌న‌ర్ భ్ర‌మ‌రాంభ‌, త‌దిత‌రులు స‌మావేశంలో పాల్గొన్నారు.

2022లో శ్రీ రామ నవమికి రామతీర్థం ఆలయం సిద్ధం కావాల‌న్నారు. అందుకు త‌గ్గిన విధంగా ప్ర‌ణాళిక‌ల‌తో ప‌నులు వేగ‌వంతం చేయాల‌న్నారు. అదే విధంగా అంత‌ర్వేది నూత‌న ర‌థం దాదాపుగా పూర్తి కావ‌డంతో ఈ నెల 11 నుంచి నిర్వ‌హించే సంప్రోక్ష‌ణ ప‌నుల‌ను వైఖాసన ఆగమ సంప్రదాయం ప్ర‌కారం చేయాల‌న్నారు. రాష్ట్రంలోని అన్ని ప్ర‌ధాన ఆల‌యాల‌కు సీసీ కెమోరాల‌ను ఏర్పాటు చేయ‌డంతో పాటుగా సెక్యూరిటీ సిబ్బంది నియ‌మ‌కంలో పోలీసుల వారి స‌ల‌హాల‌ను సూచ‌న‌లు తీసుకోవాల‌ని సూచించారు. అదే విధంగా మ్యానిపేస్టో హ‌మిల‌ అమ‌లుకు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌న్నారు.

ఇటివ‌ల సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేతుల మీదుగా శుంకుస్థాపన చేసిన దుర్గ‌గుడి అభివృద్ది ప‌నులు మ‌రియు పుష్క‌రాల సమ‌యంలో కూల‌గొట్టిన‌ 9 దేవాల‌య‌ల నిర్మాణ ప‌నులు వేగ‌వంతం చేయాల‌న్నారు.

75ల‌క్ష‌ల రూపాయ‌ల‌తో అభివృద్ది ప‌నుల‌కు శుంకుస్థాప‌న:
సంక్షేమ ప‌థ‌కాలు ప్రజలకు చేరువ కావాలన్న ప్రధాన ఉద్దేశంతో జ‌గ‌న‌న్న ప్ర‌భుత్వం ప‌ని చేస్తుంద‌ని మంత్రి వెల్లంపల్లి శ్రీ‌నివాస‌రావు అన్నారు. మంగ‌ళ‌వారం నియోజ‌క ‌వ‌ర్గంలో 37వ డివిజ‌న్‌ లోని గాంధీజి మునిసిప‌ల్ హైస్కూల్ వ‌ద్ద‌ 75ల‌క్ష‌ల రూపాయ‌ల‌తో వివిధ అభివృద్ది ప‌నుల‌కు మంత్రి శుంకుస్థాప‌న చేశారు.

గాంధీజి మునిసిప‌ల్ హైస్కూల్ గ్రౌండ్‌లో ఇండ‌ర్ స్టేడియం సిలింగ్‌, ప్లొరింగ్ ప‌నులు, ష‌టిల్ కోర్టు, క్రికెట్ నెట్ ఏర్పాటు, వాకింగ్ టాక్ నిర్మాణ ప‌నుల‌కు మంత్రి శుంకుస్థాప‌న చేశారు. కార్య‌క్ర‌మంలో వివిధ శాఖ‌ల అధికారులు, పార్టీ శ్రేణులు ఉన్నారు.

ప్ర‌జ‌లే నా కుటుంబం: మంత్రి వెల్లంపల్లి

విలక్షణ శైలికి పెట్టింది పేరు దేవ‌దాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీ‌నివాస‌రావు. మంత్రిగా బిజీ షెడ్యూల్ లో ఉన్నా ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జ‌ల‌ను చూస్తే మాత్రం కుటుంబంలా భావించి వారి కోసం సమయాన్ని వెచ్చించడం ఆయనకే సాధ్యం.


మంగ‌ళ‌వారం నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ది కార్య‌క్ర‌మల్లో భాగంగా మంత్రి ప‌లు ప్రాంతాల‌ను ప‌ర్య‌టించారు. గాంధీజి మునిసిపల్ హైస్కూలులో అభివృద్ధి ప‌నుల‌కు శుంకుస్థాప‌న అనంత‌రం మంత్రి స్థానికుల‌ను ప‌ల‌క‌రించి, గాందీజి సెంటర్ లో ఎన్నో ఏళ్లుగా పరిచయమున్న టీ స్టాల్ యజమానిని పలకరించి ఆయన పెట్టిన ఛాయ్ ని రోడ్డు పక్కనే అరుగుపై కూర్చుని తాగడం కూడా మంత్రి హుందాతనానికి నిదర్శనం. ప్ర‌జ‌ల‌ పట్ల మంత్రికి ఉండే ప్రత్యేకమైన అభిమానం చెప్పకనే చెబుతున్నాయి.


More Press Releases