'మాంగ్లిక్' (నెట్ ఫ్లిక్స్) సిరీస్ రివ్యూ!
Advertisement
Manglik Review
ఈ మధ్య కాలంలో ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై బెంగాలీ సిరీస్ ల జోరు పెరుగుతోంది. థ్రిల్లర్ జోనర్లో రూపొందిన బెంగాలీ సిరీస్ లకు విశేషమైన ఇతర భాషలలోను విశేషమైన ఆదరణ లభిస్తోంది. అలాంటి నేపథ్యంలో వచ్చిన మరో బెంగాలీ సిరీస్ గా 'మాంగ్లిక్' కనిపిస్తుంది. 6 ఎపిసోడ్స్ గా నిర్మితమైన ఈ సిరీస్ కి, కృశాను గంగూలీ దర్శకత్వం వహించాడు. ఈ నెల 20వ తేదీ నుంచి ఈ సిరీస్, 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళ .. హిందీతో పాటు తెలుగులోనూ అందుబాటులో ఉంది.
డాక్టర్ సిద్ధార్థ్ సేన్ ( గౌరవ్ ఛటర్జీ) తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తూ ఉంటాడు. పిన్నీ - బాబాయ్ ఫ్యామిలీ కూడా వాళ్లతోనే కలిసి ఉంటూ ఉంటారు. ఇక ఆ ఇంట్లో 'మాయ' స్థానం ప్రత్యేకం. ఆమెను కూడా వాళ్లంతా తమ కుటుంబ సభ్యురాలిగానే చూస్తుంటారు. అదే ఊళ్లో తన ఫ్యామిలీతో కలిసి 'ఇరా' నివసిస్తూ ఉంటుంది. అనుకోకుండా ఆమెకి సిద్ధార్థ్ తారసపడతాడు. ఆయన వ్యక్తిత్వం ఆమెను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఆయననే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. అదే విషయాన్ని ఇంట్లో చెబుతుంది.
డాక్టర్ సిద్ధార్థ్ కి 'కుజ దోషం' ఉందనీ, ఆల్రెడీ ఆయనకి రెండుసార్లు వివాహం జరిగిందనీ .. ఆయన ఇద్దరు భార్యలు చనిపోయారని 'ఇరా'కి తెలుస్తుంది. ఆయనకేమి మూడో భార్యగా వెళ్లినవారి పరిస్థితి కూడా అదేనని ఇంట్లో వాళ్లు చెబుతారు. అయినా వినిపించుకోకుండా, సిద్ధార్థ్ ను ఒప్పించి వివాహం చేసుకుంటుంది. సిద్ధార్థ్ కూడా తన ఇంట్లోవారికి ముందుగా చెప్పకుండా ఆమెను వివాహం చేసుకుని తీసుకుని వెళతాడు. వాళ్లంతా 'ఇరా' ధైర్యం చూసి షాక్ అవుతారు.
ఆ ఇంట్లో సిద్ధార్థ్ తల్లి మొదలు .. ఆమె తోటి కోడలు .. ఆ ఇంట్లో పెరిగిన మాయ పాత్రలు 'ఇరా'కి చాలా చిత్రంగా అనిపిస్తాయి. అంతేకాదు అప్పుడప్పుడు అచ్చు తన మాదిరిగానే ఉన్న యువతి 'ఇరా'కి ఎదురవుతూ, భయపెడుతూ ఉంటుంది. అందుకు కారణం ఏమిటనేది ఆమెకి అర్థం కాదు. తనకంటే ముందు ఆ ఇంటికి కోడలిగా వచ్చినవారు ఎలా చనిపోయారు? వాళ్లవి హత్యలా .. ఆత్మహత్యలా? జరిగిన మరణాలకు కారణం కుజదోషమేనా? అనేది మిగతా కథ.
డాక్టర్ సిద్ధార్థ్ పేరు ప్రతిష్ఠలున్న ఒక డాక్టర్. అతనికి గల కుజ దోషం కారణంగానే ఇద్దరు భార్యలు చనిపోయారని అంతా చెప్పుకుంటూ ఉంటారు. ఆ మాటలను తేలికగా కొట్టిపారేస్తూ అతనిని 'ఇరా' పెళ్లి చేసుకుంటుంది. కొత్త కోడలిగా అత్తవారింట్లో అడుగుపెట్టిన ఆమెకి అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయనే అంశం చుట్టూనే ఈ కథ తిరుగుతుంది.
గతంలో ఆ ఇంటికి కోడళ్లుగా వెళ్లినవారు ఎలా చనిపోయారు అనే ఒక కుతూహలం ఆడియన్స్ లో కనిపిస్తుంది. వాళ్లకి ఏం జరిగిందనేది తెలుకోవాలనే ఒక ఆసక్తి ఏర్పడుతుంది. అలాగే కొత్తగా ఆ ఇంటికి కోడలిగా వెళ్లిన 'ఇరా' ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొనుందా అనే ఒక ఉత్కంఠ పెరుగుతూ పోతుంది. ఇక జరుగుతున్న సంఘటనలకు కారణం కుజదోషమేనా? అనే ఒక సందేహం చాలాసేపు ఆడియన్స్ ను వెయిట్ చేయిస్తుంది.
ఈ కంటెంట్ ను సస్పెన్స్ తో నడిపించడానికి దర్శకుడు తనవంతు ప్రయత్నం చేశాడు. ఆ ఇంట్లో కోడళ్లకు ఎదురైనా అనుభవాలను ఆవిష్కరించడంలో కొంత కొత్తదనం ఉండేలా చూసుకున్నాడు. అయితే జరుగుతున్న సంఘటనలన్నిటికీ ఏదైతే ఒక కారణంగా కనిపిస్తుందో, ఆ కారణం మాత్రం రొటీన్ గా అనిపిస్తుంది. దాంతో అప్పటివరకూ అనిపించిన ఆ కాస్త కొత్తదనం కొట్టుకుపోయినట్టు అనిపిస్తుంది.
ప్రధానమైన పాత్రలను పోషించిన వాళ్లంతా బాగానే చేశారు. కథ - స్క్రీన్ ప్లే కూడా అంత బలంగా ఏమీ అనిపించవు. ప్రతాప్ ముఖర్జీ ఫొటోగ్రఫీ .. అమిత్ ఛటర్జీ నేపథ్య సంగీతం .. ఓ మాదిరిగా అనిపిస్తాయి. కొడుకు .. కోడలు .. అత్త అనే మూడు పాత్రల చుట్టూ తిరిగే ఈ సిరీస్, ఫ్యామిలీ ఆడియన్స్ కి ఫరవాలేదు అనిపించవచ్చు. మిగతా ప్రేక్షకులకు ఓ మాదిరిగా అనిపిస్తుందంతే.

Series Details
Series Name: Manglik
Genre: Mystery, Thriller
Release Date: 20 Nov 2026
Cast: Soumithrisha, Gourav Chaterjee, Laboni Sarkar, Kalyani Mandal, Ankitha
Director: Krishanu Ganguly
Music: Amith Chatarjee
Banner: A Banyan Tree Studios
Review By: Peddinti
Manglik Rating: 1.75 out of 5
Disclaimer: This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer
Advertisement