'మయూఖ' (జియో హాట్ స్టార్) మూవీ రివ్యూ!

Movie Reviews
Rating: 1.5/5Crime, ThrillerMovie details ›
Advertisement

Mayookha Review

సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల పట్ల ఆడియన్స్ విపరీతమైన ఆసక్తిని చూపిస్తుంటారు. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకి రిపీట్ ఆడియన్స్ ఉండరని అంటారు. అయితే టేకింగ్ బాగుంటే, ఈ తరహా సినిమాలను మళ్లీ మళ్లీ చూడటానికి కుతూహలాన్ని కనబరుస్తూ ఉంటారు. అలాంటి జోనర్ లో రూపొందిన 'మయూఖ', అక్టోబర్ 9వ తేదీన థియేటర్లకు వచ్చింది. పెద్దగా పబ్లిసిటీ లేకుండా విడుదలైన ఈ సినిమా, ఈ నెల 20వ తేదీ నుంచి 'జియో హాట్ స్టార్'లో స్ట్రీమింగ్ అవుతోంది.

మయూఖ (పాయల్ చెంగప్ప) ఒక ఫ్లాట్ లో రెంట్ కి ఉంటూ, ప్రైవేట్ బ్యాంకులో పనిచేస్తూ ఉంటుంది. ఆ బ్యాంకుకి మేనేజర్ గా వినయ్ ఉంటాడు. హనీ .. అభిరామ్ కూడా మయూఖతో కలిసి పనిచేస్తూ ఉంటారు. ఆ బ్యాంకుకి సెక్యూరిటీగా రవి ఉంటాడు. మయూఖకి ఫైర్ అంటే చాలా భయం. అంతేకాదు తరచూ ఆమెకి ఒక చిత్రమైన కల వస్తుంటుంది. అంతేకాదు తనతో పాటు ఆ రూమ్ లో ఎవరో ఉన్నట్టుగా, రాత్రివేళలో తన ఫ్లాట్ డోర్ ఓపెన్ చేయడానికి ఎవరో ప్రయత్నిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. 

 కార్పెంటర్ 'కుమార్' అనే వ్యక్తి, మయూఖ కోసం బ్యాంకు చుట్టూ తిరుగుతూ ఉంటాడు. తనతో కలిసి కాఫీకి రమ్మంటూ టార్చర్ చేస్తుంటాడు. ఇక బ్యాంకు సెక్యూరిటీ గార్డుగా ఉన్న రవి కూడా మయూఖను వంకరగా చూస్తుంటాడు. ఈ సమస్యలే ఆమెను సతమతం చేస్తుంటే, అభిరామ్ కూడా ఆమెకి తలనొప్పిగా తయారవుతాడు. ఒకసారి మయూఖ ఒంటరిగా ఉన్న సమయంలో ఆమె ఫ్లాట్ కి  వచ్చిన అభిరామ్, ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తాడు. ఆమె అతణ్ణి ఫ్లాట్ లో బంధించి పోలీసులను రప్పిస్తుంది. 

పోలీసులు వచ్చేలోగా అభిరామ్ చనిపోతాడు. ఇది ఎలా జరిగిందనేది అర్థంకాక మయూఖ అయోమయంలో పడిపోతుంది. అప్పటి నుంచి పోలీస్ ఆఫీసర్ శ్రీధర్ పర్యవేక్షణలో, మిగతా పోలీసులు ఆమె కదలికలను కనిపెడుతూ ఉంటారు. అయితే అభిరామ్ హత్యకి గల కారణాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో, ముసుగులో ఉన్న సైకో కిల్లర్ ను మయూఖ చూస్తుంది. ఆ సైకో కిల్లర్ దగ్గర ఒక చిత్రమైన సెంటు వాసన వస్తుందని శ్రీధర్ కి మయూఖ చెబుతుంది. ఆ సైకో కిల్లర్ ఎవరు? అతని దగ్గర ఒక రకమైన సెంటువాసన రావడానికి కారణం ఏమిటి? అనేదే మిగతా కథ.

 సాధారణంగా సైకో కిల్లర్ చేసే హత్యలు దాదాపు ఒకే మార్క్ ను కలిగి ఉంటాయి. తన మార్క్ ఏమిటనేది హంతకుడు తెలియజేయడానికే ప్రయత్నిస్తూ ఉంటాడు. అలాంటి ఒక పద్ధతిని ఫాలో అవుతూ వచ్చిన కథనే ఇది. సైకో కిల్లర్ చేసే వరుస హత్యలు .. అతని దగ్గర చిత్రమైన సెంటు వాసన రావడానికి కారణం ఏమై ఉంటుందా అనే ఒక ఆసక్తిని రేకెత్తిస్తూ దర్శకుడు ఈ కథను తయారు చేసుకున్నాడు.

ఫస్టాఫ్ లో దర్శకుడు ఒక బ్యాంకులోని కొంతమంది ఉద్యోగులను కొన్ని పాత్రలుగా పరిచయం చేస్తాడు. ఈ పాత్రలను కలుపుకుంటూనే కథ కదలడం మొదలవుతుంది. విలక్షణమైన స్వభావం కలిగిన ఈ పాత్రల ద్వారానే ఆడియన్స్ ఉత్కంఠను పెంచడానికి తనవంతు ప్రయత్నం చేశాడు. ఇక సెకండాఫ్ లోని కథ మాత్రం, బ్యాంకు ఉద్యోగులను దాటుకుని బయటికి వెళుతుంది. ఒక కొత్త ప్రపంచంలో ఈ తతంగమంతా జరుగుతుంది. 

ఒక వైపున మయూఖకి వచ్చే కల .. ఆమెను వెంటాడుతున్న అనుభవాలు, తన చుట్టూ ఉన్న వ్యక్తులపై తనకి గల అనుమానాలు .. పోలీసుల ఇన్వెస్టిగేషన్ కి సంబంధించిన సన్నివేశాలు ఆడియన్స్ లో కుతూహలాన్ని కలిగిస్తూ వెళతాయి. సెకండాఫ్ లో, సైకో కిల్లర్ కి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ తాలూకు సన్నివేశాలు చోటుచేసుకుంటాయి. ఈ రెండింటికీ ముడివేసిన విధానమే ఇక్కడ ప్రధానంగా ఆకర్షించే మంత్రమని చెప్పాలి. అదే డీలాపడిపోయేలా ఉండటమే ఇక్కడ సమస్య.  

సస్పెన్స్ థ్రిల్లర్ కి సంబంధించిన కథలలో, చుట్టూ ఉన్న పాత్రలపై అనుమానాలు కలిగేలా చేయడం రొటీన్ గా కనిపిస్తూ ఉంటుంది. ఈ సినిమా విషయంలోను అదే పద్ధతిని అనుసరిస్తూ వెళ్లారు. ఇక సెకండాఫ్ ను కిల్లర్ కి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ నిలబెట్టవలసి ఉంటుంది అనుకున్నప్పుడు, సహజత్వానికి దూరంగా ఈ ఎపిసోడ్ తెరపైకి వస్తుంది. ఒక వ్యక్తిని సైకోగా మార్చే కారణం చాలా బలహీనంగా అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్ లోని ట్విస్ట్ పెద్దగా ప్రభావం చూపించదు. 

ప్రధానమైన పాత్రను పోషించిన పాయల్ చెంగప్పతో పాటు, మిగతా పాత్రలలో కనిపించిన వాళ్లంతా యావరేజ్ నటనను కనబరిచారు. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం ఫరవాలేదు. ఎడిటింగ్ విషయానికి వస్తే, సైకో పాత్ర తాలూకు ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలను ట్రిమ్ చేసుకోవచ్చునని అనిపిస్తుంది. రొటీన్ సీన్స్ తో పాటు, అంతగా పట్టుకోని ఫ్లాష్ ఎపిసోడ్ కారణంగా ఈ సినిమా ఓ మాదిరి కంటెంట్ గానే కనిపిస్తుంది. 

Movie Details

Movie Name: Mayookha

Genre: Crime, Thriller

Release Date: 20 Nov 2026

Cast: Payal Chengappa, Abilash Adda, Charishma Dabbara, Muralidhar Goud, Aman Masud

Director: Shree Tej

Music: Sibi Mathew Alex

Banner: Prashvitha Entertainments- Cinema Bandi

Review By: Peddinti

Mayookha Rating: 1.5 out of 5

Disclaimer: This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.

Trailer

Advertisement
MayookhaShree TejSasidhar NallaPayal ChengappaAbilash AddaCharishma DabbaraMuralidhar GoudAman Masud

More Movie Reviews

'అన్బిల్ అవన్' (సోనీలివ్) మూవీ రివ్యూ!

21 Nov, 18:33

'ఆకాశంలో ఒక తార' (మూవీ రివ్యూ)

21 Nov, 11:47

O.M Movie Review

20 Nov, 17:09

'ఓం' - మూవీ రివ్యూ!

20 Nov, 14:58

ENE Repeat Movie Review

19 Nov, 16:47

'ఈఎన్‌ఈ రిపీట్‌' మూవీ రివ్యూ

19 Nov, 16:38

'కికు చిరంజీవి' (జియో హాట్ స్టార్) మూవీ రివ్యూ!

18 Nov, 14:41

'ప్రేమద ఊరలి' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!

17 Nov, 15:26

'వరం' (జియో హాట్ స్టార్) సిరీస్ రివ్యూ!

16 Nov, 15:36
..More Movie Reviews