'ఆకాశంలో ఒక తార' (మూవీ రివ్యూ)
Advertisement
Aakasamlo Oka Tara Review
దుల్కర్ సల్మాన్ మొదటి నుంచి మలయాళ సినిమాలతో పాటు, టాలీవుడ్ మార్కెట్ పై కూడా ఎక్కువ దృష్టి పెడుతూ వస్తున్నాడు. తన సినిమాలు మలయాళంతో పాటు తెలుగులోనూ విడుదలయ్యేలా చూసుకుంటున్నాడు. ఏ మాత్రం అవకాశం చిక్కినా నేరుగా తెలుగు సినిమాలు చేస్తూ, ఇక్కడి ఆడియన్స్ కి మరింత చేరువవుతున్నాడు. అలా ఆయన చేసిన తాజా చిత్రంగా 'ఆకాశంలో ఒక తార' ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
'పాలలంక' అనే చిన్న ఊళ్లో .. ప్రభుత్వ పాఠశాలలో 'కల్పన' (సాత్విక వీరవల్లి) చదువుతూ ఉంటుంది. పదో తరగతి నుంచి ఆమెకి అంతరిక్షం పై ఇష్టం ఏర్పడుతుంది. వ్యోమగామి కావాలనే కోరిక ఆమెతో పాటు పెరుగుతూ పోతుంది. అయితే ఆమె చదువుకు అడ్డుచెబుతూ వచ్చిన తండ్రి, పదో తరగతి పరీక్షలు రాయగానే 'కృష్ణ' ( దుల్కర్ సల్మాన్)తో ఆమె పెళ్లి జరిపిస్తాడు. భర్తను కోల్పోయి .. ఒక ఆడపిల్లతో పుట్టింటికి చేరిన కృష్ణ అక్కయ్య సరస్వతి (స్వాసిక) పెత్తనమే ఆ ఇంట్లో నడుస్తుంటుంది.
'కల్పన' మైనర్ అని తెలుసుకున్న కృష్ణ, ఆమెకి ఇంకా చదువుకోవాలని ఉందని గ్రహిస్తాడు. అంతరిక్ష వ్యోమగామి కావాలనేది ఆమె ఆశయమని తెలుసుకుని, అందుకు సంబంధించిన చదువు చెప్పిస్తూ వెళతాడు. అందుకోసం ఆమెను హైదరాబాద్ కి తీసుకుని వెళతాడు. తాను డ్రైవర్ గా పనిచేస్తూ, ఆమెను ప్రోత్సహిస్తూ వెళతాడు. ఆమె నిరుత్సాహపడిన ప్రతిసారీ తాను ఉన్నానంటూ అండగా నిలబడతాడు. అయినా కొన్ని కారణాల వలన ఆమె తన 'కల'ను పక్కన పెట్టాలని అనుకుంటుంది.
అలాంటి పరిస్థితులలో 'కెన్యా'లో ఉంటున్న రోహిణి (శృతి హాసన్), కల్పన గురించి ఆరా తీస్తూ ఉంటుంది. కాలేజ్ రోజులలో రాకెట్ సైన్స్ గురించి కొత్తగా ఆలోచన చేసిన కల్పన సాయం కోసం ఆమెను గురించి వెతికిస్తూ ఉంటుంది. అలాంటి ఆమెను కల్పన ఎలా కలుసుకుంటుంది? ఆమె ద్వారా రోహిణి తాను అనుకున్నది సాధించగలుగుతుందా? అంతరిక్ష వ్యోమగామి కావాలనే కల్పన కోరిక నెరవేరుతుందా? అనేది మిగతా కథ.
ఆడపిల్లలను చదివించడం అనవసరమనే ఒక ఆలోచన, ఇప్పటికీ కొన్ని గ్రామీణ ప్రాంతాలలో కనిపిస్తుంది. అలాంటి ఒక ఆలోచన పక్కన పెట్టేసి వాళ్లను ప్రోత్సహిస్తే ఎన్నో అద్భుతాలు సృష్టిస్తారనే విషయం చుట్టూ అల్లుకున్న కథ ఇది. బలమైన సంకల్పం ఉంటే .. కాస్త చేయూతనిచ్చేవారుంటే పేదరికాన్ని దాటుకుని .. ప్రతికూల పరిస్థితులను దాటుకుని ముందుకు వెళ్లడం సాధ్యమే అని నిరూపించడానికి దర్శకుడు చేసిన ప్రయత్నం ఇది.
తన కలను నిజం చేసుకోవడానికి ఒక పేదింటి అమ్మాయి .. పల్లెటూరి అమ్మాయి ఎంతగా ఆరాటపడుతుంది .. తాను అనుకున్నది సాధించడం కోసం ఎన్ని అవమానాలను ఎదుర్కొంటుంది .. ఆమె కలను నిజం చేయడం కోసం ఆమె భర్త ఎన్ని కష్టాలను ఎదుర్కుంటూ వెళ్లాడు అనేది ఈ సినిమా ఫస్టాఫ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
ఇక కాలేజ్ స్థాయి నుంచి రాకెట్ సైన్స్ లో కొత్త పద్ధతులను గురించిన ఆలోచనలు చేయడం .. విఫలమైన ప్రతిసారి కుంగిపోకుండా మరింత పట్టుదలతో ముందుకు సాగడం వంటి సన్నివేశాలతో సెకండాఫ్ కొనసాగుతుంది. ఇక ఆమె కల .. భర్త కష్టం ఫలిస్తాయా లేదా అనే ఒక చిన్నపాటి టెన్షన్ తో ప్రీ క్లైమాక్స్ .. క్లైమాక్స్ సాగుతాయి. సస్పెన్స్ .. ఎమోషన్స్ కలిసిన ఈ సన్నివేశాలు మనసును బలంగా పట్టుకుంటాయి.
మట్టి రోడ్డు కూడా సరిగ్గా లేని ఒక మారుమూల గ్రామం నుంచి, ప్రపంచాన్ని తన వైపుకు తిప్పుకునేలా చేసిన ఒక పల్లెటూరి అమ్మాయి కథ ఇది. తన భార్య ఆనందం కోసం .. ఆశయం కోసం ఆమెకి దూరంగా ఉంటూ కష్టపడే ఒక ఆదర్శవంతమైన భర్త కథ ఇది. దర్శకుడు ఈ కథలో వినోదానికి .. పాటలకు ప్రాధాన్యతను ఇవ్వలేదు. తాను చెప్పదలచుకున్న విషయాన్ని కాస్త సీరియస్ గానే చెబుతూ వెళ్లాడు.
ఒక అమ్మాయి అంతరిక్ష ప్రయాణానికి సంబంధించిన కథను, ఆమె భర్త గుజరాత్ లోని బొగ్గు గనులలో పనిచేయడంతో మొదలుపెట్టడం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. అంతరిక్షానికి సంబంధించిన సన్నివేశాలు సాధారణ ప్రేక్షకులకు కూడా అర్థమయ్యేలానే రాసుకోవడం గొప్ప విషయం. ఈ తరహా స్ఫూర్తి ప్రధానమైన కథలకు .. బలమైన సంభాషణలు అవసరం. అలాంటి సంభాషణలు అక్కడక్కడా పేలాయి. 'తన కలలకు కాళ్లుగా మారిపోయి నడిపిస్తాను '.. 'నీ లక్ష్యం ఆకాశమైనప్పుడు ఈ భూమితో నేనేం చేసుకుంటాను' . .'పదిమంది నవ్వితే ఏంటి? ఒక్కరు నమ్మితే చాలదా' .. 'తన కలకు తాను దగ్గరవ్వాలంటే తనకి నేను దూరం కావాలి'.. వంటి సంభాషణలు గుర్తుండిపోతాయి.
సుజీత్ సారంగ్ ఫొటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. జీవీ ప్రకాశ్ కుమార్ నేపథ్య సంగీతం అదనపు బలంగా నిలిచిందనే చెప్పాలి. ప్రవీణ్ ఎడిటింగ్ పనితీరు కూడా మెప్పిస్తుంది. సాత్విక నటన ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణ అని చెప్పాలి. అందం .. అమాయకత్వం .. ఆత్మవిశ్వాసం కలిగిన ఈ పాత్రలో ఆమె రాణించింది. విశాలమైన కళ్లతో హావభావాలను గొప్పగా పండించింది. భార్యను ప్రేమించడమే కాదు, ఆమె ఆశయాన్ని నెరవేర్చే ఆయుధంగా కూడా మారాలి అని చెప్పే పాత్రలో దుల్కర్ నటన మెప్పిస్తుంది.
పల్లెటూరులో నాలుగు గోడల మధ్య అమ్మాయిల ప్రతిభను బంధించి, సూటిపోటి మాటలతో మానసిక ఆనందాన్ని పొందడం కాదు, వాళ్ల ప్రతిభను గుర్తించి ఎగరనీయాలి .. ఎదగనీయాలి అనే వైపు నుంచి స్వాసిక అభినయం మంచి మార్కులు కొట్టేస్తుంది. ఇక శృతిహాసన్ .. రుహాని శర్మ నటన కూడా బాగుంది.
ప్రవాహానికి కూడా అనేక అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి. అయినా వాటిని దాటుకుంటూ అది ముందుకు సాగుతూనే ఉంటుంది. ప్రతి ప్రయాణాన్ని విజయంతోనే ముగించాలి. చదువుకోవాలనే తపనే విజేతగా నిలబెడుతుంది. ప్రపంచంలో ఒక గుర్తింపును తీసుకొస్తుందని చాటిచెప్పే చిత్రమిది. కుటుంబ సభ్యులతో కలిసి చూడవలసిన స్ఫూర్తిప్రధానమైన సినిమా ఇది.

Movie Details
Movie Name: Aakasamlo Oka Tara
Genre: Drama, Sci-Fi
Release Date: 20 Nov 2026
Cast: Dulquer Salmaan, Satvika Veeravalli, Shruti Haasan, Ruhani Sharma, Swasika
Director: Pavan Sadineni
Music: G V Prakash Kumar
Banner: Lightbox Media
Review By: Peddinti
Aakasamlo Oka Tara Rating: 2.5 out of 5
Disclaimer: This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer
Advertisement