'ఈఎన్‌ఈ రిపీట్‌' మూవీ రివ్యూ

Movie Reviews
Rating: 2.5/5ComedyMovie details ›
Advertisement

ENE Repeat Review

చిత్రసీమలో సీక్వెల్‌ సినిమాలకు ఉన్న క్రేజ్‌.. ప్రాధాన్యత వేరుగా ఉంటుంది. ఇప్పటి వరకు టాలీవుడ్‌లో పలు సీక్వెల్స్‌ ప్రేక్షకాదరణ పొందాయి. ఆ కోవలోనే వచ్చిన మరో సీక్వెల్‌ 'ఈఎన్‌ఈ రిపీట్‌'. 2018లో తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో వచ్చిన 'ఈ నగరానికి ఏమైంది' చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన చిత్రమే ఇది. మొదటి పార్ట్‌ ముగిసిన దగ్గర నుంచే ఈ సీక్వెల్‌ ప్రారంభమవుతుంది. ఇక అదే టీమ్‌తో తెరకెక్కిన 'ఈఎన్‌ఈ రిపీట్‌' ప్రేక్షకులను మెప్పించిందా? ఈ సినిమాను దర్శకుడు ఎలాంటి కథాంశంతో తెరకెక్కించాడు అనేది సమీక్షలో తెలుసుకుందాం. 

వివేక్‌ (విశ్వక్‌సేన్‌) కౌశిక్‌ (అభినవ్‌ గోమఠం) ఉప్పి (వెంకటేష్‌ కాకుమాను), కార్తీక్‌ (మాగంటి శ్రీనాథ్‌) నలుగురు చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఈ స్నేహితులు రూపొందించిన తొలి సినిమా బాక్సాఫీస్‌ వద్ద బోల్తాపడటంతో ఆర్థికంగా చిక్కుల్లో పడతారు. ఫైనాన్షియర్స్‌గా నుంచి సినిమా తాలుకు డబ్బులు కట్టాలని  ఒత్తిడి ఉండటంతో  అప్పుల భారం తనపై వేసుకున్న వివేక్‌కు ఆ బాకీలు తీర్చడానికి ఎనిమిదేళ్లు పడుతుంది. ఇక కార్తీక్‌.. కీర్తన (శివాత్మిక రాజశేఖర్‌)ను ప్రేమిస్తాడు. అయితే కీర్తనకు వాళ్ల  తండ్రి (ప్రియదర్శి రామ్‌) వేరే పెళ్లిని ఫిక్స్‌ చేస్తాడు. ఇది తెలుసుకున్న నలుగురు స్నేహితులు ఓ రోజు మందు తాగి కీర్తనకు కాబోయే భర్త (శ్రీరామ్ చంద్ర)ను కొడతారు. దీంతో కీర్తన పెళ్లి ఆగిపోతుంది. ఇది తెలుసుకున్న కీర్తన తండ్రి నలుగురు స్నేహితులను.. పెళ్లి ఏర్పాట్లకు అయిన ఖర్చుని మీరే కట్టాలని.. లేకపోతే క్రిమినల్‌ కేసు పెట్టి జైలులో వేయిస్తానని బెదిరిస్తాడు. అప్పుడు వివేక్‌ ఆ డబ్బులు మేమే కడతామని మాట ఇస్తాడు. అయితే డబ్బుల కోసం వివేక్‌ అండ్‌ గ్యాంగ్‌ ఏం చేశారు? ఆ ప్రయత్నంలో వాళ్లు సక్సెస్‌ అయ్యారా? చివరకు ఏం జరిగింది? అనేది మిగతా కథ. 


'ఈ నగరానికి ఏమైంది' కథ ఎక్కడ అయితే ముగించాడో.. ఈ సీక్వెల్‌ను అక్కడే మొదలుపెట్టి.. దాని చుట్టూ వినోదాత్మక సన్నివేశాలను అల్లుకుని దర్శకుడు ఈ కథను తయారుచేసుకున్నాడు. ఫస్టాఫ్‌ ప్రారంభంలో కథ నెమ్మదిగా గాడి తప్పినట్లు అనిపిస్తుంది. అయితే నలుగురు స్నేహితులు కలిసిన దగ్గర నుంచి కథలో వేగం ఊపందుకుంది. స్నేహితుల నాలుగు పాత్రలను కూడా దర్శకుడు ఈ సారి మరింత జోవియల్‌గా.. హిలేరియస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ను మిక్స్‌ చేసి తయారుచేసుకున్నాడు. అయితే ఈ సన్నివేశాలు కొన్ని కడుపుబ్బా నవ్వించగా, కొన్నిచోట్ల శృతిమించిన క్రింజ్‌ కామెడీని చూస్తున్న ఫీల్‌ను కలిగిస్తాయి. 

ఫస్టాఫ్‌ ప్రారంభంలో సినిమా మొదలు కాగానే దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ ట్రాక్‌ తప్పాడేమో అనే భావన కలుగుతుంది. అయితే స్నేహితులు కలిసిన దగ్గర నుంచి అసలు కథ ప్రారంభం అవుతుంది. స్నేహితులు నలుగురు కలిసిన ప్రతీ సీన్‌ కూడా థియేటర్‌లో జోష్‌ను నింపింది. అయితే సెకండాఫ్‌లో దర్శకుడు తడబడ్డాడు. కేవలం ఏపిసోడ్స్‌ల తరహాలో సెకండాఫ్‌ను అల్లుకుని గట్టెక్కాలని ప్రయత్నించినట్లుగా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే తరుణ్‌ ప్లాన్‌ పూర్తిగా విఫలం కాలేదు. కొన్ని సీన్స్‌ ఆడియన్స్‌ కావాల్సిన వినోదాన్ని అందించాయి. మరికొన్ని సీన్స్‌ బోరింగ్‌గా.. సాగదీసినట్లుగా అనిపిస్తాయి. 

అభివన్‌ గోమఠంపై తీసిన బాడీ డబుల్‌ షూటింగ్‌ సన్నివేశంతో పాటు పతాక సన్నివేశాలు సినిమాను కంపర్ట్‌ రేంజ్‌కు తీసుకొచ్చాయి. కొత్తదనం లేని సన్నివేశాలు కూడా యూత్‌కు పట్టే  డైలాగ్‌లు.. పంచ్‌లతో అలరించేలా తెరకెక్కించాడు దర్శకుడు. ముగింపు సన్నివేశాల్లో సినిమా గురించి.. సినిమా గొప్పదనం గురించి చిత్రీకరించిన సన్నివేశాలు సగటు ప్రేక్షకునికి అంత ఆసక్తికరంగా అనిపించవు. అయితే సందీప్‌ రెడ్డి వంగా, అనిల్ రావిపూడి లాంటి దర్శకులతో కామియో చేయించి ముగింపు సన్నివేశాలకు మరింత బలం చేకూర్చాడు. ఈ ఐడియా సినిమా సేఫ్‌గా ల్యాండ్‌ అవ్వడానికి బాగానే ఉపయోగపడింది.  

వివేక్‌ పాత్రలో విశ్వక్‌సేన్‌ ఒదిగిపోయాడు. ఎంత నేచురల్‌గా ఆయన పర్‌ఫార్మెన్స్‌ కనిపించింది. అయితే ఈ చిత్రానికి అభినవ్‌ గోమటం పాత్ర ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రతి సన్నివేశంలో తనదైన మార్క్‌ను ఆయన చూపించాడు. ఈసినిమాకు విశ్వక్‌తో పాటు అభినవ్‌ కూడా మరో హీరో అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. వెంకటేష్‌ కాకుమాను పాత్ర కూడా అలరిస్తుంది. మనలో ఉండే ఓ స్నేహితుడిలానే వెంకటేష్‌ పాత్ర ఆకట్టుకుంటుంది. 

సుశాంత్‌ స్థానంలో ఈ సినిమాలో నటించిన మాగంటి శ్రీనాథ్‌ పాత్ర కూడా ఎక్కడా ఇబ్బందిగా అనిపించలేదు. శివాత్మిక పాత్ర కొత్తగా ఉంది. ఆమె నటనలో కూడా పరిణితి కనిపించింది. వివేక్‌ సాగర్‌ నేపథ్య సంగీతం సీన్స్‌ను మరింత హై చేశాయి. కెమెరా వర్క్‌ ఉన్నతంగా ఉంది. తరుణ్‌ భాస్కర్‌ డైలాగుల విషయంలో చూపిన ఇంట్రెస్ట్‌.. సెకండాఫ్‌లో కథను డీల్‌ చేయడంలో పెట్టలేదనిపించింది. ఈ నగరానికి ఏమైంది మ్యాజిక్‌ ఈ సీక్వెల్‌లో పూర్తిగా అయితే రిపీట్‌ కాలేదని చెప్పాలి. 

ఏపిసోడ్స్‌ ప్రకారం చూసుకుంటే సినిమా సంతృప్తిని ఇచ్చినా... టోటల్‌గా సినిమాలో పూర్తిగా మెస్మరైజ్‌ చేసే కంటెంట్‌ మాత్రం లేదు. అయితే జెన్‌జీ ప్రేక్షకులను మాత్రమే టార్గెట్‌ చేసుకుని చేసిన ఈ చిత్రం వాళ్లను శాటిస్‌ఫై చేస్తుంది. అయితే ఇలాంటి సినిమాకు మల్టీప్లైక్స్‌ థియేటర్‌లో ఉన్న ఆదరణ బీ.. సీ సెంటర్లో ఉండకపోవచ్చు. లాజిక్‌లు.. క్రింజ్‌ కామెడీ.. లాంటి మైనస్‌లు పట్టించుకోకపోతే.. ఈ 'ఈఎన్‌ఈ రిపీట్‌' చిత్రానికి రిపీటెడ్‌గా కాకపోయినా సరదాగా నవ్వుకోవడానికి ఒకసారి థియేటర్‌లో చూడొచ్చు.. 





Movie Details

Movie Name: ENE Repeat

Genre: Comedy

Release Date: 19 Nov 2026

Cast: Vishwak Sen, Srinath Maganti, Abhinav Gomatham, Venkatesh Kakumanu

Director: Tarun Bhaskar

PRO: vamshi shekar

Music: Vivek Sagar

Banner: S Originals, Rootnode Cinema

Review By: Maduri Madhu

ENE Repeat Rating: 2.5 out of 5

Disclaimer: This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.

Trailer

Advertisement
ENE RepeatTarun BhaskarSrujan YaraboluSandeep NagireddyVishwak SenSrinath MagantiAbhinav GomathamVenkatesh Kakumanu

More Movie Reviews

'కికు చిరంజీవి' (జియో హాట్ స్టార్) మూవీ రివ్యూ!

18 Nov, 14:41

'ప్రేమద ఊరలి' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!

17 Nov, 15:26

'వరం' (జియో హాట్ స్టార్) సిరీస్ రివ్యూ!

16 Nov, 15:36

'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్: ఆఫ్టర్ డార్క్' (జియో హాట్ స్టార్) సిరీస్ రివ్యూ!

14 Nov, 17:57

DNK Movie Review

13 Nov, 21:07

'ఐయామ్ గేమ్' (మూవీ రివ్యూ)

13 Nov, 21:02

మౌళి 'డీఎన్‌కే' మూవీ రివ్యూ

13 Nov, 20:59

Itlu Arjuna Movie Review

13 Nov, 15:02

'ఇట్లు అర్జున' (మూవీ రివ్యూ)

13 Nov, 14:46
..More Movie Reviews