'రామాయణం - పార్టు 1' (మూవీ రివ్యూ)
Advertisement
Ramayanam Part-1 Review
ఆది కావ్యమైన 'రామాయణం' ఇంతకుముందు అనేక మార్లు వెండితెరపైకి వచ్చింది. సాంకేతిక పరంగా ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని సంతరించుకుంటూ అభిమానులను అలరిస్తోంది. అలాంటి ఈ సినిమా ఈ సారి రణ్ బీర్ కపూర్ - సాయిపల్లవి - యశ్ ప్రధాన పాత్రలుగా నిర్మితమైంది. భారీ బడ్జెట్ లో నితేశ్ తివారీ రూపొందించిన ఈ సినిమా, ఈ రోజునే థియేటర్లకు వచ్చింది. 'పార్టు 1'గా వచ్చిన ఈ 'రామాయణం' ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుందనేది చూద్దాం.
అనాదిగా దేవతలకు .. దానవులకు మధ్య యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు దేవతలదే పై చేయి అవుతూ ఉంటుంది. ఈ విషయంపై రావణుడి తల్లి 'కైకసి' అసంతృప్తిగా ఉంటుంది. దేవతలను జయించే శక్తిని సాధించమని రావణుడిని ప్రోత్సహిస్తుంది. కఠోర తపస్సుతో బ్రహ్మదేవుడి సాక్షాత్కారాన్ని పొందిన రావణుడు, అనేక వరాలను పొందుతాడు. కుభేరుడిని జయించి అతని రాజ్యాన్ని ఆక్రమిస్తాడు. 'మండోదరి'తో కలిసి ఆనందకరమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉంటాడు.
'అయోధ్య'ను దశరథ మహారాజు పరిపాలిస్తుంటాడు. ఆయన ముగ్గురు భార్యలకు నలుగురు పుత్రులు కలుగుతారు. వారే శ్రీరాముడు .. లక్ష్మణుడు .. భరతుడు .. శత్రుఘ్నుడు. విశ్వామిత్రుడి వెంటవెళ్లి సుబాహుడిని .. తాటకిని వధించిన రామచంద్రుడు, జనకుడి కూతురైన సీతాదేవిని స్వయంవరం ద్వారా వివాహమాడతాడు. అయోధ్య నగరానికి తిరిగి వచ్చాక శ్రీరాముడు పట్టాభిషేకం జరిపించడానికి దశరథుడు సన్నాహాలు మొదలుపెడతాడు. అయితే గతంలో కైకేయికి ఇచ్చిన వరాల కారణంగా రాముడిని అడవులకు పంపించవలసి వస్తుంది.
'పంచవటి'లో సీతారాముల కోసం లక్ష్మణుడు 'పర్ణశాల'ను నిర్మిస్తాడు. అటుగా వచ్చిన శూర్పణఖ, రామచంద్రుడి పట్ల మనసు పారేసుకోగా, లక్ష్మణుడు ఆమె ముక్కు కోసి పంపిస్తాడు. జరిగిన సంఘటనను తనవారితో చెప్పుకుని శూర్పణఖ కన్నీళ్ల పర్యంతమవుతుంది. తనకి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవలసిందేనని పట్టుబడుతోంది. అప్పుడు అసుర సోదరులు ఏం చేస్తారు? పర్యవసానంగా చోటుచేసుకునే సన్నివేశాలు ఎలాంటివి? అనేది కథ.
'రామాయణం' చాలామందికి తెలిసిన ఇతిహాసమే. అయితే ఎలా చిత్రీకరించారు? ఎవరు ఎలా చేశారు? దృశ్య కావ్యంగా రామాయణం ఎలా అనిపిస్తుంది? అనే ఒక కుతూహలం సహజంగానే తలెత్తుతూ ఉంటుంది. 'ఆది పురుష్' తరువాత చాలా తక్కువ గ్యాప్ లోనే ఇంత భారీ బడ్జెట్ లో రామాయణం తెరకెక్కడం అందరిలో మరింత ఆసక్తి పెరగడానికి కారణమైంది. ఆ సినిమా అనేక విమర్శలను ఎదుర్కోగా, ఈ సినిమా పరిస్థితి ఏమిటా అనేది అందరిలో కుతూహలాన్ని పెంచింది.
ఒక వైపున రావణుడు తపస్సుతో తన బలాన్ని పెంచుకోవడం .. మరోవైపున శ్రీరాముడు అస్త్రశస్త్రాలను ప్రయోగించడంలో ఆరితేరడం .. విశ్వామిత్రుడి యాగ రక్షణ .. సీతాదేవి స్వయంవరం .. పట్టాభిషేకానికి దూరమై అడవుల బాటపట్టడం .. శూర్పణఖని అవమానించడం .. ప్రతీకారంగా రంగంలోకి దిగిన రావణుడు సీతను అపహరించడం .. ఆమె జాడ తెలుసుకోవడానికి రామలక్ష్మణులు బయల్దేరడం .. ఇలా ఒక ఆర్డర్ లోనే ఈ కథ ముందుకు వెళుతుంది.
ఒక వైపున దేవతలపై రావణుడు చేసే దండయాత్రలు .. మరో వైపున అసుర సంహారం చేస్తూ రాముడు సాగించే ప్రయాణంతో .. తెరపై చకచకా సన్నివేశాలు కదులుతూ ఉంటాయి. పోరాట సన్నివేశాలు .. అద్భుతమైన గ్రాఫిక్స్ తో కళ్లను కట్టిపడేస్తుంటాయి. అటు లంకానగరం .. ఇటు అయోధ్య .. ఈ రెండు నగరాల నేపథ్యంలో జరిగే సంఘటనలు ఆడియన్స్ ను అలరిస్తూ వెళుతుంటాయి.
రావణుడి తల్లి 'కైకసి' (శోభన) పాత్రతో .. ఆమెకి సంబంధించిన పోరాట దృశ్యాలతో ఈ కథ మొదలు కావడం కొత్తగా అనిపిస్తుంది. రామాయణం నేపథ్యంలో వచ్చిన చాలా సినిమాలు 'కైకసి' పాత్రను టచ్ చేయలేదు. కానీ ఈ సినిమాలో ఆమె పాత్రకి ప్రాధాన్యతనివ్వడం కొత్తగా అనిపిస్తుంది. అలాగే శూర్పణఖ భర్త 'విద్యుజ్జిహ్వుడు' పాత్రను గురించి కూడా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ పరోక్షంగా ఈ పాత్ర కారణంగానే సీతాపహరణం జరిగిందనేది చూపించడం బాగుంది.
ఇక ఈ సినిమాలో రెండు అంశాలు కాస్త వింతగా అనిపిస్తాయి. అవేంటంటే .. అసుర సైన్యం వెంటాడుతుంటే సీతాదేవి పరిగెత్తడం. రామలక్ష్మణులు తమ ఆయుధాలను ప్రయోగించే సమయం తీసుకోవడానికి పరిగెడుతూ ఉంటే, వాళ్లతో పాటు సీతాదేవి పరిగెత్తడం కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. అలాగే సీతాదేవి కూడా ఖడ్గాన్ని చేతబట్టి పోరాటాలు చేయడం జీర్ణించుకోలేని విషయంగానే కనిపిస్తుంది. ఖడ్గ మృగాలను .. సింహాలను వాహనాలుగా ఉపయోగించడం కూడా ఈ కొత్తదనంలోని భాగంగానే మనం భావించవలసి ఉంటుంది.
ఇక అటు లంకానగరం .. ఇటు అయోధ్య .. ఈ మధ్యలో మిథిలా .. ఇలా ఆయా నగరాలకు సంబంధించిన విజువల్స్ ను గొప్పగా క్రియేట్ చేశారు. రాజభవనాలు .. కాస్ట్యూమ్స్ .. రథాలను .. ఆయుధాలను .. ఆభరణాలను .. పుష్పక విమానాన్ని డిజైన్ చేసిన తీరు గొప్పగా అనిపిస్తుంది. సీతాదేవిని అపహరించుకుని వెళ్లడానికి రావణుడు పుష్పక విమానంలో రావడం .. తిరిగి వెళుతున్న రావణుడిని అడ్డుకోవడానికి జటాయువు ప్రయత్నించడం .. శ్రీరాముడు అసురులను కట్టడి చేయడానికి సుడిగాలిని సృష్టించడం వంటి దృశ్యాలు ఈ సినిమాకి హైలైట్ నిలుస్తాయని చెప్పాలి.
శ్రీరాముడు నీలమేఘ శ్యాముడు అని అంటారు. అందుకు తగినట్టుగానే ఇంతవరకూ రాముడిని నీలం వర్ణంతో చూపిస్తూ వచ్చారు. అందుకు భిన్నంగా ఈ సినిమాలో ఆయనను సాధారణంగానే చూపించడం ఆశ్చర్యపరుస్తుంది. ఇక ఇటు పురుష పాత్రలు .. అటు స్త్రీ పాత్రలకు సంబంధించి నుదుటున దిద్దే తిలక ముద్రలను సరిగ్గా డిజైన్ చేసుకోకపోవడం కనిపిస్తుంది. శ్రీరాముడిగా రణ్ బీర్ కపూర్ .. సీతాదేవిగా సాయిపల్లవి ఎంట్రీ ఇచ్చినప్పుడు, ఆ పాత్రలకు వాళ్లు సెట్ కాలేదనే అనిపిస్తుంది. ఆ తరువాత .. తరువాత ప్రేక్షకులు అలవాటుపడుతూ వెళతారు.
విభీషణుడి పాత్రను రిజిస్టర్ చేయకపోవడం .. 'మండోదరి' పాత్రలో కాజల్ ను ఏ మాత్రం ఉపయోగించుకోకపోవడం .. హనుమాన్ ఎంట్రీకి ముందు ఫస్టు పార్ట్ ను ముగించడం .. ముఖ్యంగా మనసుకు హత్తుకునే పాటలు లేకపోవడం .. అసంతృప్తిని కలిగిస్తుంది. పంకజ్ కుమార్ కెమెరా పనితనం .. ఏఆర్ రెహ్మాన్ నేపథ్య సంగీతం .. హుజెఫా లోఖండ్ వాలా ఎడిటింగ్ ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లడానికి తమవంతు ప్రయత్నం చేశాయి. రామాయణం నేపథ్యంలో గతంలో వచ్చిన సినిమాల తరహాలోనే ఈ సినిమాను నడిపిస్తూ వెళ్లారు. కాకపోతే అద్భుతమైన విజువల్స్ తో ప్రేక్షకులను ఈ సినిమా మెప్పిస్తుంది.

Movie Details
Movie Name: Ramayanam Part-1
Genre: Drama, War
Release Date: 5 Nov 2026
Cast: Ranbir Kapoor, Yash, Sai Pallavi, Sunny Deol, Ravi Dubey
Director: Nitesh Tiwari
Music: A R Rahman
Banner: Prime Focus Studios
Review By: Peddinti
Ramayanam Part-1 Rating: 2.75 out of 5
Disclaimer: This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer
Advertisement