'రుద్రవనం పీఎస్' (జీ 5) సిరీస్ రివ్యూ!
Advertisement
Rudravanam PS Review
నరేశ్ అగస్త్య ఒక వైపున తన బాడీ లాంగ్వేజ్ కి తగిన కథలను .. పాత్రలను ఎంచుకుంటూనే, మరో వైపున సిరీస్ లను చేస్తూ వెళుతున్నాడు. తాజాగా ఆయన చేసిన మరో వెబ్ సిరీస్ గా 'రుద్రవనం పీఎస్' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రైమ్ తో ముడిపడిన ఈ మిస్టరీ థ్రిల్లర్, తమిళ సిరీస్ 'విలాంగు'కి రీమేక్. చారు వాకన్ .. బెనర్జీ .. రవీంద్ర ముఖ్యమైన పాత్రలను పోషించారు. శశిధర్ మున్నంగి దర్శకత్వం వహించిన ఈ సిరీస్, 7 ఎపిసోడ్స్ గా అక్టోబర్ 30వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
'రుద్రవనం' పోలీస్ స్టేషన్ లో సబ్ ఇన్ స్పెక్టర్ గా 'శివ కుమార్' (నరేశ్ అగస్త్య) పోలీస్ ఆఫీసర్ గా పనిచేస్తూ ఉంటాడు. ఆయన భార్య 'శ్రావణి' గర్భవతిగా ఉంటుంది. ప్రేమించి .. తల్లిదండ్రులను ఎదిరించి తనతో వచ్చేసిన ఆమెను అతను ఎంతో అపురూపంగా చూసుకుంటూ ఉంటాడు. భార్యకి డెలివరీ డేట్ దగ్గర పడుతూ ఉండటంతో, ఓ పదిరోజుల పాటు సెలవు పెట్టే ఆలోచనలో ఉంటాడు. అదే సమయంలో ఓ మూడు కేసులు అతని ముందుకు వస్తాయి.
ఫణీంద్ర అనే వ్యక్తి తన కూతురు పెళ్లి కోసం దాచిన 25 లక్షల విలువైన బంగారాన్ని దొంగలు కాజేస్తారు. ఇక తన తమ్ముడు 'చంద్రం' కనిపించడం లేదంటూ ఎమ్మెల్యే భైరవుడు (రాజా రవీంద్ర) చెప్పిన మరుసటి రోజునే, అడవిలో ఒక చోట తల లేని శవం బయటపడుతుంది. అది తన తమ్ముడిది కాదనీ, తన తమ్ముడి చేతికి ఒక వ్రేలు ఉండదని భైరవుడు అంటాడు. అదే నిజమైతే చంద్రం ఏమైనట్టు? అది చంద్రం శవం కాకపోతే బయటపడిన శవం ఎవరిదీ? అనే ఒక సందేహం శివకుమార్ లో తలెత్తుతుంది.
ఈ కేసుల కారణంగా శివకుమార్ సెలవు పెట్టలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రెండు శవాలకు సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్న సమయంలోనే, మరో ఆరు హత్యలు జరిగినట్టుగా శివకుమార్ దృష్టికి వస్తుంది. మొదటి జరిగిన రెండు హత్యలకు .. ఆ తరువాత జరిగిన ఆరు హత్యలకు మధ్య ఎలాంటి సంబంధమైనా ఉందా అనే ఒక డౌట్ తో శివకుమార్ ముందుకు వెళతాడు. ఆ అన్వేషణలో అతనికి ఎలాంటి నిజాలు తెలుస్తాయి? ఆ హత్యలను చేసింది ఎవరు? అందుకు గల కారణాలు ఏమిటి? అనేది కథ.
అడవికి కాస్త దగ్గరలో ఉన్న ఒక విలేజ్ .. అక్కడ వరుసగా జరుగుతున్న హత్యలు .. హంతకుడిని పట్టుకోవడానికి .. హత్యలకు గల కారణాలను తెలుసుకోవడానికి పోలీస్ అధికారులు చేసే ప్రయత్నాలను కలుపుకుంటూ ఈ కథ ముందుకు వెళుతూ ఉంటుంది. హత్యకి గురైనవారిలో ఎమ్మెల్యే తమ్ముడు కూడా ఉండటంతో, పోలీస్ అధికారులపై మరింత ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. వాళ్లని పరిగెత్తిస్తూ ఉంటుంది.
ఒక వైపున కాజేయబడిన 25 లక్షల విలువైన బంగారం .. మరో వైపున కనిపించకుండా పోయిన ఎమ్మెల్యే తమ్ముడు .. ఇంకొక వైపున గుర్తు తెలియని శవం .. ఈ మూడు అంశాలు ఒకదానికొకటి ముడిపడిఉన్నాయా? ఒకవేళ అదే జరిగితే, అందుకు గల కారణాలు ఏమిటి? అనే సందేహాలను రేకెత్తిస్తూ దర్శకుడు ఈ కథని డిజైన్ చేసుకుంటూ వెళ్లాడు. ఇక ఫ్యామిలీ వైపు నుంచి హీరోకి గల ఒత్తిడి మరో కోణంలో ఆడియన్స్ ను ప్రభావితం చేస్తూ వెళుతూ ఉంటుంది.
'రుద్రవనం' పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగే కథ ఇది. వరుసగా జరుగుతున్న హత్యలకి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ తోనే ఈ కథ మొదలవుతుంది. మూడు ఎపిసోడ్స్ వరకూ ఈ కథ అంచెలంచెలుగా బలపడుతూ వెళుతుంది. జరుగుతున్న సంఘటనలకు కారకులు ఎవరనే విషయంలో ఆడియన్స్ అంచనాలకు దొరక్కుండా కథను నడిపించడానికి దర్శకుడు ప్రయత్నిస్తూ ఉంటాడు. అందుకోసం ఎక్కడ వీలైతే అక్కడ వేరే పాత్రలపై అనుమానం కలిగించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు.
అయితే ఈ సిరీస్ లో దర్శకుడు ఒక పాత్రపై సందేహాన్ని కలిగించి .. ఆ పాత్రపై ఆడియన్స్ అనుమానాన్ని బలపరుస్తూ .. చివరికి ఆ పాత్రనే దోషిగా నిలబెడతాడు. దాంతో ఆడియన్స్ థ్రిల్ మిస్సవుతారు. సస్పెన్స్ తో కూడిన మిస్టరీ థ్రిల్లర్ కథలలో ఇన్వెస్టిగేషన్ ప్రధానమైన పాత్రను పోషిస్తుంది. ప్రేక్షకుల గెస్ కి అందకుండా కథ మలుపులు తీసుకుంటూ ఉంటుంది. కానీ ఈ కథలోని మలుపులు ఆడియన్స్ ను పెద్దగా ఆశ్చర్యపరచవు.
ఇక కథలో చాలానే పాత్రలు కనిపిస్తాయి. కానీ ఎమ్మెల్యే భైరవుడు మొదలు చాలా పాత్రలకు ఎలాంటి ప్రాధాన్యత కనిపించదు. ఆయన తమ్ముడి మర్డర్ అంటూ హడావిడి చేశారు. కానీ ఆ పాత్ర కూడా చాలా సాదాసీదాగా డిజైన్ చేసి వదిలారు. హత్యకి ముందు చంద్రం అనే ఆ పాత్ర .. తమ్ముడి హత్య పట్ల భైరవుడు స్పందించిన తీరు కూడా బలహీనంగా డిజైన్ చేసుకున్నారు. ఇక హత్యలన్నింటికీ మూల కారణం కూడా అంత బలమైనదిగా అనిపించదు.
అంజి పాత్రకి ప్రాధాన్యత ఉంది. కానీ ఆ పాత్రకి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ చాలా రొటీన్ గా అనిపిస్తుంది. ఫ్లాష్ బ్యాక్ అంతేకదా అని సర్దుకోలేము. ఎందుకంటే కథ మొత్తం కూడా దానిపైనే ఆధారపడి నడుస్తుంది. ఇక వేణుగోపాల్ .. సుందరం .. పురుషోత్తం .. కొండల్ వంటి పాత్రలు కూడా పెద్దగా ప్రభావితం చేయలేకపోయాయి. గతంలో వచ్చిన సిరీస్ లను గుర్తుచేస్తూ, అదే దారిలో నడిచిన కంటెంట్ గా ఇది మనకి కనిపిస్తుంది.
అస్కర్ ఫొటోగ్రఫీ .. పవన్ నేపథ్య సంగీతం .. మాధవ్ కుమార్ ఎడిటింగ్ ఫరవాలేదు. రొటీన్ కాన్సెప్ట్ .. రొటీన్ కంటెంట్ గా అనిపించే ఈ సిరీస్ ఓ మాదిరి కేటగిరీలోనే కనిపిస్తుంది.

Series Details
Series Name: Rudravanam PS
Genre: Mystery, Thriller
Release Date: 30 Oct 2026
Cast: Naresh Agasthya, Shravani Reddy, Benarjee, Raja Ravindra, Charu Wakan
Director: Shasidhar Munnangi
Music: Pavan
Banner: Sri Chakra Movies
Review By: Peddinti
Rudravanam PS Rating: 2 out of 5
Disclaimer: This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer
Advertisement