'లగ్గం టైమ్' (ఆహా) మూవీ రివ్యూ!
తెలుగు తెరపై ఇప్పుడు చిన్న సినిమాల జోరు కొనసాగుతోంది. దాంతో చిన్న సినిమాల ద్వారా చాలామంది హీరోలు .. హీరోయిన్లు పరిచయమవుతున్నారు. ఓ మాదిరి బడ్జెట్ లో తెరకెక్కించే సినిమాల కోసం ఎక్కువగా రొమాంటిక్ లవ్ స్టోరీస్ ను ఎంచుకుంటున్నారు. అలా రూపొందిన సినిమానే 'లగ్గం టైమ్'. రాజేశ్ మేరు - నవ్య చిట్యాల జంటగా నటించిన ఈ సినిమా, ఫిబ్రవరి 6వ తేదీన థియేటర్లకు వచ్చింది. ఈ నెల 25వ తేదీ నుంచి 'ఆహా'లో అందుబాటులోకి వచ్చింది.
సూర్య (రాజేశ్) 'కరీంనగర్' కి చెందిన యువకుడు. తన స్నేహితుడైన 'మాధవ్' పూణెలో జాబ్ చేస్తూ ఉండటంతో, తాను కూడా అక్కడ ఏదైనా జాబ్ చూసుకోవచ్చుననే ఆశతో వెళతాడు. మాధవ్ రూమ్ లో ఉంటూ ఉద్యోగాన్ని వెతుక్కునే పనిలో పడతాడు. అప్పటికే అనన్య (నవ్య) పూణెలో జాబ్ చేస్తూ ఉంటుంది. అదే ఆఫీస్ లో పనిచేసే 'బేబీ'తో కలిసి ఆమె ఒక ఫ్లాట్ లో ఉంటూ ఉంటుంది. అనన్య ఆఫీసులోనే పనిచేస్తున్న మాధవ్, బేబీతో ప్రేమలో ఉంటాడు. అలా మాధవ్ - బేబీ ద్వారా సూర్యకి అనన్య పరిచయమవుతుంది. సూర్య తొలి చూపుతోనే అనన్యను ఆరాధించడం మొదలు పెడతాడు. ఆమెకి మరింత దగ్గర కావాలంటే, ఆమె ఆఫీసులో జాబ్ సంపాదించాలని నిర్ణయించుకుంటాడు.
సూర్యను ఇష్టపడుతున్న అనన్య, అతను తన ఆఫీసులో జాయిన్ కావడానికి అవసరమైన సాయం చేస్తుంది. అలా వాళ్లిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారుతుంది. అనన్యను పెళ్లి చేసుకోవాలని సూర్య నిర్ణయించుకుంటాడు. అదే సమయంలో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే అనన్య తండ్రి బలరామ్ (భోగిరెడ్డి శ్రీనివాస్) ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కుంటూ ఉంటాడు. ఆ సమస్య నుంచి బయటపడటం కోసం, అదే ఊరుకి చెందిన సుబ్బరాజు (కేదార్ శంకర్) కొడుకు చందూ (నెల్లూరు సుదర్శన్)కి అనన్యను ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటాడు. అందుకు సంబంధించిన 'లగ్గం' కూడా ఖరారై పోతుంది. సరిగ్గా 'లగ్గం టైమ్'కి సూర్య ఏం చేస్తాడు? అతను తీసుకున్న నిర్ణయం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది? అనేది కథ.
ఒక పరిచయం స్నేహంగా మారడానికీ .. ఆ స్నేహం ప్రేమగా మారడానికి ఎంతో కాలం పట్టదు. అయితే ప్రేమ ముదిరిన తరువాతనే అసలు కథ మొదలవుతుంది. ఆ ప్రేమ పెళ్లిపీటల వరకూ వెళ్లే క్రమంలో ఎన్నో అవాంతరాలను .. అడ్డంకులను ఎదుర్కోవలసి ఉంటుంది. ఆడపిల్లలు తమ కుటుంబ పరిస్థితులకు .. పేరెంట్స్ మాటకు కట్టుబడి ఉండవలసి వస్తుంది. అలాంటి పరిస్థితులలో అబ్బాయిలు తీసుకునే నిర్ణయంపైనే ఆ ప్రేమకథ ఆధారపడి ఉంటుంది. అలాంటి ఒక ప్రేమకథనే ఇది.
ప్రేమించుకోవడానికి ఇద్దరి అభిప్రాయాలు .. అభిరుచులు కలిస్తే సరిపోతుంది. ప్రేమించుకోవడానికి ఎవరి అనుమతులతో పనిలేదు. కానీ పెళ్లి దగ్గరికి వచ్చేసరికి, ఇద్దరూ తమ కుటుంబాలను ఒప్పించవలసి ఉంటుంది. అందుకు అవకాశం లేకపోతే ఏమౌతుంది? ఆ ప్రేమజంట ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది? అనే ప్రధానమైన అంశం చుట్టూనే ఈ కథను తిప్పుతూ వెళ్లారు. సాధారణంగా ప్రేమకథల్లో విలన్స్ గా అమ్మాయి పేరెంట్స్ గానీ .. అబ్బాయి పేరెంట్స్ గాని కనిపిస్తూ ఉంటారు. వాళ్లు పెట్టే పరీక్షలను ఆ ప్రేమజంట దాటుకుంటూ వెళ్లడమే ఆడియన్స్ లో ఆసక్తిని రేకెత్తిస్తూ ఉంటుంది.
అయితే ఈ కథలో .. ఈ విషయంలో దర్శకుడు కాస్త కొత్తగా ఆలోచన చేశాడనే చెప్పాలి. ప్రేమ పక్షులు ఎగరకుండా అడ్డుపడుతున్నది ఎవరనే ఒక కుతూహలాన్ని పెంచడానికి ప్రయత్నం చేశారు. పరిచయం .. స్నేహం .. ప్రేమ .. పెళ్లి పీటల దిశగా అడుగులు .. దాదాపు ప్రేమకథలన్నీ ఇదే ఫార్మేట్ లో ముందుకు వెళుతూ ఉంటాయి. ప్రేమకథలో గాఢంగా కనిపించవలసింది ఫీల్. రొమాన్స్ .. ఎమోషన్స్ ఏదైనా అందులో మనసుకు హత్తుకునే ఫీల్ ఉండాలి. పాటల్లోను ఆ ఫీల్ తప్పకుండా పండాలి.
లవ్ స్టోరీస్ కి సున్నితమైన కామెడీ కూడా అవసరమే. అయితే ఇవేవీ ఈ కథలో ఆశించిన స్థాయిలో కనిపించవు.ఇక ఈ కథలో ప్రేమికుల పాలిట విలన్ ఎవరనే విషయంలో దర్శకుడు చూపించడానికి ట్రై చేసిన కొత్తదనం కూడా పేలవంగానే అనిపిస్తుంది. హీరో - హీరోయిన్ నటన ఓ మాదిరిగా అనిపిస్తుంది. ఆడియన్స్ ను కథలోకి తీసుకుని వెళ్లడానికి ఈ స్థాయి నటన సరిపోదు. మిగతా సీనియర్ ఆర్టిస్టులు బాగానే చేశారు. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తాయి.
ప్రేమకథలను ఆడియన్స్ చూసి చూసి ఉంటారు. అందువలన కొత్త పాయింట్ తో వచ్చిన ప్రేమకథలను చూడటానికే ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఒకవేళ పాత కథనే అయినా కొత్తగా చెప్పడానికి ట్రై చేస్తే కనెక్ట్ అవుతారు. అలా కాకుండా రొటీన్ కథనే చూపించడానికి ప్రయత్నం చేస్తే అసహనానికి లోనవుతారు. అలాంటి ఒక రొటీన్ ట్రాక్ లోనే నిదానంగా .. నింపాదిగా నడిచే కథ ఇది.

Movie Details
Movie Name: Laggam Time
Release Date: 2026-04-25
Cast: Rajesh Meru, Navya Chityala, Nellur Sudarshan, Preethi Sundar, Praneeth Reddy, Srinivas Bhogi Reddy, Kedar Shankar
Director: Prajoth K Vennam
Producer: Himabindu
Music: Pavan
Banner: 20 Century Entertainments
Review By: Peddinti
Trailer