'టోస్టర్' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!
రాజ్ కుమార్ రావు కథానాయకుడిగా నటించిన సినిమా 'టోస్టర్'. రాజ్ కుమార్ రావు భార్య పత్రలేఖ నిర్మించిన ఈ సినిమాకి, వివేక్ దాస్ చౌదరి దర్శకత్వం వహించాడు. బ్లాక్ కామెడీ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన ఈ సినిమాలో, కథానాయికగా సన్యా మల్హోత్రా సందడి చేసింది. ఏప్రిల్ 15వ తేదీ నుంచి నేరుగా ఈ సినిమా 'నెట్ ఫ్లిక్స్' ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చేసింది. హిందీతో పాటు వివిధ భాషల్లో అందుబాటులోకి వచ్చింది.
రమాకాంత్ (రాజ్ కుమార్ రావు) అతని భార్య శిల్ప (సన్యా మల్హోత్రా) ఒక ఫ్లాట్ లో అద్దెకి ఉంటూ ఉంటారు. రమాకాంత్ ఫెర్ఫ్యూమ్స్ కి సంబంధించిన షాప్ నడుపుతూ ఉంటాడు. అతను చాలా పిసినారి. అనవసరమైన ఖర్చులు ఎందుకనే ఉద్దేశంతో, శిల్పను సరదాగా బయటికి తీసుకుని వెళ్లడు. ఈ విషయంలో భర్త ధోరణి పట్ల శిల్ప అసహనాన్ని వ్యక్తం చేస్తూనే ఉంటుంది. చీవాట్లు పెడుతూనే ఉంటుంది.
ఒకసారి శిల్ప - రమాకాంత్ ఒక పెళ్లి వేడుకకి వెళ్లవలసి వస్తుంది. శిల్ప దగ్గరుండి పట్టుబట్టడంతో, పెళ్లివారికి గిఫ్ట్ గా ఇవ్వడం కోసం ఒక 'టోస్టర్'ను తీసుకుంటాడు. 5 వేల రూపాయాల ఖరీదు చేసే ఆ 'టోస్టర్'ను తీసుకోవడం అతనికి చాలా బాధగా అనిపిస్తుంది. అయితే చివరి నిమిషంలో ఆ పెళ్లి ఆగిపోతుంది. జరిగినదానికి అందరూ బాధపడుతూ ఉంటే, రమాకాంత్ మనసంతా ఆ టోస్టర్ పైనే ఉంటుంది. దానిని వాళ్లనుంచి తిరిగి తీసుకోవడానికి ప్రయత్నిస్తాడు.
పెళ్లి ఆగిపోవడం వలన వాళ్లు గిఫ్టులను ఒక శరణాలయానికి ఇచ్చారని తెలుసుకుంటాడు. ఆ శరణాలయానికి వెళ్లి ఆ టోస్టర్ ను కాజేస్తాడు. తమకి ఫ్లాట్ రెంట్ కి ఇచ్చిన డిసౌజా ఆంటీ ఇంట్లో దాచిపెడతాడు. ఒక ప్రముఖ రాజకీయనాయకుడి రాసలీలలకు సంబంధించిన వీడియో, డిసౌజా కొడుకు 'గ్లెన్' (అభిషేక్ బెనర్జీ) దగ్గర ఉంటుంది. రెండు కోట్లు ఇస్తే ఆ వీడియోను ఇస్తానని అతను ఆ రాజకీయనాయకుడిని బెదిరిస్తూ ఉంటాడు.
గ్లెన్ తన దగ్గరున్న ఆ వీడియోను, రమాకాంత్ తెచ్చిన 'టోస్టర్'లో దాచిపెడతాడు. ఆ టోస్టర్ కోసం వచ్చిన రమాకాంత్ ను అతను అడ్డుకుంటాడు. ఆ పెనుగులాటలో 'గ్లెన్' పై నుంచి పడిపోయి చనిపోతాడు. అయితే ఎవరో ఆ దృశ్యాన్ని వీడియో తీసి రమాకాంత్ కి పంపిస్తారు. అతను ఆ వ్యక్తి ఎవరనేది తెలుసుకునే పనిలో పడతాడు. ఇక రాజకీయ నాయకుడి వీడియో కోసం అతని మనుషులు రంగంలోకి దిగుతారు. పర్యవసానంగా జరిగే సంఘటనలే మిగతా కథ.
సాధారణంగా పిసినారితనం ఉన్నవాళ్లు రెండు రకాలుగా మనకి కనిపిస్తూ ఉంటారు. దాదాపుగా వాళ్లు ఖర్చు చేయరు. ఒకవేళ చేసినా రెండింతల ప్రయోజనం పొందేలా చూసుకుంటూ ఉంటారు. ఏదైనా ఫంక్షన్ వెళ్లి తాము చదివించిన మొత్తానికంటే ఎక్కువగా తినేసి రావడం కూడా అందులో ఒక భాగమే. అలాంటి ఒక పిసినారి తాను ఇచ్చిన గిఫ్ట్ ను తిరిగి తీసుకోవడం కోసం చేసే ప్రయత్నంలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కున్నాడనే అంశం చుట్టూనే దర్శకుడు ఈ కథను అల్లుకున్నాడు.
ఇక చాలామంది రాజకీయనాయకులు బయటికి కనిపించేది వేరు .. లోపల వాళ్ల నిజస్వరూపం వేరు. టోస్టర్ కోసం తనతో గొడవపడి చనిపోయిన 'గ్లెన్' వీడియో కోసం రమాకాంత్ గాలిస్తూ ఉంటే, అదే టోస్టర్ లో 'గ్లెన్' దాచిన రాజకీయనాయకుడి సీక్రెట్ వీడియో కోసం అతని మనుషులు వెతుకుతుంటారు. ఈ రెండు వీడియోల చుట్టూనే కథ పరిగెడుతూ ఉంటుంది. కామెడీ టచ్ తో సాగే ఈ పరుగు పందెం, అక్కడక్కడా ఆడియన్స్ ను నవ్విస్తూ ముందుకు వెళుతుంది.
హీరో .. అతని పిసినారితనంపై దర్శకుడు ఎక్కువగా ఫోకస్ చేశాడు. అందుకు సంబంధించిన సన్నివేశాలనే ఎక్కువగా డిజైన్ చేసుకున్నాడు. అయితే హీరో పాత్రతో పాటు రాజకీయనాయకుడి పాత్ర .. అతనిని బ్లాక్ మెయిల్ చేసే 'గ్లెన్' పాత్ర కూడా చాలా కీలకమైనవిగానే కనిపిస్తాయి. ఆ పాత్రల వైపు నుంచి కూడా గట్టి కామెడీనే వర్కౌట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ దిశగా కసరత్తు చేయలేదని అనిపిస్తుంది.
అంతగా ప్రాధాన్యత లేని డిసౌజా .. మాలిని పాత్రల వైపు నుంచి అనవసరమైన సన్నివేశాలను పెంచుకుంటూ వెళ్లారు. అందువలన కామెడీ పెద్దగా వర్కౌట్ కాకపోగా, చిరాకు పుడుతుంది కూడా. ఇక క్లైమాక్స్ దగ్గరికి వచ్చేసరికి, సన్నివేశాలు మరింత సిల్లీగా మారిపోతాయి. విలేజ్ లలో జరిగే స్టేజ్ డ్రామాను గుర్తుచేస్తాయి. కీలకమైన పాత్రలను లైట్ తీసుకోవడం .. లైట్ గా అనిపించే పాత్రలను సాగదీయడం ప్రధానమైన లోపంగా కనిపిస్తుంది.
జిష్ణు భట్టాఛార్జీ ఫొటోగ్రఫీ .. అమన్ పంత్ నేపథ్య సంగీతం .. చంద్రశేఖర్ ప్రజాపతి ఎడిటింగ్ ఫరవాలేదనిపిస్తాయి. రాజ్ కుమార్ రావు నటన ఆకట్టుకుంటుంది. సన్యా మల్హోత్రా ప్రత్యేక ఆకర్షణగా మెరుస్తుంది. అభిషేక్ బెనర్జీ మంచి ఆర్టిస్ట్. కానీ ఆయనను సరిగ్గా ఉపయోగించుకోలేదని అనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఓ మాదిరి కేటగిరిలోనే ఆగిపోయిన సినిమాగా చెప్పుకోవచ్చు.

Movie Details
Movie Name: Toaster
Release Date: 2026-04-15
Cast: Raj Kumar Rao,Sanya Malhotra, Archana Puran Singh,Farah Khan, Abhishek Banerjee ,Upendra Limaye
Director: Vivek Daschaudary
Producer: Rajkummar Rao
Music: Aman Pant
Banner: Kampa Films
Review By: Peddinti
Trailer