'ఐయామ్ గాడ్' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!
కన్నడలో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ 'ఐయామ్ గాడ్'. క్రితం ఏడాది నవంబర్ 7వ తేదీన థియేటర్లకు వచ్చిన సినిమా ఇది. రవిగౌడ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అతనే హీరో. ఆల్రెడీ 'సన్ నెక్స్ట్' ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చిన ఈ సినిమా, రీసెంటుగా 'అమెజాన్ ప్రైమ్'లోను అడుగుపెట్టింది. రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన ఈ సినిమా, తెలుగులోను అందుబాటులోకి వచ్చింది.
దేవా (రవి గౌడ) కాలేజ్ లో చదువుతూ ఉంటాడు. అతనిది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అతను .. బిందు (విజేత పరీక్) ప్రేమించుకుంటూ ఉంటారు. సూటిగా మాట్లాడటం .. ప్రతి చిన్న విషయానికి గొడవపడటం దేవా నైజం. ఇక తన మనసును ఎవరైనా గాయపరిస్తే, వాళ్లని మరింతగా బాధకి గురిచేయడం బిందుకి అలవాటు. దేవా ప్రవర్తన అతని తల్లిదండ్రులను బాధపెడుతూ ఉంటుంది.
ఈ నేపథ్యంలోనే ఒకసారి ఒక యువకుడితో దేవా గొడవపడతాడు. అతను రౌడీయిజం తెలిసిన 'బలరామ్' కొడుకు అనే విషయం ఆ తరువాతనే దేవాకి తెలుస్తుంది. అయినా అతను పెద్దగా భయపడడు. ఈ విషయంలో 'బిందు' మాత్రం ఆందోళన చెందుతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితులలోనే విదేశాల నుంచి దేవా కజిన్ 'తుషార్' వస్తాడు. అతను అనుభవిస్తున్న ఆస్తిపాస్తులు తమవేనని బిందుతో దేవా చెబుతాడు.
ఇలా ఒక వైపున ఈ తతంగమంతా జరుగుతూ ఉండగా, సిటీలో వరుసగా యువతుల హత్యలు జరుగుతూ ఉంటాయి. రాత్రివేళలో ఒంటరిగా ఉన్న యువతులపై ఒక సైకో హఠాత్తుగా దాడి చేసి, ఆ తరువాత వాళ్లను సజీవంగా దహనం చేస్తూ ఉంటాడు. హత్య చేసిన ప్రదేశంలో 'ఐయామ్ గాడ్' అని రాస్తుంటాడు. హంతకుడిని పట్టుకోవడానికి స్పెషల్ పోలీస్ ఆఫీసర్ గా భరత్ (రవిశంకర్) రంగంలోకి దిగుతాడు. సైకో ఎవరు? ఎందుకు హత్యలు చేస్తున్నాడు? ఈ కేసును భరత్ ఎలా ఛేదించాడు? అనేది మిగతా కథ.
ఈ సినిమా కథ రెండు వైపుల నుంచి నడుస్తూ ఉంటుంది. ఒక వైపున హీరో - హీరోయిన్ కి సంబంధించిన లవ్ ట్రాక్, వారి అలకలు .. గొడవలు .. అల్లర్లు ఆ ట్రాక్ లో మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇక రెండో ట్రాక్ లో ఎవరో తెలియని సైకో కిల్లర్ .. వరుస హత్యలు .. పోలీసుల వేట కనిపిస్తూ ఉంటాయి. ఈ రెండు ట్రాకులను దర్శకుడు ఎక్కడ కలిపాడు? ఎందుకు కలిపాడు? అనేది ఆడియన్స్ లో ఆసక్తిని రేకెత్తించే అంశం.
హీరో - హీరోయిన్ కి సంబంధించిన కథ ఏమిటనేది మనకి నేరుగా కనిపిస్తూనే ఉంటుంది. ఇక కనిపించని సైకో కథ కోసమే ఆడియన్స్ కాచుకుని కూర్చుంటారు. యువతులను మాత్రమే సైకో టార్గెట్ చేయడానికి కారణం ఏమిటి? వాళ్లని సజీవదహనం చేయడం వెనకున్న ఉద్దేశం ఏమిటి? అనేది మరో కోణంగా తెరపైకి వస్తుంది.
ఒక వైపున హత్యలు .. పోలీసుల కథ నడుస్తూ ఉంటుంది గనుక, మరో వైపున లవ్ స్టోరీతో రిలాక్స్ కావొచ్చని ఆడియన్స్ అనుకుంటే పొరపాటే. ఎందుకంటే వీళ్లిద్దరూ కాస్త తేడా ప్రేమికులే. ఉన్మాదానికీ .. స్వార్థానికి ప్రతీకలుగా కనిపిస్తూ ఉంటారు. అందువలన కథ మొదలైన దగ్గర నుంచే ఆడియన్స్ ను కంగారు పెట్టడం మొదలవుతుంది. ఈ టెన్షన్ నిదానంగా పెరుగుతూ వెళుతుంది.
స్పెషల్ పోలీస్ ఆఫీసర్ రంగంలోకి దిగిన దగ్గర నుంచి కథ ఒక రేంజ్ లో పరిగెడుతుందని ఆడియన్స్ అనుకుంటారు. కానీ ఆయన ఎంట్రీ ఇచ్చిన తరువాత నుంచి సరైన సీన్స్ ను డిజైన్ చేసుకోలేకపోయారు. వ్యూహాలు .. ఛేజింగులు .. ఇలా ఒక రకమైన హడావిడి కనిపించకుండా కథ నిదానంగా .. నింపాదిగా సాగడం లోపంగా అనిపిస్తుంది.
ఇక ప్రేమ సన్నివేశాలలో సున్నితత్వం కనిపించదు. ఇటు హీరో వైపు నుంచి .. అటు హీరోయిన్ వైపు నుంచి కాస్త 'అతి' కనిపిస్తుంది. నటీనటులంతా ఎవరి పాత్రలలో వారు బాగానే చేశారు. కాకపోతే మూడు నాలుగు ప్రధానమైన పాత్రల చుట్టూనే ఈ కథ తిరుగుతూ ఉంటుంది. మిగతా పాత్రలు నామమాత్రం అనే చెప్పాలి. జితిన్ ఫొటోగ్రఫీ .. అజనీశ్ లోక్ నాథ్ నేపథ్య సంగీతం .. ఆర్ముగం ఎడిటింగ్ ఫరవాలేదు.
'అమ్మాయిలను రక్షించాలి .. అమ్మాయిలను పూజించాలి .. అమ్మాయిలను ఆరాధించాలి' అంటూ దర్శకుడు ఈ కథను మొదలు పెడతాడు. అయితే అమ్మాయిలు అమ్మాయిల మాదిరిగా ఉండాలంటూ ముగించాడు. ఈ తరం అమ్మాయిల తీరుకు సంబంధించిన డైలాగ్స్ కొన్ని చోట్ల వినిపిస్తాయి. అక్కడక్కడా అభ్యంతరకరమైన డైలాగ్స్ కూడా ఉన్నాయి. అయితే మానసిక స్థితి సరిగ్గా ఉన్న ఒక నిజమైన ప్రేమికుడిగా హీరోను చూపించి ఉంటే, అతని అభిప్రాయం కొంతవరకూ కొంతమందికి సబబుగా అనిపించేదేమో. ఉన్మాదికీ .. ప్రేమికుడికి మధ్య ఉన్న తేడాను కూడా అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది మరి.

Movie Details
Movie Name: I Am God
Release Date: 2026-02-13
Cast: Ravi Gouda, Vijeta Fareek, Ravi Shankar, Avinash, Niranjan
Director: Ravi Gouda
Producer: KVN
Music: Ajaneesh Loknath
Banner: KVN Productions
Review By: Peddinti
Trailer