రూ.51 వేల రివార్డు వున్న 'ది మోస్ట్‌ వాంటెడ్‌ కోతి’.. చివరకు ఇలా చిక్కింది!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రూ.51 వేల రివార్డు వున్న 'ది మోస్ట్‌ వాంటెడ్‌ కోతి’.. చివరకు ఇలా చిక్కింది!

This is the most wanted monkey 51000 reward for catching it finally caught
  • హర్యానాలోని పల్వల్‌ జిల్లా హథీన్‌ పట్టణంలో కోతి హల్‌చల్‌
  • ఏకంగా 30 మందిని కరిచి కంటిమీద కునుకు లేకుండా చేసిన కోతి
  • ప్రజల ఫిర్యాదుతో రూ.51 వేల నజరానా ప్రకటించిన మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌
  • ఎట్టకేలకు ఓ వ్యక్తికి చిక్కిన కోతి.. ఊరేగింపుగా తీసుకెళ్లిన జనం
కోతి చేష్టలు మామూలుగా లేవు.. ఏకంగా 30 మందిని కరిచి పట్టణ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. దీంతో దాన్ని పట్టుకున్నవారికి రూ.51 వేల నజరానా ఇస్తానని మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ ప్రకటించారు. ఇంతకీ ఆ కోతి దొరికిందా? అంటే.. ఎట్టకేలకు చిక్కేసింది! హర్యానాలోని పల్వల్‌ జిల్లా హథీన్‌ పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

కోతిని పట్టుకున్న వ్యక్తి దాని చేతులు కట్టేసి భుజాలపై మోస్తూ బుధవారం పట్టణ వీధుల్లోకి వచ్చాడు. ఇంకేముంది.. ఆ వింత ఊరేగింపును చూసేందుకు జనం వెనకే నడిచారు. అయితే కొందరు కర్రలు తీసుకుని కోతిపై దాడి చేయడం, దాన్ని కొట్టడం వీడియోలో కనిపించింది. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

కోతి ఆగడాలతో విసిగిపోయిన స్థానికులు దాన్ని పట్టుకోవాలని అధికారులను కోరారు. దీంతో హథీన్‌ మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ రేణులత తన సొంత డబ్బులతో రూ.51 వేల బహుమతి ఇస్తానని ప్రకటించారు. ఆ ప్రకటన తర్వాత కోతి పట్టుబడటంతో ఇప్పుడు ఆ బహుమతి అందుతుందా? అన్న ఆసక్తి నెలకొంది.

కోతుల అల్లరి హర్యానాకే పరిమితం కాలేదు. తెలుగు రాష్ట్రాల్లోనూ పలు ప్రాంతాల్లో కోతులు ఇళ్లలోకి చొరబడటం, ఆహార పదార్థాలను ఎత్తుకెళ్లడం, దుకాణాల్లో వస్తువులను చిందరవందర చేయడం, కొన్నిసార్లు మనుషులపై దాడులకు దిగడం వంటి ఘటనలు తరచూ కనిపిస్తుంటాయి. కొన్ని చోట్ల గుంపులుగా వచ్చి ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి.
Advertisement
Most Wanted Monkey
Palwal Haryana
Municipal Chairperson Renulata
Monkey Capture Reward
Hathin Town News
Animal Menace India

More Telugu News