దోశలో ఎలుక కేసులో బిగ్ ట్విస్ట్.. ఫిర్యాదు చేసిన మహిళే నిందితురాలిగా అరెస్ట్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దోశలో ఎలుక కేసులో బిగ్ ట్విస్ట్.. ఫిర్యాదు చేసిన మహిళే నిందితురాలిగా అరెస్ట్!

Big twist in rat in dosa case as complainant woman gets arrested as accused
  • ముంబై హోటల్‌లో దోశలో చచ్చిన ఎలుక కలకలం
  • వీడియో వైరల్ కావడంతో హోటల్ లైసెన్స్ రద్దు
  • కేసును మూసివేయడానికి రూ. 25 లక్షలు డిమాండ్
  • ఫిర్యాదు చేసిన మహిళే బ్లాక్‌మెయిలర్‌గా అరెస్ట్
  • డబ్బు తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు
ముంబైలోని ఓ హోటల్‌లో దోశలో చచ్చిన ఎలుక వచ్చినట్లు ఆరోపించిన ఘటనలో ఊహించని మలుపు చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసి, సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవడానికి కారణమైన మహిళే.. హోటల్ యజమానిని బ్లాక్‌మెయిల్ చేస్తూ పట్టుబడింది. 

కేసును ఉపసంహరించుకోవాలంటే రూ. 25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసి, డబ్బు తీసుకుంటుండగా పోలీసులు ఆమెను రెడ్‌హ్యాండెడ్‌గా అరెస్ట్ చేశారు. ఈ నాటకీయ ఘటన ముంబైలో చర్చనీయాంశంగా మారింది.

అస‌లేం జ‌రిగిందంటే..!
ముంబైలోని బోరివలీ ప్రాంతంలో ఉన్న రాధాకృష్ణ హోటల్‌కు సెప్టెంబర్ 24న మాన్సీ ఆచార్య (36) అనే మహిళ మరో ఇద్దరు వ్యక్తులు, ఓ చిన్నారితో కలిసి వెళ్లింది. వారు ఆర్డర్ చేసిన మైసూర్ మసాలా దోశలో చనిపోయిన చిన్న ఎలుక కనిపించిందని ఆమె ఆరోపించింది. అప్పటికే తన సోదరుడు కొంత దోశ తిన్నాడని, ఎలుకను చూసి షాక్‌కు గురై వెంటనే వాంతి చేసుకున్నాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటనపై ఆమె వెంటనే బోరివలీ పోలీసులకు సమాచారం ఇచ్చింది.

ఆ తర్వాత ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో 'ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్' (ఎఫ్‌డీఏ) అధికారులు సెప్టెంబర్ 28న ఆ హోటల్ లైసెన్సును సస్పెండ్ చేశారు. దీంతో హోటల్ మూసివేత అంచుకు చేరిందని యజమాని ఆవేదన వ్యక్తం చేశారు. 

అయితే, ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. హోటల్ యజమానికి, ఆయన బంధువులకు గుర్తుతెలియని నంబర్ల నుంచి ఫోన్ కాల్స్ రావడం ప్రారంభమయ్యాయి. వీడియోను మరింత వైరల్ చేయకుండా ఉండాలంటే రూ. 25 లక్షలు ఇవ్వాలని బెదిరించారు.

నిరంతర ఫోన్ కాల్స్‌తో మానసికంగా వేధించడంతో చివరికి రూ. 6 లక్షలకు ఒప్పందం కుదిరింది. అప్పటికే యజమాని వారికి రూ. 1 లక్ష నగదు ఇచ్చారు. అనంతరం సెప్టెంబర్ 29న హోటల్ యజమాని బోరివలీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

బాధితుడి ఫిర్యాదు మేర‌కు పోలీసులు నిందితులను పట్టుకోవడానికి పక్కా స్కెచ్ వేశారు. ఒప్పందంలో భాగంగా డబ్బులు తీసుకొచ్చిన బాధితుడు అక్కడికి వచ్చినః మహిళకు ఇచ్చారు. ఆ స‌మ‌యంలో అక్క‌డే ఉన్న పోలీసులు ఆమె డబ్బు తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

తీరా చూస్తే ఆమె మరెవరో కాదని, తొలుత ఫిర్యాదు చేసిన గోరై నివాసి మాన్సీ అమిత్ ఆచార్య అని తేలింది. ఆమెను అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు ప్రారంభించారు. ఈ కేసులో ప్రమేయమున్న ఇతర నిందితుల పాత్రపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Mansi Acharya
Rat in dosa case
Mumbai hotel blackmail
Borivali police arrest
Radhakrishna Hotel
Extortion case Mumbai

More Telugu News