రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసు: నిందితుల అరెస్ట్.. 14 రోజుల రిమాండ్
- రాజమండ్రిలో వైద్య విద్యార్థులను కారుతో ఢీకొట్టిన ఘటన
- తీవ్ర గాయాలతో విద్యార్థిని ప్రియాంక పరిస్థితి విషమం
- ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
- నిందితులకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధింపు
- ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం, కఠిన చర్యలకు ఆదేశం
రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. వైద్య విద్యార్థిని ప్రియాంక ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడటానికి కారణమైన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం వారికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
వివరాల్లోకి వెళితే, రాజమహేంద్రవరంలోని ప్రసాద్ ఆదిత్య మాల్ గేటు వద్ద స్కూటర్‌పై వెళుతున్న వైద్య విద్యార్థులు ప్రియాంక, ఉమేష్‌లను ఓ కారు బలంగా ఢీకొట్టింది. మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు కారును నిర్లక్ష్యంగా నడుపుతూ ఈ ఘోరానికి పాల్పడ్డారు. ప్రమాదం జరిగిన తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
ఈ ప్రమాదంలో ప్రియాంక తలకు తీవ్ర గాయాలయ్యాయి. తొలుత స్థానికంగా చికిత్స అందించినప్పటికీ, పరిస్థితి విషమించడంతో ఆగస్టు 5న సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె వెంటిలేటర్‌పై ప్రాణాలతో పోరాడుతోంది. వైద్యులు కూడా బ్రెయిన్ డెడ్ గా ప్రకటించి ఆశలు వదులుకున్నారని, అవయవదానం గురించి కూడా ఆలోచిస్తున్నామని ఆమె తండ్రి కన్నీటిపర్యంతం కావడం పలువురిని కలచివేస్తోంది. విజయవాడకు చెందిన ఉమేష్ కూడా గాయాలతో చికిత్స పొందుతున్నాడు.
సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా రంగంలోకి దిగిన ప్రకాశ్ నగర్ పోలీసులు, నిందితులైన మొరంపూడి సాయినగర్‌కు చెందిన సురవరపు దుష్యంత్, లాలచెరువుకు చెందిన ఆండ్రూ విలియం జోసెఫ్‌లను అరెస్ట్ చేశారు. వారిని కోర్టులో హాజరుపరచగా, మేజిస్ట్రేట్ ఆగస్టు 21 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు.