2,600 ఏళ్ల క్రితమే 1,120 వ్యాధుల నమోదు.. భారత వైద్యుడికి స్కాట్లాండ్‌ అరుదైన గౌరవం

Sushruta honored by Scotland for recording 1120 diseases 2600 years ago
  • స్కాట్లాండ్‌లో సుశ్రుతుడి విగ్రహావిష్కరణ
  • 2,600 ఏళ్ల క్రితం సుశ్రుత సంహిత రచన
  • 1,120 వ్యాధుల వివరాల నమోదు
  • 300కుపైగా శస్త్రచికిత్స విధానాల ప్రస్తావన
  • భారత వైద్య విజ్ఞానానికి ప్రపంచ గుర్తింపు
ఆధునిక వైద్యశాస్త్రం ఇంకా అభివృద్ధి చెందని కాలంలోనే భారతీయ వైద్యుడు సుశ్రుతుడు విశేష కృషి చేశాడు. 2,600 ఏళ్ల క్రితమే 1,120 వ్యాధులను నమోదు చేశాడు. 700కు పైగా ఔషధ మొక్కలు, 300కుపైగా వైద్య విధానాలు, 120 శస్త్రచికిత్స పరికరాల వివరాలను లిఖితపూర్వకంగా భద్రపరిచాడు. ఇప్పుడు ఆయనకు స్కాట్లాండ్‌లో అరుదైన గౌరవం దక్కింది.

స్కాట్లాండ్‌లోని రాయల్‌ కాలేజ్ ఆఫ్‌ సర్జియన్స్‌ ఆఫ్‌ ఎడిన్‌బర్గ్‌ సుశ్రుతుడి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించింది. శస్త్రచికిత్స రంగానికి ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా ఈ గౌరవాన్ని ప్రకటించింది. ప్రపంచంలోనే అత్యంత పురాతన శస్త్రవైద్య కళాశాలగా గుర్తింపు పొందిన ఈ సంస్థ సుశ్రుతుడిని ‘ప్లాస్టిక్‌ సర్జరీ పితామహుడు’గా పేర్కొంది. 90 కిలోల బరువున్న ఈ విగ్రహాన్ని తమిళనాడులోని సంప్రదాయ శిల్పకారులు రూపొందించారు.

సుశ్రుతుడు రచించిన ‘సుశ్రుత సంహిత’ ప్రపంచంలోని ప్రాచీన వైద్య గ్రంథాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇందులో శస్త్రచికిత్స, శిశువైద్యం, మానసిక ఆరోగ్యం, కంటి ముక్కు చెవి వ్యాధుల వంటి అనేక అంశాలపై వివరాలు ఉన్నాయి. 300కుపైగా శస్త్రచికిత్స విధానాలు, 120కు పైగా పరికరాల వినియోగాన్ని ఇందులో వివరించారు.

మధుమేహం, స్థూలకాయం, గుండె సంబంధిత వ్యాధులకు సంబంధించిన లక్షణాలను కూడా సుశ్రుతుడు ప్రస్తావించినట్లు పరిశోధకులు చెబుతున్నారు. వ్యాయామం, జీవనశైలి ఆరోగ్యంపై చూపే ప్రభావాన్ని కూడా వివరించారు. శతాబ్దాల క్రితం ఆయన అందించిన వైద్య విజ్ఞానం ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అధ్యయనానికి కేంద్రబిందువుగా నిలుస్తోంది. ఎడిన్‌బర్గ్‌లో ఏర్పాటు చేసిన విగ్రహం భారత ప్రాచీన జ్ఞాన సంపదకు లభిస్తున్న అంతర్జాతీయ గుర్తింపును మరోసారి చాటిచెప్పింది.
Go Back to Shorts
Sushruta
Father of Plastic Surgery
Royal College of Surgeons Edinburgh
Sushruta Samhita
Ancient Indian Medicine
Scotland Sushruta Statue

More Telugu News