మా సినిమాకు ‘ఏ’ సర్టిఫికెట్ ఎందుకు ఇచ్చారో అర్థం కావడం లేదు: షాహిద్ కపూర్ ఆవేదన

Shahid Kapoor expresses disappointment over A certificate for Cocktail 2 movie
  • షాహిద్, రష్మిక, కృతి సనన్ కాంబినేషన్లో 'కాక్‌టెయిల్‌ 2' మూవీ
  • ఈ సినిమాకు 'ఏ' సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్ బోర్డు
  • ఈ చిత్రంలో ఒక్క అసభ్యకరమైన సన్నివేశం కూడా లేదన్న షాహిద్

బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ హీరోగా, రష్మిక మందన్న, కృతి సనన్ మెయిన్ లీడ్స్‌లో నటించిన లేటెస్ట్ క్రేజీ మూవీ ‘కాక్‌టెయిల్‌ 2’. భారీ అంచనాల మధ్య రీసెంట్‌గా థియేటర్లలోకి వచ్చిన ఈ ట్రయాంగిల్ లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా సినిమాకు సెన్సార్ బోర్డ్ షాక్ ఇస్తూ ‘ఏ’ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ నిర్ణయంపై హీరో షాహిద్ కపూర్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తూ తీవ్ర అసంతృప్తి, ఆశ్చర్యం వ్యక్తం చేశారు.


సెన్సార్ సర్టిఫికెట్‌పై షాహిద్ ఓపెన్‌గా స్పందిస్తూ.. "ఈ సినిమాలో ఎలాంటి అభ్యంతరకరమైన, అసభ్యకరమైన లేదా బోల్డ్ సీన్స్ అస్సలు లేవు. సినిమా మొత్తంలో అలాంటి ఒక్క సన్నివేశం కూడా మీకు కనిపించదు. ఇదొక పక్కా ఫ్యామిలీ ఓరియెంటెడ్ ఎమోషనల్ డ్రామా. మరి ఇలాంటి క్లీన్ చిత్రానికి సెన్సార్ వాళ్లు ‘ఏ’ సర్టిఫికెట్ ఎందుకు ఇచ్చారో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. ఎంత ఆలోచించినా లాజిక్ దొరకట్లేదు. ఇది ముగ్గురు వ్యక్తుల జీవితాల చుట్టూ తిరిగే కథ. కుటుంబ సమేతంగా థియేటర్లకు వచ్చి హ్యాపీగా నవ్వుకుంటూ చూసే సినిమా" అని చెప్పారు.


మరోవైపు, టాక్‌తో సంబంధం లేకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. మొదటి రోజే వరల్డ్ వైడ్‌గా దాదాపు రూ. 13 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా అనౌన్స్ చేసింది. ఈ వీకెండ్‌లో కలెక్షన్స్ రేంజ్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Advertisement
Shahid Kapoor
Cocktail 2 Movie
Rashmika Mandanna
Kriti Sanon
Censor Board A Certificate
Cocktail 2 Box Office Collection

More Telugu News